బాబు వెయిట్ చేసిన సమయం వచ్చేసిందట

చంద్రబాబు వెయిట్ చేస్తున్న సమయం వచ్చేసింది. ఇప్పుడిప్పుడే పార్టీ క్యాడర్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నేతలు సయితం ప్రభుత్వంపై విరుచుకుపడేందుకు ముందుకు వస్తున్నారు. ఇదే చంద్రబాబు కోరుకున్నది. [more]

Update: 2021-01-09 06:30 GMT

చంద్రబాబు వెయిట్ చేస్తున్న సమయం వచ్చేసింది. ఇప్పుడిప్పుడే పార్టీ క్యాడర్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నేతలు సయితం ప్రభుత్వంపై విరుచుకుపడేందుకు ముందుకు వస్తున్నారు. ఇదే చంద్రబాబు కోరుకున్నది. గత పద్దెనిమిది నెలలుగా చంద్రబాబు ఎంత చెప్పినా వీధుల్లోకి వచ్చేందుకు టీడీపీ నేతలు భయపడ్డారు. అధికార పార్టీతో గొడవ ఎందుకని? అనవసరంగా కేసులు నమోదవుతాయని లీడర్లు, క్యాడర్ కూడా పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు.

రెండు నెలల నుంచి…..

అయితే గడచిన రెండు నెలలుగా ఏపీలో పార్టీ పరిస్థితి ఆశాజనకంగా ఉంది. నేతలు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించి ప్రభుత్వాన్ని ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. దీంతో అనేక జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. కొందరు కరోనా కారణంగా గత ఏడాది నుంచి బయటకు రావడం లేదు.

అన్నింటికి దూరంగా….

టీడీపీ అధినేత చంద్రబాబు సయితం గత ఏడాది మార్చి నెల నుంచి హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అడపా దడపా అమరావతికి రావడం తప్ప ఆయన క్షేత్రస్థాయి పర్యటనలకు దూరంగా ఉన్నారు. కానీ కొత్త ఏడాదిలో మాత్రం పూర్తిగా అమరావతిలోనే ఉండాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. పార్టీని బలోపేతం చేసే లక్ష్యంగా, క్యాడర్ లో, లీడర్లలో ధైర్యం నింపేందుకు తాను కొత్త ఏడాదిలో అమరావతిలోనే ఉంటానని తన సన్నిహితులతో చెప్పినట్లు తెలిసింది.

ఇక క్షేత్రస్థాయి పర్యటనలకు…..

చంద్రబాబు ఇకపై క్షేత్రస్థాయి పర్యటనలకు కూడా ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రధానంగా ఆయన తొలుత విజయనగరం పర్యటన సక్సెస్ అయింది. త్వరలో విశాఖ పర్యటనకు వెళ్లాలని భావిస్తున్నారు. విశాఖలో అనేక మార్లు వెళ్లాలనుకున్నా పర్యటన వాయిదా పడింది. ఇక ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కూడా చంద్రబాబు పర్యటించనున్నట్లు తెలిసింది. ఇక పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలా చంద్రబాబు ప్లాన్ చేసుకుంటున్నారు. కొత్త ఏడాదిలో చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

Tags:    

Similar News