టీడీపీలో ఈ వికెట్లు ప‌డిపోవడం గ్యారంటీ అట

ఏపీ ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. పార్టీని నిల‌బెట్టుకునేందుకు పార్టీ అధినేత‌, మాజీ సీఎం, ఫార్టీ ఇయర్స్ ఇండ‌స్ట్రీ చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయ‌త్నాలు [more]

Update: 2020-04-03 13:30 GMT

ఏపీ ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. పార్టీని నిల‌బెట్టుకునేందుకు పార్టీ అధినేత‌, మాజీ సీఎం, ఫార్టీ ఇయర్స్ ఇండ‌స్ట్రీ చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయ‌త్నాలు ఏమీ ఫ‌లించ‌డం లేదు. అధికారం కోల్పోవ‌డ‌మే కాకుండా పార్టీపైనా అటు ప్రజ‌ల్లోనూ ఇటు నాయ‌కుల్లోనూ విశ్వాసం స‌న్నగిల్ల‌డంతో పార్టీ మ‌నుగ‌డే ప్రశ్నార్థకంగా మారిపోయింది. దీంతో పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారిపోతోంది. ఇప్పటికే గెలిచిన వారు, ఎన్నిక‌ల్లో ఓడిన వారు కూడా పార్టీ మారిపోయారు. ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా పార్టీకి దూరంగా ఉన్నారు. మ‌రో ప‌ది మంది వ‌ర‌కు ప‌రోక్షంగా పార్టీని దూరం పెట్టారు. దీంతో పార్టీ బ‌లం సింగిల్ డిజిట్‌లో కొన‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఐదుగురే హాజరవ్వడంతో…..

ఇటీవ‌ల చంద్రబాబు నిర్వహించిన స‌మీక్షా స‌మావేశంలో ప్రస్తుతం పార్టీలో ఉన్న 20 మంది ఎమ్మెల్యేల‌కు కేవ‌లం ఐదుగురు మాత్రమే వ‌చ్చారంటే చంద్రబాబు మాట అంటే ఎమ్మెల్యేల‌కు ఎంత విలువ ఉందో అర్థమ‌వుతోంది. ఇక‌, ఓడిన వారిలోనూ చాలా మంది ఇప్పటికే పార్టీ మారిపోయారు. మ‌రికొంద‌రు పార్టీలోనే ఉన్నప్పటికీ.. ఏదో ఉన్నామంటే ఉన్నాం.. అన్నట్టుగా ఉన్నారు. పార్టీలో క్రియాశీలంగా ఎక్కడా క‌నిపించ‌డం లేదు. పైగా ఎక్కడిక‌క్కడ నేత‌ల్లోనూ చంద్రబాబుపై న‌మ్మకం క‌ల‌గ‌డం లేద‌నేది వాస్తవం. దీనికి ఉదాహ‌ర‌ణ ఇటీవల స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో పార్టీ పుట్టిన‌ప్పటి నుంచి ఉన్న వీరాభిమానులు సైతం పార్టీ మారిపోవ‌డ‌మే.

నమ్మకమైన నేతలే…

ఇక గుంటూరు, కృష్ణా లాంటి టీడీపీ కంచుకోట‌ల్లోనూ కీల‌క నేత‌లు ఫ్యాన్ గూటికి కుప్పలు తెప్పలుగా చేరిపోతున్నారు. ఇక చాలా ఏళ్లుగా అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న టీడీపీ నాయ‌కురాలు అనంత‌పురానికి చెందిన ఎమ్మెల్సీ శ‌మంత‌క‌మ‌ణి, ఆమె కుమార్తె మాజీ ఎమ్మెల్యే యామినీ బాల‌తో పాటు పార్టీ మారిపోవ‌డం, అదేవిధంగా చీరాల నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన క‌ర‌ణం బ‌ల‌రాం వంటి చంద్రబాబుకు స‌మ‌కాలికుడు కూడా పార్టీ మారిపోవ‌డం అనేది చిత్రం కాక మ‌రేంటి? ఈ నేప‌థ్యంలో పార్టీలో అస‌లు ఏం జ‌రుగుతోంద‌నే ప్రచారం చ‌ర్చ కూడా జోరుగా సాగుతోంది.

కీలకంగా ఉన్న వారు కూడా……

ఇదిలావుంటే, ఇప్పుడు మ‌రికొంద‌రు కూడా సైకిల్ దిగేందుకు సిద్ధమ‌య్యారు. వీరిలో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ము ఖ్యంగా చంద్రబాబుకు ఒక‌ప్పుడు రైట్ హ్యాండ్‌గా ఉన్న సీనియ‌ర్‌నేత‌, మాజీ మంత్రి , అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గానికి చెందిన‌ కాల్వ శ్రీనివాసులు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. ఇక‌, విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన శోభా హైమావ‌తి కూడా పార్టీ మార్పున‌కు రెడీ అవుతున్నార‌ని స‌మాచారం. ఆమె కుమార్తె శోభా స్వాతీరాణి ఇప్పటికే పార్టీ మారి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

పదుల సంఖ్యోలోనే?

ఇక‌, కృష్ణాజల్లాకు చెందిన పామ‌ర్రు మాజీ ఎమ్మెల్యే, ఎస్సీ నాయ‌కురాలు ఉప్పులేటి క‌ల్పన కూడా సైకిల్ దిగి మ‌ళ్లీ జ‌గ‌న్ పంచకే చేరాల‌ని నిర్ణయించుకున్నారు. ఇక గోదావ‌రి జిల్లాల‌కు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల పేర్లు కూడా ఈ రేసులో ఉన్నాయి. ఇలా మొత్తంగా ప‌దుల సంఖ్యలో నేత‌లు త్వర‌లోనే వైసీపీ కండువా క‌ప్పుకోనున్నార‌ని టీడీపీలోనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి చంద్రబాబు ఇప్పటికైనా అడ్డుకుంటారో.. చోద్యం చూస్తారో చూడాలి.

Tags:    

Similar News