బాబుకు అందుకే అవకాశం లేదా?

చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకోవడానికి రోజూ లేఖలు రాస్తున్నారు. మోదీని పొగుడుతూ చప్పట్లు కొడుతున్న అటు నుంచి సౌండ్ లేదు. తాజాగా చంద్రబాబు రాసిన [more]

Update: 2020-05-09 12:30 GMT

చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకోవడానికి రోజూ లేఖలు రాస్తున్నారు. మోదీని పొగుడుతూ చప్పట్లు కొడుతున్న అటు నుంచి సౌండ్ లేదు. తాజాగా చంద్రబాబు రాసిన లేఖలో కేంద్ర ప్రభుత్వం సకాలంలో స్పందించకుంటే విశాఖపట్నం సర్వనాశనమయిపోయేదన్న లెవెల్ లో అక్షరాలు పొందుపర్చారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడకు వెళ్లి సహాయ కార్యక్రమాలు చేపట్టిన పోలీసులు, రెవెన్యూ సిబ్బంది విషయాన్ని మాత్రం చంద్రబాబు విస్మరించారు.

తిరుగుటపా లేదే?

కానీ మోదీ నుంచి తిరుగుటపాలో ఎలాంటి రెస్పాన్స్ లేదు. మరోవైపు విశాఖకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా విశాఖపట్నం వెళ్లి బాధితులను పరామర్శించి వచ్చారు. ఆయన ఏపీలో ఉండటంతో ఏపీ ప్రభుత్వం అనుమతితో ఆయన విశాఖ వెళ్లి వచ్చారు. కానీ చంద్రబాబు హైదరాబాద్ లో ఉండటం కారణంగా రెండు రాష్ట్రాల అనుమతి తీసుకోవాల్సి ఉంది. కానీ చంద్రబాబు మాత్రం కేంద్ర ప్రభుత్వానికి తనను అనుమతించాలని అర్జీ పెట్టుకున్నారు. దానిపై ఇంతవరకూ ఎలాంటి క్లారిటీ రాలేదు.

జడ్ ప్లస్ కేటగిరీతో పాటు….

దీనికి కారణాలున్నాయంటున్నారు. చంద్రబాబు జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు. ఆయన బయలుదేరితే వెంట కనీసం ముప్ఫయి మంది వరకూ ఉంటారు. వీరు కాకుండా టీడీపీ నేతలు ఎక్కువగా ఆయన వెంట విశాఖలో పర్యటించే అవకాశముంది. అసలే కరోనా వైరస్ వ్యాప్తి ఏపీలో ఎక్కువగా ఉంది. చంద్రబాబు విశాఖ వస్తే పార్టీ క్యాడర్ కూడా పెద్ద సంఖ్యలో రావచ్చన్న అంచనాతోనే ప్రభుత్వం చంద్రబాబుకు విశాఖపర్యటన అనుమతిపై ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

వయసును కూడా….

అంతేకాకుండా చంద్రబాబు వయసును కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబుకు డెబ్బయి ఏళ్లు. కరోనా వైరస్ త్వరగా సంక్రమించే అవకాశముండటంతో ప్రభుత్వం కూడా కొంత ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా చంద్రబాబుకు అనుమతిస్తే ప్రత్యేకంగా ఒక విమానానికి కూడా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో విమానాలను అత్యవసరసేవలకే వినియోగిస్తున్నారు. దీనివల్లనే చంద్రబాబు విశాఖ పర్యటనకు అనుమతి ఇవ్వలేదన్నది ఒక కారణంగా చెబుతున్నారు.

Tags:    

Similar News