కాన్సెప్ట్ బాగానే ఉంది.. కానీ, క‌లిసి వ‌చ్చేదెవ‌రు..?

ఒక వాద‌న‌.. రెండు విష‌యాలు.. ఇదే కాన్సెప్ట్ టీడీపీని న‌డిపిస్తుంద‌ని, పున‌ర్ వైభ‌వం తెస్తుంద‌ని.. పార్టీ అధినేత‌, మాజీ సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అది.. జ‌గ‌న్ ప్రభుత్వ [more]

Update: 2020-09-26 06:30 GMT

ఒక వాద‌న‌.. రెండు విష‌యాలు.. ఇదే కాన్సెప్ట్ టీడీపీని న‌డిపిస్తుంద‌ని, పున‌ర్ వైభ‌వం తెస్తుంద‌ని.. పార్టీ అధినేత‌, మాజీ సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అది.. జ‌గ‌న్ ప్రభుత్వ వ్యతిరేక కాన్సెప్ట్ కాగా, మిగ‌తా రెండు విష‌యాలు.. చెదిరిపోయిన ఓటు బ్యాంకును చేరువ చేసుకోవ‌డం, క‌దిలిపోయిన త‌మ్ముళ్లను తిరిగి సైకిల్ ఎక్కించుకోవ‌డం. మొత్తం.. ఒక వాద‌న-రెండు విష‌యాల‌పై చంద్రబాబు ఆయ‌న త‌మ్ముళ్లు.. త‌ర్జన భ‌ర్జన ప‌డుతున్నారు. నిజానికి ఇప్పుడున్న స‌మ‌యం చాలా అద్భుత‌మైంది. ఎందుకంటే.. పార్టీ ప‌రంగా చంద్రబాబుపై సింప‌తీ ఇప్పటికీ ఉంది. పైగా రాజ‌ధాని విష‌యంలో అక్కడి ప్రజ‌లు చేస్తున్న ఆందోళ‌న‌, ప్రభుత్వం తీసుకుంటున్న చ‌ర్యలు, హైకోర్టు నుంచి వ్యక్తమ‌వుతున్న తీర్పులు త‌దిత‌ర విష‌యాల‌తో టీడీపీ పుంజుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది.

కోల్పోయిన ఓటు బ్యాంకు….

ఇక‌, అదే స‌మ‌యంలో వైసీపీ స‌ర్కారు దూకుడు ఉన్నప్పటికీ.. అనుకూల మీడియా ఇంకా చంద్రబాబు వెంటే న‌డుస్తోంది. నిజానికి ఆయ‌న ఓట‌మి త‌ర్వాత‌.. త‌న అనుకూల మీడియా కూడా త‌న‌ను విడిచి పెట్టేస్తుంద‌ని చంద్రబాబు అనుకున్నారు. కానీ, బాబు అనుకూల మీడియా ఆయ‌న వెంటే ఉంది. ఇక‌, త‌మ్ముళ్లలో కొంద‌రు పోయిన‌ప్పటికీ చాలా మంది ఆయ‌న వెంటే ఉన్నారు. దీంతో జ‌గ‌న్ స‌ర్కారుపై వ్యతిరేక వాద‌న‌ను.. త‌న త‌మ్ముళ్లను తిరిగిసైకిల్ ఎక్కించుకునే కీల‌క‌మైన ప‌రిణామాన్ని.. బీసీ, ఎస్సీ ఓటు బ్యాంకును తిరిగి త‌న ఖాతా వైపు మ‌ళ్లించుకునే క్రతువును చేయాల‌ని చంద్రబాబు ఇటీవ‌ల జ‌రిగిన స‌మావేశంలో నిర్ణయించారు.

పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని…..

అయితే.. కాన్సెప్టు బాగున్నా.. క‌లిసి వ‌చ్చిన నాయ‌కులు ఎవ‌రూ కూడా క‌నిపించ‌క‌పోవ‌డం, ఎవ‌రూ కూడా త‌మ్ముళ్లను తిరిగి చేరువ చేసే బాధ్యత‌ను తీసుకోక‌పోగా.. త‌మ వ‌ర‌కు తాము ప‌రిమిత‌మ‌వుతామ‌ని చెప్పడంతో చంద్రబాబు ఈ విష‌యంలో త‌ర్జన భ‌ర్జన‌కు గుర‌వుతున్నారు. చంద్రబాబు పార్టీ కార్యక్రమాలు వేగవంతం చేయాల‌ని నాయ‌కుల‌కు పిలుపు ఇస్తున్నా వారెవ్వరు ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇది చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారింది.

బయటకు వచ్చేందుకు…..

పైగా చంద్రబాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్ హైద‌రాబాద్‌లో ఉంటే ఇక్కడ మేం నియోజ‌క‌వ‌ర్గాల్లో తిర‌గాలా ? అన్న అస‌హ‌నం కొంద‌రిలో ఉంటే.. మ‌రి కొంద‌రిలో మాత్రం ఇప్పుట‌కి జ‌నాల్లో జ‌గ‌నే ఉన్నాడ‌ని.. మ‌నం ఎంత తిరిగినా కాళ్లకు ఉన్న చెప్పులు అర‌గ‌డం మిన‌హా ఉప‌యోగం ఉండ‌దంటున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్రబాబు కాన్సెప్ట్ ఓకే కానీ.. వ‌ర్కవుట్ కాలేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి దీనిపై చంద్రబాబు ఎలాంటి వ్యూహాన్ని అనుస‌రిస్తారో చూడాలి.

Tags:    

Similar News