బాబు తో గేమ్స్ … సరైన నమయం కోసం?

విపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వింత పరిస్థితి ఎదురౌతూనే వస్తుంది. విశాఖపట్నం లో జగన్ సర్కార్ ల్యాండ్ పూలింగ్ ను పరిశీలించేందుకు లాక్ డౌన్ కి [more]

Update: 2020-05-09 03:30 GMT

విపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వింత పరిస్థితి ఎదురౌతూనే వస్తుంది. విశాఖపట్నం లో జగన్ సర్కార్ ల్యాండ్ పూలింగ్ ను పరిశీలించేందుకు లాక్ డౌన్ కి కొద్ది రోజుల ముందే అడుగుపెట్టారు. అయితే ఆయన్ను ఎయిర్ పోర్ట్ దాటి రాకుండా అడ్డుకున్నాయి వైసిపి వర్గాలు. విశాఖ రాజధాని కాకుండా అడ్డుకుంటున్న చంద్రబాబును అడుగుపెట్టనీయమని ఆందోళన ఉద్రిక్తం కావడంతో చంద్రన్న ను ప్యాక్ చేసి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కించేశారు పోలీసులు. సీన్ కట్ చేస్తే ఆ తరువాత కొంత గ్యాప్ లో తిరిగి వైజాగ్ వద్దామనుకున్న చంద్రబాబు కి కరోనా వైరస్ రూపంలో వచ్చి పడిన లాక్ డౌన్ బ్రేక్ వేసింది.

భాగ్యనగరంలోనే బాబు …

లాక్ డౌన్ మొదలైన నాటినుంచి చంద్రబాబు నిత్యం జూమ్ యాప్ ద్వారా తన వీడియో కాన్ఫరెన్స్ లతో దర్శనమిస్తున్నారు. ఏడుపదుల వయసులో ఉన్న చంద్రబాబు కేంద్రం నిర్ధేశించిన నిబంధనలు ప్రకారం లాక్ డౌన్ ఎత్తివేసినా వైరస్ దేశంలో పూర్తిగా కట్టడి అయ్యేవరకు బయటకు వస్తే ప్రమాదం. దాంతో ఆయన యాక్టివిటీ అంతా వీడియో కాన్ఫరెన్స్ లే. అదే ఆయన కాలక్షేపం గా మారింది. ఏ చిన్న సంఘటన జరిగినా అధికారంలో ఉన్నా లేకపోయినా క్షేత్ర స్థాయిలోకి హుటాహుటిన వెళ్ళే అలవాటు చంద్రబాబు ది. అయితే ఆయన దురదృష్టం కొద్ది తెలంగాణ లో ఉండటం ఎపి లో జగన్ సర్కార్ అధికారంలో ఉండటంతో రెండు ప్రభుత్వాల అనుమతితో అడుగు పెట్టాలిసి ఉంటుంది. వీరిద్దరిని యాచించేందుకు ఆయనకు సుతరామూ ఇష్టం లేదు. దాంతో విశాఖ వెళ్ళొస్తా అంటూ కేంద్రాన్ని అనుమతి కోరారు. ఆయన పర్యటన రాజకీయ ప్రయోజనాలతో కూడినది అని భావించిందో ఏమో కానీ కేంద్రం కూడా ఎస్ అనలేదు నో చెప్పలేదు.

రండి అంటూనే …

మరోపక్క జగన్ సర్కార్ లోని మంత్రులు చంద్రబాబుతో ఆడుకుంటున్నారు. ఆయన విశాఖ ఎందుకు రావడం లేదు అంటూనే ఏపీకి వస్తే క్వారంటైన్ లో ఉండాలిసిందే అంటూ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు టిడిపి శ్రేణులకు వళ్ళు మండేలా చేస్తున్నాయి. ఇదెక్కడి గేమ్స్ అంటూ వారు వాపోతున్నారు. రమ్మని పిలవడం ఎందుకు వస్తే లోపల వేస్తాం అని ప్రకటించడంఎందుకని ప్రశ్నిస్తూ తమ్ముళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ప్రస్తుతం ఏమి చేయలేక టెక్నాలజీ సహకారంతోనే ప్రజల్లో ఉండేలా తమ్ముళ్ళకు కోచింగ్ ఇస్తూ తాను అదే పనిలో ఉన్నారు చంద్రబాబు. తనతో గేమ్ ఆడుతున్న వారందరికి సరైన జవాబు చెప్పాలని సమయం కోసం ఎదురు చూస్తున్నారు టిడిపి అధినేత.

Tags:    

Similar News