వీరిని పక్కన పెట్టకుంటే నిండా మునగడం ఖాయమే

రాజకీయం అంటే వారసత్వంగా మారిపోయింది. జవసత్వాలతో పోరాడాల్సిన వారు కాస్తా తాత తండ్రులను నమ్ముకుంటున్నారు. ఇక తండ్రి పెద్దవాడు అవడంతోనే కుమారుడు ఆస్తితో పాటు తండ్రి రాజకీయాన్ని [more]

Update: 2020-12-15 03:30 GMT

రాజకీయం అంటే వారసత్వంగా మారిపోయింది. జవసత్వాలతో పోరాడాల్సిన వారు కాస్తా తాత తండ్రులను నమ్ముకుంటున్నారు. ఇక తండ్రి పెద్దవాడు అవడంతోనే కుమారుడు ఆస్తితో పాటు తండ్రి రాజకీయాన్ని వీలునామా రాసుకుని మరీ ఆ నియోజకవర్గం జనాలను దత్తత తీసేసుకుంటున్నారు. అయితే రాచరికం మాదిరిగా మారిన ఈ ఒప్పందాలను, పెత్తనాలను ప్రజలు అంగీకరించకపోవడంతోనే వారసులు వరసపెట్టి ఓడుతున్నారు అంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీలో చూస్తే ఈ వారసత్వ రాజకీయాలు ఎక్కువ అయిపోయాయి. దాంతో పార్టీని నమ్ముకున్న తమ్ముళ్ళు అధినాయకత్వం మీద గుర్రుమంటున్నారు.

పార్టీ పదవులు వారికే….

చంద్రబాబు తాజాగా ప్రకటించిన వందలాది పార్టీ పదవులు అన్నీ కూడా జాగ్రత్తగా వారసులకు పంచిపెట్టారు. బయట మాత్రం మీడియాతో మాట్లాడుతూ యువ రక్తం అంటూ బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. యువత అంటే సీనియర్ నేత కొడుకు, కూతురేనా అంటూ ఎక్కడికక్కడ తమ్ముళ్ళు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు. వీధి పోరాటాలకు దిగుతున్నారు. అందువల్లనే చంద్రబాబు వేసిన కమిటీలు క్లిక్ అవలేదు, పార్టీకి కొత్తగా జవసత్వాలు రాలేదు అని అంటున్నారు.

పక్కన పెట్టాల్సిందే …

సీనియర్ నేతలను పక్కన పెట్టకపోతే టీడీపీ నిండా మునగడం ఖాయమని తమ్ముళ్ళ నుంచి వస్తున్న కఠిన సూచనలు. రాష్ట్రంలో ఎపుడో నాలుగు దశాబ్దాల క్రితం పార్టీలో చేరిన యనమల రామక్రిష్ణుడు అయ్యన్నపాత్రుడు, అశోక్ గజపతిరాజు, కిమిడి కళా వెంకటరావు, కింజరాపు ఫ్యామిలీ, గౌతు శివాజీ ఫ్యామిలీ బెజవాడ సైడ్ వెళ్తే గద్దే, దేవినేని, కేశినేని ఫ్యామిలీస్, సీమ వైపు చూస్తే పరిటాల ఫ్యామిలీ, జేసీ ఫ్యామిలీ, కోట్ల, కేయీ, భూమా ఫ్యామిలీస్, నెల్లూరు చిత్తూరు వైపు కనుక ఆలోచిస్తే గల్లా ఫ్యామిలీ, సోమిరెడ్డి ఫ్యామిలీ ఇలాగే టోటల్ గా టీడీపీలో పొలిటికల్ సీన్లు కనిపిస్తున్నాయి. బాబు వీరినే అట్టేపెట్టుకుని ఇంకా ముతక రాజకీయం చేస్తున్నారన్న అపవాదు కూడా ఉంది.

అదే వీక్ నెస్ తో ……

ఇక ఈ సీనియర్లను వారి వారసులను బాబు తప్పించగలరా అంటే కుదరదు అన్న మాట వస్తోంది. దానికి ప్రధాన‌ కారణం చంద్రబాబు వీక్ నెస్. అవును బలమైన చంద్రబాబులో కొడుకు లోకేష్ రూపంలో ఒక అతి పెద్ద బలహీనత ఉంది. లోకేష్ ని నాయకుడిగా పార్టీ అంగీకరించాలంటే ఈ వారసులకు పదవులు ఇవ్వకతప్పని పరిస్థితి బాబుది. చంద్రబాబుకు ఒక రూల్, సీనియర్లకు మరో రూల్ ఉండదుగా, అందుకే జై లోకేష్ అనాలంటే తమ కుమారుడు, కుమార్తె, సోదరుడు, బంధువులకు పదవులు ఇచ్చి తీరాల్సిందే అని సీనియర్లు డిమాండ్ చేసే పరిస్థితి టీడీపీలో ఉందని అంటున్నారు. ఈ కారణంగానే చంద్రబాబు కూడా అలా వరసపెట్టి పదవులు వారసులకే ఇచ్చుకుంటూ పోతున్నారు. మరి రేపటి రోజున వీరికే టికెట్లు కూడా ఇస్తారు. కానీ గెలిపించాల్సింది మాత్రం అందరికీ కార్యకర్తలే. జనం లో లేని జవసత్వాలు లేని వారిని తెచ్చి పదవులు అప్పగిస్తే గెలుపు ఎలా సాధ్యమవుతుందో సీనియర్లే చెప్పాలి మరి. మొత్తానికి టీడీపీ వారసుల విషవలయంలో చిక్కుకుని విలవిలలాడుతోంది. బాబు డేర్ చేస్తేనే తప్ప ఏ వలయం విడిపోదు. అంతవరకూ టీడీపీకి అంతే సంగతులు మరి.

Tags:    

Similar News