ఆ కసి లేదు.. ఆ పస లేదు…నాలుగేళ్లు ఎలా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. ఒకవైపు పార్టీ నేతలు కాడి వదిలయేడం, [more]

Update: 2020-03-14 14:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. ఒకవైపు పార్టీ నేతలు కాడి వదిలయేడం, మరోవైపు కీలక నేతలే రాజీనామాలు చేసి వెళ్లిపోతుండటంతో ఆయన ఎన్నడూ లేని విధంగా రాజకీయ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా తనకు శత్రువుగా చూడటం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ టీడీపీని టార్గెట్ చేయడంతో ముప్పేట దాడిని చంద్రబాబు ఎదుర్కొంటున్నారనే చెప్పాలి.

గతంలోనూ….

గతంలోనూ టీడీపీ ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది. చంద్రబాబు ఎన్నో సంక్షోభాలను చూశారు. అయితే వాటి నుంచి బయటపడ్డారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత కళా వెంకట్రావు వంటి నమ్మకమైన నేతలే వెళ్లిపోయారు. కానీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎందరు నేతలు వెళ్లిపోయినా చంద్రబాబు ఇప్పటిలా దిగాలు పడలేదనే చెప్పాలి. రెట్టించిన ఉత్సాహంతో ఆయన పార్టీని పటిష్టం చేసేందుకు కసితో పనిచేశారు. కానీ ఈసారి మాత్రం టీడీపీకి తేడా కొట్టిందనే చెప్పాలి.

జెండా పట్టుకోవడానికే…..

గ్రామస్థాయిలో ఉన్న నేతలు సయితం జెండా పట్టుకోవడానికే భయపడిపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు అనుభవించిన వారిలో దాదాపు పదిశాతం మంది కూడా నేడు యాక్టివ్ గా లేరు. ఇక మాజీ ఎమ్మెల్యేల సంగతి సరే సరి. కనీసం ప్థానిక సంస్థల ఎన్నికలను సయితం వారు పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రధానంగా ఆర్థిక భారం మోయలేకనే వారు కాడి వదిలేశారంటున్నారు. పంచకర్ల రమేష్ వంటి నేతలు ఖర్చు భరించలేకనే పార్టీని వీడారన్న ప్రచారం కూడా ఉంది.

నాలుగేళ్లు ఎలా?

ఇక ఉన్న ఎమ్మెల్యేల్లో నలుగురైదుగురు మినహా పెద్దగా యాక్టివ్ గా లేరు. పార్టీతో సుదీర్ఘకాలం సంబంధం ఉన్న రామసుబ్బారెడ్డి, సతీష్ రెడ్డి వంటి నేతలు తెంచుకుని వెళ్లిపోతున్నారంటే దీంతో చంద్రబాబు ఇటు పార్టీని గాడిన పెట్టలేక, అటు వైసీపీ ప్రభుత్వం పోరాటం చేయలేక అలసిపోతున్నట్లు కన్పిస్తుంది. మరో నాలుగేళ్లు వైసీపీ అధికారంలో ఉంటుంది. ఈ నాలుగేళ్ల పాటు చంద్రబాబు పార్టీని ఎలా ముందుకు తీసుకెళతారన్నది పార్టీ నేతల నుంచి కూడా వస్తున్న ప్రశ్న. మరి ఈ నాలుగేళ్లు చంద్రబాబు నరకం చూడాల్స వస్తుందన్న వ్యాఖ్యలు పార్టీ నుంచే విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News