చంద్రబాబు చేసిన తప్పు అదేనా?

గ‌డిచిన ఐదేళ్ల చంద్రబాబు పాల‌న‌లో మిగిలిన జిల్లాల‌కు కృష్ణా జిల్లాకు మ‌ధ్య చాలా వ్యత్యాసం ఉంది. మిగిలిన జిల్లాల్లో మంత్రుల‌ను ఆయ‌న మార్చిన‌ప్పటికీ.. ఈ జిల్లా నుంచి [more]

Update: 2020-05-02 03:30 GMT

గ‌డిచిన ఐదేళ్ల చంద్రబాబు పాల‌న‌లో మిగిలిన జిల్లాల‌కు కృష్ణా జిల్లాకు మ‌ధ్య చాలా వ్యత్యాసం ఉంది. మిగిలిన జిల్లాల్లో మంత్రుల‌ను ఆయ‌న మార్చిన‌ప్పటికీ.. ఈ జిల్లా నుంచి ఇద్దరికి ఇచ్చిన మంత్రి ప‌ద‌వులను మాత్రం ఆయ‌న ఐదేళ్లు కొన‌సాగించారు. అదే స‌మ‌యంలో విప్‌లుగాను, కీల‌క ప‌ద‌వులైన డిప్యూటీ స్పీక‌ర్ ‌గాను ఈ జిల్లాకు చెందిన నాయ‌కుల‌కే చంద్రబాబు ప‌ద‌వులు ఇచ్చారు. ఇలా ఐదేళ్ల పాటు కృష్ణా జిల్లా నాయ‌కులు టీడీపీలోను, ప్రభుత్వంలోనూ ఆడింది ఆట‌గా ముందుకు సాగారు. జిల్లాలో ఎంద‌రు సీనియ‌ర్లు ఉన్నా మంత్రి దేవినేని వ‌న్ మ్యాన్ షో కొన‌సాగింది. టీడీపీ వ‌ర్సెస్ టీడీపీ నేత‌ల మ‌ధ్య కూడా పెద్ద ‌యుద్ధాలే న‌డిచాయి.

పదవులన్నీ వారికే…..

అయితే, గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో పార్టీ అధికారం కోల్పోయింది. మ‌రి ఇప్పుడు పార్టీకి వీరు ఏమైనా అండ‌గా నిలుస్తున్నారా? అంటే సందేహంగానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కృష్ణాజిల్లా నుంచి దేవినేని ఉమ, కొల్లు ర‌వీంద్రల‌కు చంద్రబాబు మంత్రి వ‌ర్గంలో చోటుక‌ల్పించారు. అదేస‌మ‌యంలో మ‌రో కీల‌క నాయ‌కుడు, సీనియ‌ర్ నేత మండ‌లి బుద్ధ ప్రసాద్‌కు డిప్యూటీ స్పీక‌ర్‌గా ఛాన్స్ ఇచ్చారు. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బొండా ఉమాకు టీడీపీ బోర్డులో స‌భ్యుడిగా ఛాన్స్ ఇచ్చారు. ఎమ్మెల్సీలు బుద్దా వెంక‌న్నకు విప్ హోదా ఇచ్చారు. విజ‌య‌వాడ న‌గ‌ర పార్టీ ఇంచార్జ్‌గా అవ‌కాశం ఇచ్చా రు.

కొందరు మాత్రమే…..

ఇక రూర‌ల్ జిల్లా అధ్యక్షుడు బ‌చ్చుల అర్జునుడు సైతం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. వీరంతా పార్టీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో చెల‌రేగిపోయారు. కానీ, ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయిన త‌ర్వాత మాత్రం ఒక‌రిద్దరు త‌ప్ప ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. దేవినేని ఉమ, బొండా ఉమ, బుద్ధా వెంక‌న్నలు మాత్రం మీడియాతో ట‌చ్‌లో ఉంటూ. జ‌గ‌న్ ప్రభుత్వంపై విమ‌ర్శలు చేస్తూ.. పార్టీని ఎంతో కొంత ముందుకు తీసుకు వెళ్తున్నార‌ని చెప్పాలి. మిగిలిన నాయ‌కులు మాత్రం ఇప్పటివ‌ర‌కు ఎవ‌రూ బ‌య‌ట‌కు రాలేదు. మండ‌లి బుద్ధ ప్రసాద్ ఇప్పటి వ‌ర‌కు ప్రభుత్వంపై విమ‌ర్శ కూడా చేయ‌లేదు. పోనీ.. టీడీపీ వాయిస్ వినిపించారా? అంటే అది కూడా లేదు. అదే బాట‌లో చాలా మంది నాయ‌కులు ఉన్నారు.

ప్రాధాన్యత ఇచ్చిన వారే….

గ‌న్నవ‌రం నుంచి గెలిచిన వంశీ పార్టీమారిపోయారు. ఎంపీ కేశినేని నాని మాత్రం అటు సోష‌ల్ మీడియాలోనూ, అప్పుడ‌ప్పుడు ఢిల్లీలోనూ హ‌ల్‌చ‌ల్ చేస్తుంటారు. ఇక విజ‌య‌వాడ తూర్పు ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ ముందు నుంచి త‌న దారి తన‌దే అన్నట్టుగా ఉంటారు. ఈ క్రమంలోనే క‌రోనా నేప‌థ్యంలో ఆయ‌న దీక్షకు దిగారు. ఇక మాజీ మంత్రి జ‌వ‌హ‌ర్ మాత్రం మీడియా చ‌ర్చల్లో నానుతుంటారు. ఇక మిగిలిన నాయ‌కులు కూడా ఎవ‌రి దారి వారిదే అన్నట్టుగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్రబాబు గ‌తంలో ఈ జిల్లా నేత‌ల‌కు ఇచ్చిన ప్రాధాన్యం వృధా అయిందే.. అనే చ‌ర్చ సాగుతుండ‌డం పార్టీలో సీనియ‌ర్లను వేధిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News