మళ్లీ మళ్లీ అదే తప్పు…బాబుకు ఎగ్జిట్ తెలియడం లేదా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేసిన తప్పు పదే పదే చేస్తున్నారు. మరోసారి కాంగ్రెస్ తో కలసి నడుస్తూ పార్టీ క్యాడర్ కు తప్పుడు సంకేతాలను పంపుతున్నారన్న [more]

Update: 2020-05-11 03:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేసిన తప్పు పదే పదే చేస్తున్నారు. మరోసారి కాంగ్రెస్ తో కలసి నడుస్తూ పార్టీ క్యాడర్ కు తప్పుడు సంకేతాలను పంపుతున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ తో కలసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తుంది. అక్కడ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలసి కలియదిరుగుతుండటం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణలో కలసి పోటీ చేసి…..

2018 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలసి పోటి చేసింది. మహాకూటమిగా ఏర్పడటంతో తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ,సీపీఐ, కోదండరామ్ పార్టీలు కలసి పోటీ చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో మహాకూటమి ఫెయిలయింది. మరోసారి తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు పట్టం కట్టారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్లనే కాంగ్రెస్ రెండోసారి కూడా తెలంగాణలో అధికారంలోకి రాలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నేతలు బాహాటంగానే విమర్శలుచేశారు.

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో…

ఏపీలో అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో వైరాన్ని పెంచుకున్న చంద్రబాబు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. కాంగ్రెస్ తో కలసి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు కూడా చేశారు. రాహుల్ గాంధీతో సమావేశమై చంద్రబాబు చర్చించారు. రాహుల్ తో కలసి పలు సభల్లో కూడా పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ తో కలవడం కలసి రాకపోవడంతో ఏపీలో మాత్రం చంద్రబాబు ఒంటరిగానే పోటీ చేశారు. అయినా కూడా చంద్రబాబు అధికారంలోకి రాలేకపోయారు. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ తో కలవడాన్ని ఏపీ ప్రజలు గత ఎన్నికల్లో చంద్రబాబును తిరస్కరించారు.

తెలంగాణలో మాత్రం తిరిగి….

ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు తిరిగి కాంగ్రెస్ కు దూరమయ్యారు. కాంగ్రెస్ తో గత పదకొండు నెలల నుంచి టచ్ లో లేరు. మళ్లీ మోదీ వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నారన్నది వాస్తవం. అయితే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ తో కలసి నడవడం ఎలాంటి సంకేతాలను పంపుతున్నారన్నది ఏపీ టీడీపీ నేతల్లో కూడా చర్చనీయాంశమైంది. అయితే చంద్రబాబు మాత్రం ఇక్కడ టీడీపీ వాయిస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేకుంటే బాగుండదని ఎల్ రమణను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రంగంలోకి దించారంటున్నారు. నలబై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు మళ్లీ డబుల్ స్టాండ్ తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

Tags:    

Similar News