బాబు మరోసారి భారీ రిస్క్ చేయడానికి సిద్ధమయ్యారా?

ఏం చేయాలో పాలుపోవడం లేదు. జగన్ దూకుడు మీద ఉన్నాడు. టీడీపీ పూర్తిగా డీలా పడిపోయింది. జగన్ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ అన్ని వర్గాలకు దగ్గరవుతున్నారు. [more]

Update: 2021-01-24 08:00 GMT

ఏం చేయాలో పాలుపోవడం లేదు. జగన్ దూకుడు మీద ఉన్నాడు. టీడీపీ పూర్తిగా డీలా పడిపోయింది. జగన్ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ అన్ని వర్గాలకు దగ్గరవుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కీలకంగా మారాయి. తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూస్తే ఏవిధంగా చూసినా అర్థం కాకుండా ఉంది. ఒకవైపు బీజేపీ టార్గెట్ చేస్తుండటం, మరోవైపు పార్టీ నేతలు కూడా సహకరించక పోతుండటంతో చంద్రబాబుకు కంటి మీద కనుకు లేకుండా చేస్తుంది.

పాదయాత్ర చేయాలని…..

దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారంటున్నారు. మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. పాదయాత్ర ద్వారానే మళ్లీ ప్రజలకు చేరువకావాలని, క్యాడర్ లో జోష్ నింపాలని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన గతంలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీకోసం పాదయాత్రను చేశారు. ఇప్పుడు మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ మేరకు సీనియర్ నేతలకు చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది.

తొలుత లోకేష్ అనుకున్నా….

జమిలి ఎన్నికలు ఉండే అవకాశముండటంతో వీలయినంత త్వరగానే పాదయాత్ర ప్రారంభించాలని చంద్రబాబు భావిస్తున్నారట. తొలుత యువనేత లోకేష్ సైకిల్ యాత్ర చేయాలని నిర్ణయించారు. కానీ చంద్రబాబు యాత్ర చేస్తేనే సానుభూతి వస్తుందని ఎన్నికల వ్యూహకర్తలు కూడా చెప్పడంతో ఆయనే పాదయాత్ర చేయాలని నిర్ణయించారట. ఇందుకు రూట్ మ్యాప్ ను కూడా రూపొందించాల్సిందిగా పార్టీ ముఖ్యనేతలను ఆదేశించారని తెలిసింది.

అమరావతి నుంచే….?

పాదయాత్ర ప్రతి మండల కేంద్రం టచ్ అయ్యేలా చూడాలని చంద్రబాబు చెప్పారని తెలుస్తోంది. అయితే దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. పాదయాత్ర కారణంగా 70 ఏళ్ల వయసులో చేశారని ప్రజల్లో సానుభూతి వస్తుందని, అలాగే పార్టీ క్యాడర్ లో కూడా ఉత్సాహం పెరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. లోకేష్ యాత్రకు నో చెప్పి తానే స్వయంగా బయలుదేరాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఎప్పుడు? ఎక్కడ నుంచి అనేది మాత్రం త్వరలో తెలియనుంది. అమరావతి నుంచే పాదయాత్ర ప్రారంభించాలని చంద్రబాబు భావిస్తున్నారు.

Tags:    

Similar News