ఆలస్యం చేస్తే.. ఏమీ కాదు..అదే అవుతుంది

చంద్రబాబు విషయంలో టీడీపీ సీనియర్ నేతలు తప్పు పట్టేది ఒకే ఒక్క విషయంలో. అది ఆయన నాన్చుడు ధోరణి. ప్రతి విషయాన్ని ఆయన నెలలపాటు నానుస్తారన్నది పార్టీలో [more]

Update: 2020-10-05 02:00 GMT

చంద్రబాబు విషయంలో టీడీపీ సీనియర్ నేతలు తప్పు పట్టేది ఒకే ఒక్క విషయంలో. అది ఆయన నాన్చుడు ధోరణి. ప్రతి విషయాన్ని ఆయన నెలలపాటు నానుస్తారన్నది పార్టీలో ఉన్న అభిప్రాయం. అది అధికారంలో ఉన్నప్పుడు కాని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గానీ ఏ నిర్ణయాన్ని వెంటనే తీసుకోలేరు. గన్నవరం నియోజకవర్గం ఇన్ ఛార్జి విషయంలోనూ చంద్రబాబు ఇదే పద్ధతిని ఫాలో అయ్యారు. ఏడు నెలలకు గాని చంద్రబాబు గన్నవరం నియోజకవర్గానికి ఇన్ ఛార్జిని నియమించలేకపోయారు. తాజాగా బచ్చుల అర్జునుడును నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు.

ఏడునెలలు దాటినా…..

గన్నవరం నియోజకవర్గం నుంచి మొన్నటి ఎన్నికల్లో గెలిచిన వల్లభనేని వంశీ పార్టీని వీడి దాదాపు ఏడు నెలలు దాటుతుంది. ఏడు నెలలు చంద్రబాబు గన్నవరం నియోజకవర్గానికి ఇన్ ఛార్జిని నియమించలేక పోయారు. ఇప్పుడు చంద్రబాబు కొత్తగా నియమించిన ఇన్ ఛార్జి పేరు వల్లభనేని వంశీ పార్టీని వదిలి వెళ్లిన నాటి నుంచి విన్పిస్తుంది. అయితే అనేక మంది పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతూ చంద్రబాబు నేటి వరకూ నాన్చుతూ వచ్చారు.

ఓటు బ్యాంకు ఉన్నా…..

గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. బలమైన ఓటు బ్యాంకు ఉంది. రాజధాని అమరావతికి సమీపంలో ఉండటంతో మరికొంత టీడీపీ బలం పెంచుకునే అవకాశముంది. కానీ ఏడు నెలలుగా ఇన్ ఛార్జి లేకపోవడంతో గన్నవరం నియోజకవర్గంలో పార్టీ క్యాడర్, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. నిజానికి బచ్చుల అర్జునుడును ఎప్పుడో గన్నవరం ఇన్ ఛార్జిగా చంద్రబాబు నియమించాల్సి ఉంది.

గద్దె కుటుంబానికి…..

కానీ గద్దె అనూరాధ పేరు, రావి వెంకటేశ్వరరావు పేర్లను పరిశీలించడంతోనే ఏడు నెలలను చంద్రబాబు గడిపేశారని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అక్కడ గద్దె రామ్మోహన్ రావుకు కొంత పట్టుంది. అక్కడ గతంలో గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన కుటుంబానికిస్తే బాగుంటుందని కొందరు సీనియర్ నేతలు కూడా సూచించారు. కానీ సామాజిక వర్గాల సమీకరణాలకు భయపడి చంద్రబాబు గద్దె కుటుంబానికి ఇవ్వకుండా బచ్చుల అర్జునుడికి ఇచ్చారంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు గొప్ప నిర్ణయం తీసుకుంటాడని భావించిన గన్నవరం టీడీపీ క్యాడర్ కు ఇన్ ఛార్జి పేరును చూసి అవాక్కయ్యారట.

Tags:    

Similar News