శాశ్వత స్లోగన్ కు దూరమయినట్లేనా… ?

హైదరాబాద్ నేనే నిర్మించా. నా విజన్ తోనే విశ్వనగరం ఏర్పాటు అయ్యింది. అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు చెప్పుకోని వేదిక ఉండనే ఉండదు. సందర్భం అయినా కాకపోయినా [more]

Update: 2020-12-05 13:30 GMT

హైదరాబాద్ నేనే నిర్మించా. నా విజన్ తోనే విశ్వనగరం ఏర్పాటు అయ్యింది. అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు చెప్పుకోని వేదిక ఉండనే ఉండదు. సందర్భం అయినా కాకపోయినా హైదరాబాద్ అభివృద్ధి ప్రస్తావన తెచ్చి అదంతా తన కృషి అని ఆ నగరాన్ని బ్రాండ్ చేసేసా అనేది చంద్రబాబు శాశ్వత స్లోగన్. ఆయన చెప్పుకున్నట్లే 2014 ఎన్నికల్లో తెలంగాణ అంతా గల్లంతు అయినా హైదరాబాద్ లో అత్యధిక ఎమ్యెల్యే సీట్లు గెలిచి సత్తా చాటింది. ఆ తరువాత వారంతా అభివృద్ధి పేరుతో అధికారపార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరిపోయి సైకిల్ ను నడిరోడ్డుపై పడేశారు. అయినప్పటికి ఎక్కడ బలం ఉన్నా లేకపోయినా భాగ్యనగర్ లో నేతలు పోయినా క్యాడర్ తమ పార్టీ వెంటే అని సీమాంధ్రులు జై తెలుగుదేశం అంటారన్నది చంద్రబాబు అంచనా.

చక్రం తిప్పింది గులాబీ …

ఎక్కడైతే సీమాంధ్రులు ఎక్కువగా ఉంటారో అక్కడ అనూహ్యంగా గులాబీ పార్టీ తమ జండా ఎగురవేసి టిడిపి ఆశలపై నీళ్ళు చల్లేసింది. సెటిలర్స్ ఎక్కువగా ఉండే కుత్బుల్లాపూర్ లో 8 స్థానాలకు 7 గెలిచింది గులాబీ. కూకట్ పల్లి లోను అదే జోరు చూపించింది అధికారపార్టీ 8 స్థానాలకు 7 చోట్ల కారు దూసుకుపోయింది. శేర్ లింగంపల్లి లో 10 స్థానాలకు 9 కైవసం చేసుకుంది గులాబీ. జూబిలీ హిల్స్ లో ఆరు స్థానాలకు 4 గెలిచి సెటిలర్స్ ప్రాంతాల్లో తనకు తిరుగు లేదని నిరూపించింది. అంతేకాదు ఈ ప్రాంతాలు తమవేనని ఇన్నాళ్లు ధీమాగా ఎన్నికలు వచ్చినప్పుడు హడావిడి చేస్తున్న టిడిపి కి కనీస ఆశలు భవిష్యత్తుపై లేకుండా చేసింది గులాబీ. హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అయినా రెండు స్థానాలు గెలిస్తే జాతీయ పార్టీగా ప్రకటించుకున్న చంద్రబాబు పార్టీ టీడీపీ మాత్రం 106 స్థానాలకు పోటీ చేసి ఎక్కడా ఒక్క అభ్యర్ధికి డిపాజిట్ దక్కించుకోలేక పూర్తిగా అభాసుపాలు అయ్యింది.

టిడిపి ని అవే దెబ్బకొట్టాయా … ?

పదేళ్ళపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ ఉండే అవకాశాన్ని టిడిపి అధినేత చంద్రబాబు దూరం చేశారని సెటిలర్స్ లో సైకిల్ కి ప్రధానంగా మైనస్ లో పడేసింది అంటున్నారు. దీనికి తోడు గత సార్వత్రిక ఎన్నికల్లో ఎపి లో టిడిపి చారిత్రాత్మక ఓటమి ప్రభావం కూడా భాగ్యనగర ఎన్నికల్లో టిడిపి కి చేదు అనుభవం మిగిలేలా చేసిందని భావిస్తున్నారు. వీటితోపాటు కరోనా సమయంలో నెలల తరబడి హైదరాబాద్ లోనే ఉన్నా తెలంగాణా లో పార్టీ పటిష్టతపై అధినేత చంద్రబాబు కానీ ఆయన తనయుడు లోకేష్ దృష్టి పెట్టడంతో క్యాడర్ బాగా డీలా పడింది. ఎపి రాజకీయాలపై ఉన్న ఫోకస్ చంద్రబాబు కి తెలంగాణ రాజకీయాలపై లేదన్నది సొంత పార్టీ వారితోపాటు హైదరాబాద్ లో ఉన్న ప్రజలకు అర్ధం అయిపోవడంతో విధ్వంసకర ఫలితాన్ని టిడిపి చవిచూసిందని విశ్లేషకుల అంచనా.

Tags:    

Similar News