బాబుకు సొంత సామాజికవర్గం భారీ షాక్ ?

చంద్రబాబు గండర గండడు, అపర చాణక్యుడు. తనకు ఊపిరి రాజకీయం. అందుకే తాను పుట్టిన సీమ ప్రాంతాన్ని సైతం వదిలేసి కోస్తా కమ్మలతో కలసి అడుగులు వేసిన [more]

Update: 2020-12-24 12:30 GMT

చంద్రబాబు గండర గండడు, అపర చాణక్యుడు. తనకు ఊపిరి రాజకీయం. అందుకే తాను పుట్టిన సీమ ప్రాంతాన్ని సైతం వదిలేసి కోస్తా కమ్మలతో కలసి అడుగులు వేసిన చరిత్ర బాబుది అంటారు. తెలుగుదేశం పార్టీ పుట్టినపుడు కులం వాసన ఎంత ఉందో కానీ ఎన్టీయార్ ని పదవీచ్యుతున్ని చేసినపుడు మాత్రం అది ఎంతలా ఊడల్లోకి దిగిపోయిందో లోకానికి తెలిసివచ్చింది. కేవలం పార్టీని కాపాడుకోవాలి. తమ కులానికి కేరాఫ్ గా ఉన్న టీడీపీ పుట్టె మునిగిపోతోంది అన్న భయంతోనే సొంత కులస్థులు అంతా ఏకమై పార్టీ పెట్టిన ఎన్టీయార్ ని వృద్ధాప్యంలో ఉన్నారని కూడా చూడకుండా దించేశారు.

నాడు అలా దిక్కు ….

ఇక ఎన్టీయార్ కి ధీటైన నాయకుడు నాడూ నేడూ కూడా చంద్రబాబు కాడు అన్నది సొంత కులం వారికే బాగా తెలుసు. కానీ రాజకీయాల్లో బాబు నేర్పరితనం, వ్యూహాలు, ఆనాటికి బలంగా ఉన్న కాంగ్రెస్ ని ఢీ కొట్టే నైపుణ్యం అన్నీ ఉన్నాయని తెలిసే ఆయన్ని కొత్త ముఖ్యమంత్రిని చేశారు. ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పార్టీలో మొదటి నుంచీ ఉన్నా కూడా బాబుకే ఎందుకు జై కొట్టారు అంటే అక్కడ తమ కులంలో కూడా ధీటైన నాయకుడు ఒకరు వారికి కావాలి కాబట్టి అలా చేశారు అని చెబుతారు. ఇక పాతికేళ్ళ పాటు టీడీపీ జెండాను మోసి పద్నాలుగేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు హయాంలో సొంత సామాజికవర్గం కూడా చాలానే బాగుపడింది అంటారు.

సేవలు ఇక చాలునా…?

గత ఎన్నికల్లో చంద్రబాబు ఎపుడైతే 23 సీట్లకు పడిపోయి పరపతి పూర్తిగా పోగొట్టుకున్నారో నాటి నుంచే ఆయనకు దూరంగా కమ్మలు జరుగుతూ వచ్చారని ప్రచారం అయితే ఉంది. బాబును మహానేతగా ఎత్తింది , మోసింది క్రిష్ణా గుంటూరు, ప్రకాశం జిల్లాలలోని పలుకుబడి కలిగిన సొంత సామాజికవర్గమే. వారి అండతోనే బాబు టీడీపీలో ఎన్నో మ్యాజిక్కులు. లాజిక్కులూ చేసారు. చంద్రబాబు అమరావతి రాజధాని వెనక ఉన్నది కూడా ఆ సామాజికవర్గమేనని కూడా చెబుతారు. ఇపుడు అమరావతి కల కరుగుతోంది. జగన్ మళ్ళీ సీఎం అయ్యాడూ అంటే ఇక ఏపీలో అమరావతి అణువు కూడా ఉండదని ఆ వర్గానికి బాగా తెలుసు. అందుకే ఇపుడు తమ కులపెద్ద, మీడియా అధిపతి అయిన పెద్ద మనిషి దగ్గర బాబు సామాజికవర్గం అంతా తమ గోడు వెళ్లబోసుకున్నారని గట్టిగా ప్రచారం సాగుతోంది. బాబు సేవలు ఇక చాలునని కూడా వారు తేల్చిచెప్పేశారని భోగట్టా.

ఆయనే రావాలి…..

తెలుగుదేశం పార్టీ బతికి బట్టకట్టాలీ అంటే జూనియర్ ఎన్టీయార్ రంగ ప్రవేశం చేయాల్సిందేనని కూడా తీర్మానించారని చెబుతున్నారు. చంద్రబాబు తన పుత్రరత్నం కోసం జూనియర్ ని దూరం పెట్టారని వారు ఆరోపించారని సమాచారం. అయితే రాజకీయాల్లో టీడీపీ వెలగాలన్నా జగన్ని ఎదుర్కోవాలన్నా కూడా జూనియర్ అయితేనే ధీటు అయిన నాయకుడు అని కూడా ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారుట. మొత్తానికి చంద్రబాబుకు నచ్చచెప్పి అయినా తెలుగుదేశంలోకి జూనియర్ వచ్చేలా చూడాలని వేడుకున్నారుట. మరి ఎన్టీయార్ ని దించి బాబుని సీఎం చేయడంతో కీలమైన పాత్ర పోషించిన ఆ మీడియా అధిపతి అంటే బాబుకు గురువుతో సమానం. బాబు ఆయన మాట వింటారా. జూనియర్ కి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారా అన్నది ఇక వేచి చూడాల్సిందే. ఒకవేళ చంద్రబాబు ధికరిస్తే ప్లాన్ బీ కూడా ఉంది అంటున్నారు. అపుడు జూనియర్ తోనే కొత్త పార్టీ పెట్టించి సొంత సామాజికవర్గం బాబుకూ ఆయన టీడీపీకి కోలుకోలేని దెబ్బ కొడుతుందని కూడా అంటున్నారు. చూడాలి మరి ఈ రాజకీయం ఏ వైపుగా సాగుతుందో.

Tags:    

Similar News