నిమ్మగడ్డను అలా వెనకేసుకొస్తే ఎలా?

చంద్రబాబు ఇప్పుడు సందిగ్దంలో పడ్డారు. మొన్నటి వరకూ కరోనా వైరస్ కారణంగా ఎలా ఎన్నికలు జరుపుతారని ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సై అంటున్నారు. [more]

Update: 2020-10-31 06:30 GMT

చంద్రబాబు ఇప్పుడు సందిగ్దంలో పడ్డారు. మొన్నటి వరకూ కరోనా వైరస్ కారణంగా ఎలా ఎన్నికలు జరుపుతారని ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సై అంటున్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను త్వరగా ముగించేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. తాను పదవిలో ఉన్నప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ముగించి ప్రభుత్వానికి షాక్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారు.

అప్పుడేమో వద్దంటే వద్దని….

నిజానికి మార్చి నెల 7వ తేదీన స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదల అయింది. అయితే కరోనా కారణంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే సరికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేశారు. కరోనా కారణంగా ఈ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. నిమ్మగడ్డ నిర్ణయాన్ని చంద్రబాబు కూడా స్వాగతించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలతో వైసీపీ చెలగాటాలాడాలని చూస్తుందని చంద్రబాబు ఆరోపించారు.

ఇప్పుడు జరపాలని……

ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి తెలుగుదేశం పార్టీ సై అంటుంది. కరోనా తీవ్రత కొంత తగ్గుముఖం పట్టిందని, దేశ వ్యాప్తంగా అన్ లాక్ నిబంధనలను ప్రభుత్వాలే తేవడంతో ఎన్నికలను నిర్వహిస్తే తప్పేంటని టీడీపీ ప్రశ్నిస్తుంది. బీహార్ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తుండగా లేనిది స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడంలో తప్పేంటని నిమ్మగడ్డ ను చంద్రబాబు వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

తాను మాత్రం హైదరాబాద్ లో….

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా కాకుండా టీడీపీ నేతగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు పదే పదే ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలను నిజం చేస్తున్నట్లే ఎన్నికల కమిషనర్ తో పాటు చంద్రబాబు కూడా వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కరోనా కారణంగానే చంద్రబాబు ఏపీకి కూడా రావడం లేదన్న విషయాన్ని ఈ సందర్భంగా వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. తాను మాత్రం కరోనాకు భయపడుతూ, ప్రజలను మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో బలి చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు తన పార్టీ నిర్ణయంతో నిమ్మగడ్డ ను వెనకేసుకొస్తున్నట్లే కన్పిస్తుంది. దీనిని వైసీపీ అడ్వాంటేజీగా మలచుకోనుంది.

Tags:    

Similar News