మరో ఇద్దరు వైసీలోకి రెడీనట… ఇక బాబుకు కష్టాలే

వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ ను వేగవంతం చేసింది. ఉత్తరాంధ్రకు చెందిన మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారట. వీరిద్దరూ దాదాపుగా వైసీపీలోకి వచ్చేందుకు [more]

Update: 2020-09-21 06:30 GMT

వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ ను వేగవంతం చేసింది. ఉత్తరాంధ్రకు చెందిన మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారట. వీరిద్దరూ దాదాపుగా వైసీపీలోకి వచ్చేందుకు అంగీకరించినట్లు తెలిసింది. ముహూర్తం చూసుకుని పార్టీలో చేరతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఇద్దరు చేరితే చంద్రబాబు ప్రతిపక్ష హోదా కోల్పోయినట్లే అవుతుంది. తాజాగా వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీ లో చేరిన తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా ఉండేందుకు టీడీపీ అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టింది.

బాబు అలెర్ట్ అయి…..

ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ గూటికి చేరారు. మరో ఒక్కరు చేరితే ప్రతిపక్ష హోదా చంద్రబాబుకు గల్లంతవుతుంది. అందుకోసమే చంద్రబాబు అందరు ఎమ్మెల్యలతో టచ్ లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతిఒక్క టీడీపీ ఎమ్మెల్యేతో విడివిడిగా మాట్లాడుతున్నారు. వారికి ఉన్న వ్యక్తిగత సమస్యలతో పాటు నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను కూడా చంద్రబాబు అడిగి తెలుసుకుంటున్నారు. వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు.

ఇచ్ఛాపురం ఎమ్మెల్యే……

తాజాగా ఉత్తరాంధ్ర మీదనే వైసీపీ కన్నేసినట్లు సమాచారం. తాజాగా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ పేరు ప్రముఖంగా విన్పిస్తుంది. ఈయన గత కొద్దికాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యే గా ఉన్నా ఏ పనీ జరగడం లేదు. అధికారులు సయితం వైసీపీ ఇన్ ఛార్జుల మాట వింటుండటంతో బెందాళం అశోక్ కొంతకాలంగా వైసీపీలోకి వెళ్లాలన్న యోచనలో ఉన్నారట. దీంతో వైసీపీ కూడా బెందాళం అశోక్ రాకకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

గణబాబు కూడా ఓకేనట…..

మరో ఎమ్మెల్యే గణబాబు. ఈయన విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి టీడీపీ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గణబాబు కూడా గంటా శ్రీనివాసరావు శిష్యుడే. దీంతో గణబాబు కూడా వైసీపీలో చేరతారని ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. వీరిద్దరూ అతి త్వరలోనే తాడేపల్లి ముఖ్యమంత్రి కార్యాలయానికి రానున్నట్లు సమాచారం. వీరిద్దరూ వస్తే చంద్రబాబు ప్రతిపక్ష హోదాను గల్లంతు చేయవచ్చన్నది వైసీపీ ఆలోచన. దీంతో ఈ ఇద్దరిని వైసీపీలోకి వెళ్లకుండా చేరేందుకు టీడీపీ సీనియర్ నేతలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందోచూడాలి.

Tags:    

Similar News