నిద్రలోనూ అదే గుర్తుకు వస్తుందట

తిరుపతి ఉప ఎన్నిక అధికార పార్టీ కన్నా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే ఇక్కడ టీడీపీ ప్రచారాన్ని ప్రారంభించింది. [more]

Update: 2021-01-03 00:30 GMT

తిరుపతి ఉప ఎన్నిక అధికార పార్టీ కన్నా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే ఇక్కడ టీడీపీ ప్రచారాన్ని ప్రారంభించింది. పార్లమెంటు పరిధిలో పార్టీని బలోపేతం చేసే చర్యలకు చంద్రబాబు దిగారు. ఇప్పటికే తిరుపతి పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మిని అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. పనబాక లక్ష్మి ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

అందరికంటే ముందుగానే…..?

అన్ని పార్టీల కంటే ముందు ప్రచారం చుట్టామన్న ఉత్సాహంలో టీడీపీ ఉంది. చంద్రబాబు కూడా నిత్యం తిరుపతి పార్లమెంటు పరిధిలోని పార్టీ నేతలతో టచ్ లో ఉంటున్నారు. రోజుకొకసారైనా వారితో టెలికాన్ఫరెన్స నిర్వహించి సమస్యలతో పాటు ప్రచారంలో ఎదురవుతున్న సవాళ్లను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. కనీసం అభ్యర్థి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం మండల కేంద్రంలో పర్యటించేలా చంద్రబాబు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని సూచించారు.

ఇప్పటి నుంచే కమిటీలు.. ఎంపికలు….

దీంతో పాటు దాదాపు పదివేల మంది కార్యకర్తలను చంద్రబాబు గుర్తించారు. వీరికి ఎన్నికల్లో ప్రత్యేక బాధ్యతలను అప్పగించనున్నారు. ప్రతి ఓటరును చేరి వీరు ప్రచారం నిర్వహించాల్సి ఉంటుంది. పోలింగ్ కేంద్రానికి చేర్చాల్సి ఉంటుంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో పనిచేసేందుకు ఎనిమిది వేల మంది కార్యకర్తలను ఎంపిక చేశారు చంద్రబాబు. ప్రతి మండలానికి ఒక ముఖ్యనేతను నియమించనున్నారు.

త్వరలో ప్రచారానికి…..

అలాగే పార్లమెంటు నియోజకవర్గంలో పర్యవేక్షణ కమిటీని కూడా ఎనిమిది మందితో కమిటీని కూడా రూపొందించారు. ఇక కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత తాను ప్రచారంలోకి దిగుతానని చంద్రబాబు నేతలతో చెప్పారట. బహుశ సంక్రాంతి పండగ తర్వాత ఒకసారి ప్రచారానికి వస్తానని, ముఖ్యమైన ప్రాంతంలో సభను ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద చంద్రబాబు నిద్రలోనూ తిరుపతి ఉప ఎన్నికను వదిలిపెట్టడం లేదని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News