బాబుకు అది కూడా పోతుందా?

వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ ఆగలేదు. చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలను ఇంకా తన గూటికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ [more]

Update: 2020-09-19 08:00 GMT

వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ ఆగలేదు. చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలను ఇంకా తన గూటికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమార్ వైఎస్ జగన్ ను కలవడం టీడీపీకి షాకింగ్ న్యూస్ గానే చెప్పాలి. వాసుపల్లి గణేష్ జగన్ కు మద్దతు తెలపడంతో టీడీపీ నుంచి మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. దీంతో టీడీపీ సభ్యుల సంఖ్య 19కి చేరుకుంది. మరొక సభ్యుడు వైసీపీకి మద్దతు పలికితే చంద్రబాబు ప్రతిపక్ష హోదా కూడా పోతుంది.

అనుబంధ సభ్యుడిగానే…..

గతంలోనే టీడీపీ నుంచి వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి లు టీడీపీని వీడి వైసీపీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. వీరు వైసీపీ కండువా కప్పుకోకపోయినా అనధికారికంగా మద్దతు పలికినట్లే. ఇప్పుడు అదే రీతిలో వాసుపల్లి గణేష్ కూడా ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు పలుకుతారు. జగన్ ను కలసి తన మద్దతును ప్రకటించిన వాసుపల్లి గణేష్ ఇకపై అనధికారికంగా వైసీపీ సభ్యుడిగానే కొనసాగుతారు.

ఇక ఎవరూ వెళ్లరని భావించి….

నిజానికి చంద్రబాబు కరణం బలరాం పార్టీ నుంచి వెళ్లిపోయిన తర్వాత మిగిలిన సభ్యులతో టచ్ లోనే ఉంటున్నారు. ప్రధానంగా ప్రకాశం జిల్లాకు చెందిన గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావులు పార్టీని వీడిపోతారన్న టాక్ నడిచింది. దీంతో అందరు ఎమ్మెల్యేలతో చంద్రబాబు టచ్ లోనే ఉంటున్నారు. వారిపై నమోదు చేసిన కేసులు, ఆర్థిక ఇబ్బందులను కూడా ఆరా తీస్తూ వారిలో భారోసా నింపుతూ వస్తున్నారు.

చివరి నిమిషంలో ప్రయత్నించినా…..

ఇక గంటా శ్రీనివాసరావు విషయంలోనూ చంద్రబాబు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. గంటా వైసీపీలోకి వెళతారని తెలిసి కూడా ఆయనను బుజ్జగించడం వంటివి చంద్రబాబు చేయలేదు. కానీ వాసుపల్లి గణేష్ మాత్రం వెళ్లరని చంద్రబాబు నమ్మకంగా ఉన్నారు. అయితే రాజధానిపై ఇటీవల టీడీపీ సోషల్ మీడియాలో వాసుపల్లి గణేష్ పేరిట ట్రోల్ చేయడంపై ఆయన హర్ట్ అయినట్లు తెలిసింది. దీనికి కూడా టీడీపీ నేతల చేత చంద్రబాబు వాసుపల్లికి సర్ది చెప్పే ప్రయత్నంచేశారు. అయినా ఫలించలేదు. మొత్తం మీద పదిహేను నెలల్లో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్లడం చంద్రబాబు గట్టి దెబ్బేనని చెప్పాలి.

Tags:    

Similar News