బాబుకు రివర్స్ లో తంతున్నది అదేనా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భయపడుతుందా జరుగుతుందా? ఒకప్పుడు తాను ఎదగనివ్వ కుండా చేసిన బీజేపీయే ఇప్పుడు తనకు ఇబ్బందులు తెచ్చిపెడుతుందన్న ఆందోళనలో చంద్రబాబు ఉన్నారు. ఏపీలో [more]

Update: 2020-12-06 11:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భయపడుతుందా జరుగుతుందా? ఒకప్పుడు తాను ఎదగనివ్వ కుండా చేసిన బీజేపీయే ఇప్పుడు తనకు ఇబ్బందులు తెచ్చిపెడుతుందన్న ఆందోళనలో చంద్రబాబు ఉన్నారు. ఏపీలో బీజేపీ బలపడితే అది తెలుగుదేశం పార్టీకే ఎక్కువ నష్టం. టీడీపీ ఓటు బ్యాంకునే బీజేపీ చీల్చుకునే అవకాశముంది. అందుకే చంద్రబాబు కు ఇప్పుడు రెండు సవాళ్లు ఉన్నాయి. ఒకటి అధికార వైసీపీని ఎదుర్కొనడమే కాకుండా ఏపీలో బీజేపీని ఎదగనివ్వకుండా చేయడం.

తమను ఎదగనివ్వలేదని…..

బీజేపీ నేతలు చేసే ఆరోపణ ప్రధానంగా ఒక్కటే. గత మూడు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని ఎదగనివ్వకుండా చేసింది చంద్రబాబేనని. తనకు అవసరం వచ్చినప్పుడల్లా తమతో పొత్తు పెట్టుకుని, ఆ తర్వాత తెంచుకోవడం చంద్రబాబుకు అలవాటు అని బీజేపీ నేతలు నిత్యం విమర్శిస్తారు. 2014 ఎన్నికల్లోనూ చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏపీలో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత పొత్తును తనంతట తానే తెంచుకున్నారు.

సొంతంగా ఎదిగేందుకు…..

అయితే ఈసారి బీజేపీ ఆ పొరపాట్లు చేయదలచుకోలేదు. తాము సొంతంగా ఎదిగేందుకు ప్రయ్నతిస్తుంది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లో సొంతంగా ఎదిగేందుకు శక్తియుక్తులను కూడగట్టుకుంటుంది. తెలంగాణలో సాధ్యమయింది.. ఏపీలో ఎందుకు సాధ్యం కాదని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబుకు అదే భయం పట్టుకుంది. బీజేపీ ఎంత స్ట్రాంగ్ అయితే తమకు అంత లాస్ అని భావిస్తున్నారు.

బీజేపీ ఎదిగితే…..

అందుకే బీజేపీ స్ట్రాంగ్ అవ్వకుండా చూడాలని చంద్రబాబు ప్రతి నియోజకవర్గ నేతలకు నూరిపోస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లోనూ బీజేపీకి డిపాజిట్లు రాకుండా చేయగలిగితే చాలట. తాము ఓడినా పరవాలేదు. బీజేపీకి అక్కడ ఏమీ లేదని చెప్పడమే చంద్రబాబు ముందున్న ప్రధాన కార్యాచరణ ప్రణాళిక అంటున్నారు. నిజమే తటస్థులు, మేధావులు, కొన్ని సామాజికవర్గాలు టీడీపీకి సానుభూతిపరులుగా ఉన్నారు. అదే బీజేపీ స్ట్రాంగ్ అయితే వారంతా అటువైపు వెళ్లే అవకాశముందని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. మరి కమలాన్ని ఎదగనివ్వకుండా చంద్రబాబు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో చూడాలి మరి.

Tags:    

Similar News