అందుకే వాటికి దూరంగా ఉన్నారట

గత ఎన్నికలు అన్ని పార్టీలకూ గుణపాఠం చెప్పాయి. అలవికాని చోట అథికులమనరాదన్న సామెత అచ్చంగా తెలుగుదేశం పార్టీకి వర్తిస్తుంది. గత గ్రేటర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ [more]

Update: 2020-12-02 08:00 GMT

గత ఎన్నికలు అన్ని పార్టీలకూ గుణపాఠం చెప్పాయి. అలవికాని చోట అథికులమనరాదన్న సామెత అచ్చంగా తెలుగుదేశం పార్టీకి వర్తిస్తుంది. గత గ్రేటర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. అయితే ఒక్క స్థానంలోనే గెలిచింది. ముఖ్యంగా ఆంధ్ర మూలాలున్న ప్రాంతాల్లో తనకు పట్టుందని భావించి టీడీపీ అక్కడే ఎక్కువగా అభ్యర్థులను బరిలోకి దింపింది. కానీ సెంటిమెంట్ కారణంగా గత ఎన్నికలు టీడీపీకి కలసి రాలేదు.

వెనక నుంచి…..

ఈసారి కూడా టీడీపీ గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. దాదాపు వందకు పైగా స్థానాల్లో తన అభ్యర్థులను బరిలోకి దించింది. అయితే ఈసారి తెలివిగా చంద్రబాబు ఇక్కడి నాయకత్వానికే బాధ్యతలను అప్పగించారు. చంద్రబాబు వెనక నుంచి సలహాలు, సూచనలు ఇస్తున్నప్పటికీ నేరుగా ఈ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదు. అభ్యర్థుల ఎంపిక, మ్యానిఫేస్టో ప్రకటన వంటి అంశాలన్నీ తెలంగాణ టీడీపీ నేతలే చూసుకోవడం విశేషం.

గత ఎన్నికల్లో అంతా…..

గత ఎన్నికల్లో అంతా చంద్రబాబు దగ్గరుండి చూశారు. చంద్రబాబు, లోకేష్ , బాలకృష్ణ వంటి వారు గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేశారు. తమకు పట్టున్న ప్రాంతాల్లో ఏపీ నుంచి నేతలను ఇక్కడికి రప్పించి వ్యూహాలను అమలు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో దీనికోసం అప్పుడు ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేశారు. కులాల వారీగా నేతలను హైదరాబాద్ కు ఏపీ నుంచి రప్పించి మరీ వ్యూహాలు రచించారు. పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, జూపూడి ప్రభాకర్ రావు వంటి వారు ప్రచారం చేశారు. అయినా అప్పుడు టీడీపీ పెరఫ్మార్మెన్స్ పూర్ గానే ఉంది.

ఈసారి భిన్నంగా…..

అయితే ఈసారి చంద్రబాబు గతానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నారు. తనతో సహా ఆంధ్ర ముద్ర ఉన్న నేతలు ఎవరూ ప్రచారానికి రాలేదు. కేవలం ఎన్నికల నిధులు మాత్రం ఇచ్చి పోటీ చేయమని చెప్పారు. అవసరమైన సలహాలను మాత్రమే ఇచ్చారు. తాము రంగంలోకి దిగితే కేసీఆర్ కు అడ్వాంటేజీగా మారుతుందని భావించిన చంద్రబాబు ఈసారి ఆ తప్పు చేయలేదు. ఈసారైనా నాలుగు సీట్లు టీడీపీకి వస్తాయో? లేదో? చూడాల్సి ఉంది.

Tags:    

Similar News