కరకట్టను వదిలపెట్టరా? ఎన్నాళ్లిలా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కరకట్ట ఇంటిని ఖాళీ చేయరా? ఎన్నాళ్లిలా ఉంటారు. అధికార పార్టీతో మాటలు పడుతూ ఉంటారు. ఇటీవల వచ్చిన వరదలకు మళ్లీ కృష్ణా [more]

Update: 2020-10-13 06:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కరకట్ట ఇంటిని ఖాళీ చేయరా? ఎన్నాళ్లిలా ఉంటారు. అధికార పార్టీతో మాటలు పడుతూ ఉంటారు. ఇటీవల వచ్చిన వరదలకు మళ్లీ కృష్ణా నీరు చంద్రబాబు ఇంటికి చేరింది. అధికారులు సయితం మరోసారి చంద్రబాబు ఇంటికి నోటీసులు ఇచ్చారు. ఇలా ఎంతకాలం కరకట్టను పట్టుకుని వేలాడతారన్న ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతాయి. అందరితో అనిపించుకుంటూ ఎన్నాళ్లిలా నెట్టుకొస్తారన్నది తెలియడం లేదు.

సొంత ఇల్లు కాదు…..

నిజానికి కరకట్ట మీద నివాసం చంద్రబాబు సొంత ఇల్లు కాదు. ఆయన అద్దె ఇంట్లో ఉంటున్నారు. గత ఏడాది కూడా వరద సమయంలో చంద్రబాబు నివాసంలోకి వరద నీరు ప్రవేవించింది. అప్పుడు కూడా అధకారులు నోటీసులు జారీ చేశారు. మంత్రులు కూడా చంద్రబాబు నివాసాన్ని పరిశీలించి వచ్చారు. గత ఏడాది అయితే వరద నీటిని కావాలని చంద్రబాబు నివాసానికి మళ్లించారని టీడీపీ నేతలు వైసీపీపై విమర్శలు చేశారు.

వరద వచ్చిన ప్రతిసారీ….

ఈ ఏడాది కూడా వరద వచ్చింది. మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఇక్కడే నివాసముంటున్నారు. ఆయన ప్రత్యేకంగా తనకోసం గదులను కూడా అక్కడ నిర్మించుకున్నారు. కృష్ణా నది బ్యాక్ వాటర్ సమీపంలోనే చంద్రబాబు నివాసం ఉంటుంది. వరద వచ్చిన ప్రతి సారీ ఈ సమస్య చంద్రబాబుకు తప్పదు. ప్రతి సారీ నోటీసులు అధికారుల నుంచి అందుకోవడం కూడా చంద్రబాబు లాంటి సీనియర్ నేతకు తగదు.

ప్రభుత్వం బలవంతంగా….

విజయవాడలో మరో నివాసాన్ని చూసుకుంటే మంచిదని టీడీపీ నేతలు సయితం చంద్రబాబుకు సూచిస్తున్నారు. అయితే చంద్రబాబు ఆలోచన మరోలా ఉంది. ప్రభుత్వం తనను ఖాళీ చేయిస్తేనే సానుభూతి పెరుగుతుందని ఆయన ఖాళీ చేయకుండా ఉన్నారని కూడా చెబుతున్నారు. చంద్రబాబు నివాసాన్ని ఖాళీ చేయస్తామని వైసీపీ నేతలు అసెంబ్లీలోనే చెప్పడంతో, తనను బలవంతంగా ఖాళీ చేయిస్తేనే రాజకీయంగా తనకు ఉపయోగముంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు తన నివాసాన్ని వరద వచ్చిన ప్రతిసారీ హాట్ టాపిక్ గానే ఉంచాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News