నిత్యం నవ్వుల పాలు.. అంత…అవసరమా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికీ మారలేదు. తాను గతంలో చేసిన పనులే ఆయనకు శాపంగా మారాయి. విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ [more]

Update: 2020-05-09 09:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికీ మారలేదు. తాను గతంలో చేసిన పనులే ఆయనకు శాపంగా మారాయి. విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కోటి రూపాయల ఎక్స్ గ్రేషియోను ప్రకటించారు. దీనికి పార్టీల కతీతంగా అందరూ స్వాగతించారు. ఎవరూ ఊహించని రీతలో ప్రభుత్వం ఒక్కటే కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించడాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. ప్రమాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ నుంచి పరిహారాన్ని రాబడతామని జగన్ ప్రకటించారు. అయినా చంద్రబాబు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియోను తక్కువగా చేసి చూపడం విమర్శలను ఎదుర్కొంటోంది. చంద్రబాబు నిత్యం కామెడీ షో చేస్తూ కామ్రేడ్ గా మారిపోయారన్న టాక్ ఉంది.

ఆ సమయంలో అక్కడకు….

పైగా తాను ముఖ్యమంత్రిగా ఈ సమయంలో ఉంటే ప్రమాదస్థలికి వెళ్లేవాడినని చెప్పడం కూడా చోద్యంగా ఉందంటున్నారు. ప్రమాదకరమైన విషవాయువులు ముఖ్యమంత్రి జగన్ వెళ్లే సమయానికి ఇంకా గాలిలో ఉన్నాయి. ఇప్పటికీ అక్కడికి ప్రజలను అనుమతించడం లేదు. నిపుణులు గాలిలో విషవాయువులు లేకుండా ప్రయత్నిస్తున్నారు. 48 గంటలు అయితే తప్ప విషవాయువులు గాలినుంచి వెళ్లవని నిపుణులు చెబుతున్నమాట. అటువంటి పరిస్థితుల్లో ముఖ్మమంత్రిని ప్రమాదస్థలికి వెళ్లమనడం ఏంటన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో విన్పిస్తున్నాయి.

ఎక్స్ గ్రేషియో విషయంలో….

ఇక పరిహారం విషయానికి వస్తే గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన ఏ ప్రమాదానికి ఇంతటి పరిహారం ఇవ్వలేదు. కేవలం లక్షలతోనే సరిపెట్టారు. అప్పుడు కూడా పదుల సంఖ్యలో మరణించినా చంద్రబాబుకు మాత్రం ఎక్స్ గ్రేషియో ఇచ్చేందుకు మనసు రాలేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. 2014లో తూర్పుగోదావరి జిల్లాలోని నగరం గ్రామంలో గ్యాస్ పైప లైను లీకయి అనేకమంది మృత్యువాత పడ్డారు. కానీ అప్పుడు చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రకటించింది కేవలం మూడు లక్షలే. ప్రమాదానికి కారణమయిన గెయిల్ సంస్థ ఇరవై లక్షలు, కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల పరిహారాన్ని ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు.

అన్ని పార్టీలూ స్వాగతిస్తున్నా…

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ప్రమాదాలు జరిగాయి. మృతులకు ఎక్స్ గ్రేషియో ప్రకటించింది స్వల్ప మొత్తంలోనే. వీటిని లెక్కలతో సహా పక్కాగా సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు పోస్ట్ చేస్తున్నారు. చంద్రబాబు విశాఖపట్నం గ్యాస్ లీక్ విషయంలో ప్రతిపక్ష నేతగా నవ్వుల పాలయ్యారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలతో సహా అన్ని ఎక్స్ గ్రేషియోను స్వాగతిస్తుంటే చంద్రబాబు మాత్రం కావాలని విమర్శలు చేయడానికే సరిపోదని చెప్పడం విమర్శలపాలవుతుంది. ఇప్పటికైనా ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ కొంత సంయమనం పాటిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.

Tags:    

Similar News