ఢిల్లీ బాబుని పట్టించుకోవడంలేదా ?

చంద్రబాబు చేతిలో ఎన్నో చక్రాలు ఉండేవి.అవన్నీ జాతీయ చక్రాలే. ఒకటా రెండా. అవసరానికో చక్రం తీసి జాతీయ స్థాయి రాజకీయాలను గాడిన పెట్టిన చరిత్ర తనదని చంద్రబాబు [more]

Update: 2020-09-19 15:30 GMT

చంద్రబాబు చేతిలో ఎన్నో చక్రాలు ఉండేవి.అవన్నీ జాతీయ చక్రాలే. ఒకటా రెండా. అవసరానికో చక్రం తీసి జాతీయ స్థాయి రాజకీయాలను గాడిన పెట్టిన చరిత్ర తనదని చంద్రబాబు ఇప్పటికీ ఇప్పటికీ గొప్పలు చెప్పుకుంటారు. తాను ఎంతో మందిని ప్రధానులు, రాష్ట్రపతులను చేశానని కూడా చాటింపు వేసుకుంటూంటారు. అంతదాకా ఎందుకు 2019 ఎన్నికల ఫలితాలు వచ్చేంతవరకూ చంద్రబాబు గారి ఫ్లైట్ ఏపీ టూ ఢిల్లీ షటిల్ సర్వీస్ చేసేది. మరి ఏడాదిన్నరగా చూస్తే చంద్రబాబు రాజకీయ కధ అడ్డంగా తిరిగింది. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో ఏమీ కాకుండా పోయారని అంటున్నారు.

ఒక్క ఫోన్ కాల్ ….

అదేదో సినిమాలో ఒక పాత్ర తనకు ఒక్క చాన్స్ ఇవ్వాలని అందరినీ కోరుతూ ప్రాధేయపడుతుంది. అలాగే ఢిల్లీ నుంచి ఒక్క ఫోల్ కాల్ రావాలని చంద్రబాబు శిబిరం తపించిపోతోంది. తాను ఢిల్లీలో ఇపుడున్న జాతీయ నాయకులు అందరి కంటే కూడా సీనియర్ మోస్ట్ అని చంద్రబాబు తెగ చెప్పుకుంటారు కదా. ప్రధాని మోడీ కూడా తనకంటే జూనియర్ అని ఆయన ప్రచారం చేసుకుంటారు కదా. అటువంటిది తనకు జాతీయ నేతలు ఎవరూ ఏ కీలక సందర్భంలో కూడా ఫోన్ చేయకపోవడం చంద్రబాబుకు నిజంగా అవమానమే అనుకోవాలేమో. ఢిల్లీలో యూపీయే, ఎన్డీయే కూటములు ఉన్నాయి. అయినా ఎవరూ చంద్రబాబు ఊసు ఇపుడు ఎత్తడడంలేదుట.

జగన్ తోనే అలా….

మరో వైపు చూస్తే జగన్ ఏపీలో అతి బలమైన నాయకుడిగా ఎమర్జ్ అయిపోయారు. చేస్తే ఆయనకే ఏ నాయకుడు అయినా ఫోన్ చేస్తున్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మద్దతు కోరుతూ బీహార్ సీఎం నితీష్ కుమార్ జగన్ కే ఫోన్ చేశారు. చంద్రబాబుని పట్టించుకోలేదు. అవును మరి ఆయన పార్టీకి పెద్దల సభలో ఉన్నది ఒకే ఒక సీటు, నలుగురు ఎంపీలు బీజేపీలోకి వెళ్ళిపోయాక మిగిలిన బలం అదే. అందుకే చంద్రబాబుతో పనేముందని అటు యూపీయే, ఇటు ఎన్డీయే కూడా భావిస్తున్నాయి అనుకోవాలేమో. ఇదొక్కటే కాదు, ఏ కీలకమైన నిర్ణయం కేంద్ర స్థాయిలో తీసుకోవాలనుకున్నా కూడా ప్రధాని ఆఫీస్ ద్వారా జ‌గన్ కే ఫోన్ వస్తోంది.

యూటర్న్ అంటే …..

అసలైన యూ టర్న్ అంటే ఇదే కదా. చంద్రబాబుకు యూ టర్న్ అంకుల్ అని పేరు కానీ. రాజకీయాల్లో గతులు మారినపుడు ఎవరైనా చేసేది ఇదే. ఒకపుడు ఉమ్మడి ఏపీ అంటే నాయుడు మాత్రమే లీడర్ ని జాతీయ పత్రికలొ ఘోషించేవి ఎన్టీయార్ని కూలదోసి సీఎం అయిన కాలంలో చంద్రబాబు ప్రభ ఢిల్లీ లెవెల్లో ఒక్కసారిగా వెలిగిపోయింది. సంకీర్ణ ప్రభుత్వాల వల్ల కూడా బాబు అవసరం పడేది. దాన్ని ఆయన చక్కగా వాడుకునేవారు. చక్రాలు తిప్పినట్లుగా అనుకూల మీడియా చిత్రీకరించేది. 2014 నుంచి పరిస్థితి మారిపోయింది. కేంద్రంలో బలమైన సర్కార్ మోడీ రూపంలో రావడంతో చంద్రబాబు గారి చక్రాలకు పని లేకుండా పోయింది. ఇక ఏపీలో కూడా జగన్ కొత్త తరం నాయకుడిగా ముందుకు రావడంతో చంద్రబాబుకు ప్రాంతీయంగానూ పలుకుబడి తగ్గింది. ఈ కారణాలతోనే జాతీయ స్థాయిలో బాబుని ఎవరూ పట్టించుకోవడంలేదని అంటున్నారు. మీకో ప్రభుత్వం ఉంది. మాకో ప్రభుత్వం ఉంది. మీది జాతీయ పార్టీ, మాదీ జాతీయ పార్టీ అంటూ 2018 కాలంలో చంద్రబాబు మోడీ అండ్ కో మీద గర్జించిన తీరు ఇపుడు కామెడీగా బాబుకే అనిపించినా ఆశ్చర్యం లేదుగా.

Tags:    

Similar News