ఆ ఒక్క విషయంలో మాత్రం నో అంటున్నారట

తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నిక అనివార్యం. ఈరోజు కాకపోయినా రేపు ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే అమరావతి రాజధాని ఉద్యమం మరో వైపు ఊపందుకుందని టీడీపీ [more]

Update: 2020-10-18 06:30 GMT

తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నిక అనివార్యం. ఈరోజు కాకపోయినా రేపు ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే అమరావతి రాజధాని ఉద్యమం మరో వైపు ఊపందుకుందని టీడీపీ అంటోంది. చంద్రబాబు సయితం ఐదుకోట్ల మంది ప్రజలు అమరావతిని కోరుకుంటున్నారని పదే పదే చెబుతున్నారు. కానీ తిరుపతి ఉప ఎన్నికను రిఫరెండంగా ప్రకటించేందుకు మాత్రం చంద్రబాబు వెనకడుగు వేస్తున్నారు.

తొలి ఉప ఎన్నిక…..

నిజానికి వైసీపీ ప్రభుత్వం ఏర్పడన తర్వాత జరగనున్న తొలి ఉప ఎన్నిక. తిరుపతి ప్రాంతం విశాఖపట్నానికి చాలా దూరం. విశాఖకు పరిపాలన రాజధానిగా మార్చడానికి తిరుపతి ప్రజలు అంగీకరించకపోతే ఆ ప్రభావం ఉప ఎన్నికపై ప్రభావం చూపుతుంది. పైగా చంద్రబాబు సొంత జిల్లా కావడం కూడా మరో విశేషం. తన సొంత జిల్లాలో జరుగుతున్న తొలి ఉప ఎన్నిక విషయంలో చంద్రబాబు మీన మేషాలు లెక్కిస్తున్నారంటున్నారు టీడీపీ నేతలు. లోక్ సభ ఉప ఎన్నికను రిఫరెండంగా చంద్రబాబు ప్రకటించి జగన్ కు సవాల్ విసరాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదు.

భయానికి కారణాలు…..

అయితే చంద్రబాబు భయానికి కూడా కొన్ని కారణాలున్నాయి. తిరుపతి పార్లమెంటు నియోజకవవర్గ పరిధిలో ఏ ఒక్క ఎమ్మెల్యే లేకపోవడం ఒక కారణంకాగా, సానుభూతితో వైసీపీ గెలిచే అవకాశాలున్నాయన్న అంచనా ఉంది. దీంతోనే చంద్రబాబు అమరావతి రెఫరెండంగా తిరుపతి ఉప ఎన్నికను ప్రకటించేందుకు కొంత వెనకడుగు వేస్తున్నారని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు ఆలోచనలన్నీ తిరుపతి ఉప ఎన్నిక విషయంలో వేరే విధంగా సాగుతున్నాయంటున్నారు.

లోపాయికారీ మద్దతుతోనైనా….

తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేయడం ఖాయంగా తెలుస్తోంది. ఉప ఎన్నిక సమయానికి బీజేపీతో సయోధ్య కుదిరితే సరే లేకుంటే బయట నుంచైనా ఆ పార్టీకి మద్దతివ్వాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. తాము పోటీ చేసి అనవసరంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం ఎందుకని సీనియర్ నేతల వద్ద కూడా చంద్రబాబు ప్రశ్నించినట్లు తెలిసిింది. వైసీపీని ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చి అయినా ఓడించగలిగితే జగన్ పై విజయం సాధించినట్లేనని చంద్రబాబు భావిస్తున్నారు. రాజధాని అమరావతి అంశాన్ని తిరుపతి ఉప ఎన్నికలో రిఫరెండంగా ప్రకటించేందుకు మాత్రం చంద్రబాబు ఇష్టపడటం లేదని తెలుస్తోంది.

Tags:    

Similar News