బాబూ… ఆ అధికారం ఎవరిచ్చారంటే?

పిచ్చి అన్నా అనుకోవాలి. లేదా వినేవాళ్లు మతిభ్రమించిన వాళ్లని అయినా అనుకోవాలి. పదే పదే ఆ అధికారం ఎవరు ఇచ్చారంటూ చంద్రబాబు వేస్తున్న ప్రశ్నలు సోషల్ మీడియాలో [more]

Update: 2021-01-12 05:00 GMT

పిచ్చి అన్నా అనుకోవాలి. లేదా వినేవాళ్లు మతిభ్రమించిన వాళ్లని అయినా అనుకోవాలి. పదే పదే ఆ అధికారం ఎవరు ఇచ్చారంటూ చంద్రబాబు వేస్తున్న ప్రశ్నలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. ప్రజలు గుర్తించి అధికారం కట్టబెట్టిన విషయం చంద్రబాబు మర్చిపోయారా? అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను తప్పు పట్టవచ్చుగాని, ప్రతిపక్ష నేతగా ఉండి అధికారం ఎవరిచ్చారంటూ చంద్రబాబు ప్రశ్నించడాన్ని ఎద్దేవా చేస్తున్నారు.

జగన్ ను సీఎంగా….

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జగన్ ను అసలు ముఖ్యమంత్రిగా గుర్తించడం లేదు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అదే ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఖబడ్దార్ అంటూ జగన్ ను చంద్రబాబు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు జగన్ కు అధికారం పిచ్చోడి చేతిలో రాయి అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇరవై నెలలుగా ప్రజలు ఆ బాధను అనుభవిస్తున్నారని, ప్రజలంతా తిరగబడితేనే ప్రభుత్వం దిగి వస్తుందని చంద్రబాబు రెచ్చగొడుతున్నారు.

ఫ్రస్టేషన్ లోనే…

చంద్రబాబు మాటలను చూస్తే ఫ్రస్టేషన్ పీక్స్ లోనే ఉన్నట్లు స్పష్టమవుతుంది. ప్రజలు అనేకన్నా కార్యకర్తలు తిరబడండని పిలుపు నిస్తే బాగుంటుందన్న సూచనలు విన్పిస్తున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కీలక నేతలు, ద్వితీయ శ్రేణి నేతలపై వరసగా కేసులు నమోదవుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని సయితం పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా ప్రభుత్వం తీరు మారలేదు. దీంతోనే చంద్రబాబు ఫ్రస్టేషన్ తో ప్రజలు తిరగబడండి అని పిలుపునిస్తున్నారంటున్నారు. ఇంకా చంద్రబాబు తానే ముఖ్యమంత్రినని భావిస్తున్నారన్న కామెంట్స్ కూడా పడుతున్నాయి.

దూరంగా ఉండాలని….

నిజానికి చంద్రబాబు కొద్దికాలం హైదరాబాద్ కే పరిమితమయితే బెటరంటున్నారు. ఏపీలో కరోనా ఇంకా తగ్గుముఖం పట్టలేదు. రామతీర్థలో చంద్రబాబు అంతమంది జనం మధ్య పర్యటించినప్పుడు కొందరు సీనియర్ నేతలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ చంద్రబాబు మాత్రం తాను క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందేనని అంటున్నారు. ఇటు జనం మధ్యకు వెళ్లాల్సి రావడం, ఆ పరిస్థితులు జగన్ తనకు కల్పించడంతోనే పనికిరాని సీఎంగా జగన్ చంద్రబాబుకు కనపడుతున్నాడన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినపడుతున్నాయి.

Tags:    

Similar News