చంద్రబాబుకు సహకరిస్తుంది ఆయనేనటగా?

రాష్ట్రంలో గ‌డిచిన ప‌ది మాసాలుగా టీడీపీ ప్రతిప‌క్ష పాత్రను పోషిస్తోంది. రెండోసారి కూడా అధికారంలోకి రావాల‌ని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నా ప్రజ‌లు మాత్రం [more]

Update: 2020-03-18 08:00 GMT

రాష్ట్రంలో గ‌డిచిన ప‌ది మాసాలుగా టీడీపీ ప్రతిప‌క్ష పాత్రను పోషిస్తోంది. రెండోసారి కూడా అధికారంలోకి రావాల‌ని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నా ప్రజ‌లు మాత్రం వైసీపీకి అధికారం ఇచ్చారు. ఇంత వ‌ర‌కు టెక్నిక‌ల్‌గా తెలిసిన వాస్తవం. అయితే, ప‌ది మాసాలుగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను, ముఖ్యంగా గ‌డిచిన మూడు నాలుగు మాసాలుగా రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే మాత్రం టీడీపీదే పైచేయిగా క‌నిపిస్తోంది. అడుగ‌డుగునా.. వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ కు కూడా ఎదురు దెబ్బలు త‌గులుతూనే ఉన్నాయి. జ‌గ‌న్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికీ ఏదో ఒక రూపంలో ఎదురు దెబ్బలు త‌గులుతున్నాయి. ప్రభుత్వ పాఠ‌శాలల్లో తెలుగు మాధ్యమం తీసేయ‌డం ద‌గ్గర నుంచి రాజ‌ధాని నిర్ణయం.. ఇప్పుడు ఎన్ని క‌లు ఇలా ప్రతి నిర్ణయం కూడా వివాదమే అవుతోంది.

న్యాయస్థానంలో కూడా…..

మ‌రీ ముఖ్యంగా విశాఖ‌లో టీడీపీ అధినేత చంద్రబాబు ప‌ర్యట‌న‌ను పోలీసులు అడ్డుకున్న ఘ‌ట‌న కూడా జ‌గ‌న్ స‌ర్కారును తీవ్ర స్థాయిలో ఇరుకున ప‌డేసింది. ఇప్పటి వ‌రకు ఈ ప‌ది మాసాల్లో రెండు సార్లు డీజీపీ గౌతం స‌వాంగ్ హైకోర్టు గ‌డ‌ప తొక్కి వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సిన అవ‌స‌రం ఏర్పడింది. ఇక‌ ప్రభుత్వాన్ని కూడా హైకోర్టు అనేక రూపాల్లో త‌ప్పు ప‌డుతున్న ప‌రిస్థితి ఎదురైంది. మొత్తంగా చూస్తే జ‌గ‌న్ ప్రభుత్వానికి ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు, ప‌రిణామాలు ఎదుర‌వుతున్నాయ‌నేది వాస్తవం.

ఢిల్లీ స్థాయిలో….

మ‌రి ఇంత‌గా జ‌గ‌న్ ఇరుకున ప‌డ‌డానికి, చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ చాలా విష‌యాల్లో పైచేయి సాధించ‌డానికి కార‌ణం ఏంటి ? మ‌రీ ముఖ్యంగా న్యాయ వ్యవ‌స్థ నుంచి జ‌గ‌న్ ఎదురు దెబ్బలు త‌గిలించుకోవ‌డానికి, అదే న్యాయ వ్యవ‌స్థ చంద్రబాబుకు స‌హ‌క‌రించిన‌ట్టు క‌నిపిస్తున్నదానికి ఏమైనా లింకు ఉందా? అనేది “ధ‌ర్మ“ సందేహంగా మారింది. దీనికి సంబందించి ఇటీవ‌ల హైకోర్టు వ‌ర్గాల నుంచి వెల్లడైన అభిప్రాయాల‌ను బ‌ట్టి చూస్తే.. ఢిల్లీ స్థాయిలో చంద్రబాబుకు స‌హ‌క‌రిస్తున్న ఓ కీల‌క వ్యక్తి ఉన్నార‌ని తెలిసింది. ప్రస్తుతం ఆయ‌న అత్యున్నత స్థాయిలో ఉన్నార‌ని, ఆయ‌న కూడా చంద్రబాబు వ‌ర్గానికే చెందిన వ్యక్తి అని హైకోర్టు ప‌రిధిలో జ‌రుగుతున్న చ‌ర్చల్లో తేలిన విష‌యం.

బాబుకు దగ్గరయిన వ్యక్తి….

ఆయ‌న కృష్ణాజిల్లాకు చెందిన వ్యక్తి అని, పైగా చంద్రబాబుకు ఆయ‌న‌కు చాలా ద‌గ్గర సంబంధాలు ఉన్నాయ‌ని, ప్రస్తుతం ఆయ‌న క‌నుస‌న్నల్లోనే చంద్రబాబుకు 'న్యాయం' జ‌రుగుతోంద‌ని, ఆయ‌న ఢిల్లీలో ఉన్నంత వ‌ర‌కు కూడా చంద్రబాబుకు వ‌చ్చిన ఇబ్బంది లేద‌ని అంటున్నారు. దీంతో ఈ విష‌యానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. జ‌రుగుతున్న, జ‌ర‌గ‌బోయే అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే, ఆయ‌న రాజ‌కీయాల‌కు సంబంధం లేని వ్యక్తి అయిన‌ప్పటికీ.. ప్రభావం మాత్రం తీవ్రంగా చూపిస్తున్నార‌ని, ఈ క్రమంలోనే జ‌గ‌న్‌కు ఎదురు దెబ్బలు త‌గులుతున్నాయ‌ని అంటున్నారు. మ‌రి ఎంత వ‌ర‌కు నిజ‌మో చూడాలి.

Tags:    

Similar News