కొత్త ఏడాది జాతకాలు తేలిపోతాయా ?

అటు చంద్రబాబు, ఇటు జగన్ ఇద్దరూ ఇద్దరే. ఇద్దరీ పంతం ఒక్కటే. ఒకరిని ఒకరు రాజకీయంగా ఎలిమినేట్ చేసుకుని 2050 వరకూ అధికారాన్ని ఏపీలో అనుభవించాలన్నదే టార్గెట్. [more]

Update: 2020-11-22 12:30 GMT

అటు చంద్రబాబు, ఇటు జగన్ ఇద్దరూ ఇద్దరే. ఇద్దరీ పంతం ఒక్కటే. ఒకరిని ఒకరు రాజకీయంగా ఎలిమినేట్ చేసుకుని 2050 వరకూ అధికారాన్ని ఏపీలో అనుభవించాలన్నదే టార్గెట్. అయితే జగన్ ది ఏడాదిన్నర ముఖ్యమంత్రిత్వమే. ఆయనకు బోలెడు వయసూ ఉంది. అలాగే కోరికలూ ఉన్నాయి. అదే చంద్రబాబు డెబ్బయి పడిలో ఉన్నారు. ఆయన యుద్ధంలో గెలుచుకువచ్చిన విజయం తన కుమారుడి కోసం భావి వారసుల కోసం. ఇక్కడే తేడా ఇద్దరి మధ్యన ఉంది. ఇక మరో వైపు టీడీపీ, వైసీపీలను కుటుంబ పార్టీలు అంటూ బీజేపీ కొత్త ప్రచారం మొదలెట్టింది. అవినీతికి రెండు పార్టీలూ అచ్చమైన నకళ్ళు అని కూడా అంటోంది.

మెతుకు పట్టేస్తారా…?

అన్నం అంతా చూడనక్కరలేదు. మెతుకు పట్టుకుంటే చాలు. 2021 లో జరిగేది అదే. 2024 సార్వత్రిక ఎన్నికలలో ఎవరికి విజయావకాశాలు ఉన్నాయన్న దాని మీద ఎంతో కొంత స్పష్టత 2021 ఇవ్వబోతోంది. ఓ వైపు స్థానిక ఎన్నికలు ఉన్నాయి. మరో వైపు తిరుపతి లోక్ సభకు ఉప ఎన్నికలు జరుగుతాయి. ఈ రెండింటా ఢంకా భజాయించే పార్టీలకు ఇక ముందు తిరుగు ఉండదన్న భరోసా అయితే వస్తుంది. మరి 2019 ఎన్నికల్లో జగన్ గెలుపు గాలివాటం అని ఇప్పటికీ పూర్తిగా నమ్ముతూ తమ్ముళ్ళను నమ్మిస్తున్న తెలుగుదేశం పార్టీకి దాని అధినేత చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో అనుకూలం అవుతుందా అన్నది చూడాలి.

ఇవే అసలైన తీర్పులు….

ఇక మూడు రాజధానుల విషయం కోర్టులో విచారణ దశలో ఉంది. ఎన్నికల నాటికి హై కోర్టు తీర్పు వచ్చినా సుప్రీం తీర్పు కి ఎవరైనా అప్పీల్ కి వెళ్ళే చాన్స్ ఉంది. అయితే అన్నింటికంటే ముఖ్యం ప్రజా తీర్పు, జగన్ అంటున్న మూడు రాజధానులు కరెక్టా, చంద్రబాబు చెబుతున్న అద్భుత అమరావతి బెస్టా అన్నది కూడా జనం బ్యాలెట్ పేపర్ ద్వారా నిక్కచ్చిగానే తీర్పు చెబుతారు. లోకల్ బాడీ ఎన్నికలు అంటే 175 నియోజకవర్గాల్లో జనం ఓటు వేస్తారు. స్థానిక సమస్యల మీద ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో సాగుతున్న వైసీపీ పాలన మీద, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల మీద జనం చర్చించి తీర్పు చెప్పే వీలుంది. దాంతో స్థానిక ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకుని తిరుపతి సీటుని కూడా గత మెజారిటీ తగ్గకుండా వైసీపీ నిలబెట్టుకుంటే ఇక తిరుగు ఉండదు అంటున్నారు.

సత్తా తేల్చేస్తారు…?

ఇక పవన్ సినీ గ్లామర్ బీజేపీ పొలిటికల్ గ్రామర్ కలిస్తే ఏపీలో కుమ్ముడే అన్నట్లుగా కలరింగ్ ఇచ్చారు. ఇపుడు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక‌ ఎటూ వచ్చింది. దానితో పాటు లోకల్ బాడీ ఎన్నికలు కూడా ఉన్నాయి. మరి ఈ రెండు పార్టీల అసలైన బలం ఏంటన్నది ఈ ఎన్నికలతో కచ్చితంగా తేలుతుంది అంటున్నారు. పవన్ రాజకీయంగా ఇప్పటికీ బలంగా ఉన్నారా లేదా అన్నది కూడా జనం తీర్పు వల్ల తెలిసిపోతుంది. అలాగే ఏపీకి ఇప్పటిదాకా బీజేపీ చేసిన మేలు, చేయబోయే మేలు ఏంటి అన్నది కూడా ప్రజలు చర్చించి దాని మీద తమ ఓటు ద్వారా కచ్చితమైన అభిప్రాయాన్ని చెబుతారు అంటున్నారు. మొత్తానికి 2021 ప్రధమార్ధం ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని మారుస్తుంది అన్నది కచ్చితంగా చెప్పవచ్చుట.

Tags:    

Similar News