అప్పుడు వాళ్లు.. ఇప్పుడు వీళ్లు.. బాబుకు త‌గ్గని త‌ల‌నొప్పులు

ఒక‌టికాదంటే.. ఒక‌టి.. టీడీపీ అధినేత చంద్రబాబు త‌ల‌నొప్పులు విడ‌వ‌డం లేద‌ని అంటున్నారు సీనియ‌ర్లు. పార్టీని గాడిలో పెట్టేందుకు. పార్టీకి పునర్వైభ‌వం తెచ్చేందుకు చంద్రబాబు బాగానే తాప‌త్రయ ప‌డుతున్నారు. [more]

Update: 2020-10-30 06:30 GMT

ఒక‌టికాదంటే.. ఒక‌టి.. టీడీపీ అధినేత చంద్రబాబు త‌ల‌నొప్పులు విడ‌వ‌డం లేద‌ని అంటున్నారు సీనియ‌ర్లు. పార్టీని గాడిలో పెట్టేందుకు. పార్టీకి పునర్వైభ‌వం తెచ్చేందుకు చంద్రబాబు బాగానే తాప‌త్రయ ప‌డుతున్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. ఇప్పుడు పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు ఆయ‌న నడుం బిగించారు. పార్టీలో నెల‌కొన్ని అసంతృప్తుల‌ను త‌గ్గించేందుకు.. నాయ‌కులు తిరిగి పుంజుకునేందుకు ప‌ద‌వుల పందేరం చేశారు. ఎన్నడూ లేని విధంగా పార్లమెంట‌రీ జిల్లా క‌మిటీల‌ను ఏర్పాటు చేశారు. వీటికి ఇంచార్జ్‌‌ను నియ‌మించారు.

వారిలో అసంతృప్తి…..

అదే స‌మ‌యంలో పార్లమెంట‌రీ మ‌హిళా క‌మిటీల‌ను ఏర్పాటు చేశారు. వీటికి కూడా ఇంచార్జ్‌ల‌ను నియ‌మించారు. ఇక‌, తాజాగా పార్టీ రాష్ట్ర క‌మిటీ, జాతీయ పార్టీ క‌మిటీ, పొలిట్ బ్యూరోను కూడా ఏర్పాటు చేశారు. ఇంత వ‌ర‌కుబాగానే ఉంది. ఇంకేముంది.. బీసీల‌కు ప‌ట్టంక‌ట్టాం.. అని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి తిరుగులేద‌ని కూడా అనుకున్నారు. నిజ‌మే.. ఇప్పటి వ‌ర‌కు సంతృప్తి లేకుండా ఉన్న చాలా మంది నేత‌ల‌కు, ప‌నిలేకుండా తిరుగుతున్న నాయ‌కుల‌కు అంతో ఇంతో ప‌ని క‌ల్పించారు. బాగానే ఉంద‌ని అనుకుంటున్న త‌రుణంలో.. ఎన్నడూ లేనిది.. మ‌హిళా నేత‌ల్లో అసంతృప్తి వ్యక్తమ‌వుతోంది.

తన కంటే జూనియర్లకు…..

“ఏం మేం.. పార్టీకి ప‌నిచేయ‌డం లేదా? పార్టీ త‌ర‌ఫున మాట్లాడ‌డం లేదా? మాకు అవ‌కాశాలు ఇవ్వరా ?“ అంటూ.. వారు నిల‌దీస్తున్నారు. అంతేకాదు. మాజీ స్పీక‌ర్ ప్రతిభా భార‌తి వంటివారు.. త‌న‌కున్న పొలిట్ బ్యూరో ప‌ద‌విని తొల‌గించ‌డంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అదే స‌మ‌యంలో ఉపాధ్యక్ష ప‌ద‌విని ఇచ్చినా.. నాకెందుకు.. 'నా క‌న్నా జూనియ‌ర్‌కు ప్రాధాన్యం ఇచ్చారు!' అని గుర్రుగా ఉన్నారు. ఇక‌, విజ‌య‌వాడ‌కు చెందిన పంచుమ‌ర్తి అనురాధ‌, శ్రీకాకుళానికి చెందిన గౌతు శిరీష‌, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ వంటివారు కూడా ఆగ్రహంతోనే ఉన్నార‌ని తెలుస్తోంది.

పార్టీ కోసం పనిచేస్తున్నా…..

వీరికి పార్టీలో ప‌ద‌వులు ల‌భించ‌లేదు. ప్రతిభా భార‌తి ప్రయార్టీ పూర్తిగా త‌గ్గంచ‌డంతో పాటు ఆమె కంటే చాలా జూనియ‌ర్ అయిన వంగ‌ల‌పూడి అనిత‌ను పొలిట్‌బ్యూరోలోకి తీసుకోవ‌డం ప్రతిభ‌కు ఏ మాత్రం రుచించ‌డం లేదు. పైగా ఆమె కుమార్తె గ్రీష్మకు రాజాం సీటు ఇవ్వకుండా అవ‌మానించ‌రాని ఆ కుటుంబం ర‌గిలిపోతోంది. ఇక పంచుమ‌ర్తి అనూరాధ పార్టీ కోసం ప‌దిహేనేళ్లుగా ఎంతో చేస్తున్నా ఆమెను ప‌ట్టించుకోలేదు.

పదవులకు దూరం పెట్టడంతో…

ఇక గౌతు శిరీష‌ను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్ష ప‌ద‌వి రాలి నుంచి త‌ప్పించ‌డంతో ఆమె తీవ్ర అస‌హ‌నంతో ఉన్నారు. పార్టీ కోసం ఐదారేళ్లుగా క‌ష్టప‌డుతోన్న ఆమెకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా చేశారు. ఇక రాయ‌ల‌సీమ‌లో మ‌హామ‌హా పురుష రెడ్డి టీడీపీ నేత‌లు, మాజీ మంత్రులే నోటికి ప్లాస్టిక్ వేసుకున్నారు. అయితే భూమా అఖిల ప్రియ మాత్రం వీలున్నప్పుడ‌ల్లా ప్రభుత్వంపై ధైర్యంగా విమ‌ర్శలు చేయ‌డంతో పాటు కేడ‌ర్ కోసం ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నారు. ఆమెను కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. దీంతో ఈ మ‌హిళా నేత‌లంతా అద‌ను చూసు బాబుపై అస‌మ్మతి గ‌ళం వినిపించ‌డ‌మో లేదా షాక్ ఇచ్చే ఆలోచ‌నల్లోనే ఉన్నార‌ట‌. దీంతో బాబుకు ఒక త‌ల‌నొప్పి వ‌దిలితే.. మ‌రో త‌ల‌నొప్పి త‌యారైంద‌ని అంటున్నారు సీనియ‌ర్లు. ఇప్పుడా ఇచ్చేందుకు ప‌ద‌వులు లేవు.. పోనీ.. ఇంకేవైనా క‌మిటీలు వేద్దామా? అంటే ఛాన్సే లేదు. సో.. మొత్తానికి చంద్రబాబుకు ఈ త‌ల‌నొప్పి ఎలా తీరుతుందో ? చూడాల‌ని అంటున్నారు.

Tags:    

Similar News