చంద్రబాబుకు అస్సలు ఇష్టలేదట.. ఇష్టం లేకుండానే?

చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇంతటి సంక్షోభాన్ని చూసి ఉండరు. 2004 నుంచి 2014 వరకూ అధికారంలో లేకపోయినా చంద్రబాబు తాను చెప్పిందే వేదంగా పార్టీ [more]

Update: 2021-01-13 08:00 GMT

చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇంతటి సంక్షోభాన్ని చూసి ఉండరు. 2004 నుంచి 2014 వరకూ అధికారంలో లేకపోయినా చంద్రబాబు తాను చెప్పిందే వేదంగా పార్టీ లో నడిచింది. అయితే ఇప్పుడు చంద్రబాబులో కొత్త కోణం కనపడుతుంది. ఆయన ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ముఖ్యమైన నేతలతో సంప్రదిస్తున్నారని తెలిసింది. గతంలో తనంతట తానుగా తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు మాత్రం షేర్ చేసుకున్న తర్వాతనే చంద్రబాబు తీసుకుంటున్నారట.

రామతీర్థం పర్యటనకు….

ఇటవల రామతీర్థం పర్యటన కూడా చంద్రబాబు ఆలోచన నుంచి వచ్చింది కాదంటున్నారు. అసలు చంద్రబాబు రామతీర్థం కు వెళ్లేందుకు ఇష్టపడలేదు. హిందూ ఓటు బ్యాంకు కోసం వెళితే కొన్ని సామాజిక వర్గాలు దూరమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారంటున్నారు. దాదాపు నాలుగు రోజుల పాటు పార్టీ సీనియర్ నేతలు, ముఖ్యులతో రామతీర్థం పర్యటనపై చంద్రబాబు చర్చించిన తర్వాతనే ఫైనల్ గా నిర్ణయం తీసుకున్నారంటున్నారు.

మిగిలిన వర్గాలు…..

రాష్ట్రంలో ముస్లింల సంఖ్య ఉన్నప్పటికీ వరసగా జరుగుతున్న సంఘటనలతో వారు వైసీపీకి దూరమయ్యారని కొందరు సీనియర్ నేతలు చంద్రబాబుకు వివరించారట. అలాగే ఎస్సీ, ఎస్టీలు కూడా ఏకపక్షంగా జగన్ వైపు లేరని, వరసగా కేసులు నమోదవుతుండటం, అనేక సంఘటనలు జరుగుతుండటం ఇందుకు కారణంగా సీనియర్ నేతలు చెప్పారు. బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే రామతీర్థం వెళ్లక తప్పదని చంద్రబాబుకు సూచించారట.

అంతా ఆలోచించిన తర్వాతే….

అంతా ఆలోచించిన తర్వాత, అన్నీ లెక్కలు వేసుకున్న తర్వాతనే చంద్రబాబు రామతీర్థ వెళ్లేందుకు అంగీకరించారని పార్టీలో సీనియర్ నేత ఒకరు ఆఫ్ ది రికార్డు గా చెప్పారు. చంద్రబాబు అయిష్టంగానే వెళ్లారని, అయితే విశాఖలో ఆయనకు పలికిన స్వాగతం, రామతీర్థంలో తన పర్యటనకు లభించిన ఆదరణ చూసి చంద్రబాబు తాను తప్పుచేయలేదని సీనియర్ నేతల వద్ద వ్యాఖ్యానించారని తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నికకు కూడా రామతీర్థం పర్యటన ఉపయోగపడుతుందని చంద్రబాబు అభిప్రాయడ్డారని చెబుతున్నారు. మొత్తంమీద చంద్రబాబు గతంలో మాదిరిగా కాకుండా నేతలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచి పరిణామమంటున్నారు.

Tags:    

Similar News