ముద్ర చెరిగిపోతుందా? ఆ ప్రయత్నమేనా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు క్రమంగా తన పార్టీపై పడిన ముద్రను చెరిపేసేకునే ప్రయత్నంలో పడ్డారు. ఓటమి తర్వాత ఆయనకు విషయం అర్ధమయింది. ఎన్నికలకు ముందు [more]

Update: 2020-10-27 11:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు క్రమంగా తన పార్టీపై పడిన ముద్రను చెరిపేసేకునే ప్రయత్నంలో పడ్డారు. ఓటమి తర్వాత ఆయనకు విషయం అర్ధమయింది. ఎన్నికలకు ముందు నుంచే కమ్మ సామాజికవర్గం పార్టీగా ముద్రపడిన పార్టీని దాని నుంచి తప్పించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారనే చెప్పుకోవాలి. రాష్ట్ర విభజనకు ముందు తెలుగుదేశం పార్టీలో ఆ సామాజికవర్గం ఆధిపత్యం ఉన్నా ఆ ముద్రపడలేదు.

రాష్ట్రం విడిపోయిన తర్వాత….

కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కమ్మ పార్టీగా తెలుగుదేశానికి బలంగా ముద్రపడింది. ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రచారం ఊపందుకుంది. అమరావతి రాజధాని భూముల కొనుగోలు దగ్గర నుంచి అన్ని కాంటాక్టుల్లోనూ ఆ సామాజిక వర్గానికే చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారని వైసీపీ బలంగా తీసుకెళ్లగలిగింది. దీంతోనే తమకు దీర్ఘకాలంగా ఉన్న ఇతర సామాజిక వర్గాలు దూరమయ్యాయని చంద్రబాబు విశ్విసిస్తున్నారు.

అన్ని నియామకాల్లో…..

అందుకే చంద్రబాబు ఇటీవల పార్టీలో చేపట్టిన అనేక నియామకాల్లో కమ్మ సామాజికవర్గానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. తన వెంట నమ్మకంగా, సన్నిహితులుగా ఉన్న వారిని సయితం చంద్రబాబు పక్కన పెట్టారు. పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుల నియామకంలోనూ కమ్మ సామాజిక వర్గానిక అరకొర ప్రాధాన్యత మాత్రమే దక్కింది. ఎక్కువగా బీసీ సామాజికవర్గానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.

వారికే ప్రాధాన్యత……

ఇక తాజాగా ప్రకటించిన వివిధ కమిటీల్లో సయితం బీసీలకు ఎక్కువ స్థానాలను చంద్రబాబు కేటాయించారు. తమది బీసీల పార్టీ అని ప్రజల్లోకి బలంగా పంపే ప్రయత్నాన్ని చంద్రబాబు చేశారనే చెప్పాలి. పొలిట్ బ్యూరో, సెంట్రల్ కమిటీ నియామకాల్లో 60 శాతం మంది బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకే స్థానం కల్పించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీల పార్టీగానే ఉందని, ఇప్పడూ ఎప్పుడూ అలాగే ఉంటుందని చంద్రబాబు తన నియామకాల ద్వారా చెప్పారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News