కండిషన్లు అప్లై అంటున్న బాబు…?

చంద్రబాబు రాజకీయమే ప్రత్యేకం. ఆయనది ఒక పొలిటికల్ స్కూల్. అందులో నేతలు ఎంతటి పెద్దవారు అయినా కూడా స్టూడెంట్స్ మాత్రమే . హెడ్ మాస్టర్ బాబు చెప్పిన [more]

Update: 2020-10-29 03:30 GMT

చంద్రబాబు రాజకీయమే ప్రత్యేకం. ఆయనది ఒక పొలిటికల్ స్కూల్. అందులో నేతలు ఎంతటి పెద్దవారు అయినా కూడా స్టూడెంట్స్ మాత్రమే . హెడ్ మాస్టర్ బాబు చెప్పిన పాఠాలే చదవాలి. బాబు లాగానే ఆలోచించాలి. బాబునే అనుసరించాలి. ఇదే కదా నాలుగు దశాబ్దాలుగా టీడీపీని గుప్పిట పట్టి చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ ని నడిపిస్తున్న తీరు. ఇపుడు చంద్రబాబు విపక్షంలోకి వచ్చారు. అయినా ఆయన ఆదేశాలు ఎక్కడా ఆగడంలేదు. ఆయన చెప్పిందే వేదంగా టీడీపీ సాగాలంటున్నారు.

పెద్ద పీట వేసి మరీ ….

ఈసారి జాగ్రత్తగా గమనిస్తే ఉత్తరాంధ్రాకు చంద్రబాబు పెద్ద పీట వేశారు. గతంలో ముగ్గురు ఉన్న పొలిట్ బ్యూరో మెంబర్స్ ఆరుగురు అయ్యారు. జాతీయ ఉపాధ్యక్ష పదవి తో పాటు, జాతీయ ప్రధాన కార్యదర్శి పదవులు ఈ జిల్లాలకే ఇచ్చారు. అంతే కాదు, ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కూడా ఇచ్చారు. ఇవి కాకుండా సెంట్రల్ కమిటీలో కూడా సీనియర్లను తీసుకున్నారు. ఆరుగురిని పార్లమెంట్ ప్రెసిడెంట్లను చేశారు. ఇంకా రాష్ట్ర, జిల్లా కమిటీలు ప్రకటిస్తే మరిన్ని పదవులు దక్కుతాయి. సరే ఇవన్నీ ఇచ్చిన చంద్రబాబు కచ్చితంగా హై కమాండ్ ఆదేశాలు పాటించాలని హుకుం జారీ చేస్తున్నారు.

అమరావతే అజెండాగా …..

టీడీపీకి ఇపుడు అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా కావాలి. ఈ విషయంలో చంద్రబాబు ఎంతదాకానైనా పోరాటం చేస్తారు. విశాఖకు రాజధాని వద్దు అనిపించాలి. ఆ మాట తమ్ముళ్ళ నోటి వెంట పదే పదే రావాలి. వారే జనాలకు కూడా మౌల్డ్ చేయాలి. ఇదీ బాబు పెట్టిన అతి పెద్ద బాధ్యత. విశాఖను ఎవరూ రాజధానిగా కోరుకోవడంలేదు అంటూ అపుడే చంద్రబాబు మాటను తన నోట పలికించారు కొత్త ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు. ఉత్తరాంధ్రాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామా చేసి ఆ సంగతి తేల్చుకోవచ్చునని కూడా ఆయన సవాల్ చేస్తున్నారు.

వత్తిడే మరి …

ఇలా తమ్ముళ్ళు విశాఖను కాదంటూ లోకల్ పాలిటిక్స్ చేయాలంటే కష్టమే మరి. సరిగ్గా ఇలాంటి వత్తిడే వస్తే తట్టుకోలేకనే తాను పార్టీని వీడానని టీడీపీ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చెప్పారు కూడా. ప్రతీ రోజూ హై కమాండ్ నుంచి అమరావతికి అనుకూలంగా మేసేజ్ వస్తుంది. దాన్ని పట్టుకుని విశాఖలో గర్జించాలి. మరి ఆ పని తమ్ముళ్ల అయ్యే పనేనా. చాలా మంది మాత్రం నో అని బయటకు చెప్పలేక అలాగని ఎస్ అనలేక అపుడే ఇబ్బంది పడుతున్నారుట. మరి చంద్రబాబు ఇదే విధానంతో తమ్ముళ్ల మీద వత్తిడి తెస్తే మాత్రం పార్టీకి పదవులకు రాం రాం అనే బాపతు కూడా బాగానే ఉంటారని అంటున్నారు. చూడాలి మరి.

Tags:    

Similar News