ఎవ‌రికి.. ఎందుకు..? బాబు మైండ్ గేమ్..!

టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా త‌న పార్టీ శ్రేణుల‌కు మ‌రో లక్ష్యం విధించారు. వ‌చ్చే వంద రోజుల పాటు.. రాష్ట్రంలో `ప‌సుపు చైత‌న్యం` కార్యక్రమం నిర్వహించాల‌ని సూచించారు. [more]

Update: 2020-09-16 00:30 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా త‌న పార్టీ శ్రేణుల‌కు మ‌రో లక్ష్యం విధించారు. వ‌చ్చే వంద రోజుల పాటు.. రాష్ట్రంలో 'ప‌సుపు చైత‌న్యం' కార్యక్రమం నిర్వహించాల‌ని సూచించారు. దీనిద్వారా ప్రజ‌ల్లోకి వెళ్లి.. పార్టీని బ‌లోపేతం చేయాల‌నేది చంద్రబాబు వ్యూహం. మంచిదే. ఏ పార్టీ అధినేత అయినా.. ఇదే కోరుకుంటారు. పార్టీ బ‌లంగా ఉండాలి. ఎన్నేళ్లయినా.. ఎదురులేని అధికారం ద‌క్కాలి. అనేవి స‌ర్వసాధార‌ణం. గ‌తంలో త‌మిళ‌నాడు మాజీ సీఎం క‌రుణానిధి కూడా చ‌నిపోవ‌డానికి ఆరు మాసాల ముందు కూడా 90ల వ‌య‌సులోనూ పార్టీ ప‌గ్గాల‌ను వ‌దులుకోవ‌డానికి ఇష్టప‌డ‌లేదు.

అపవాదును మోస్తూ….

అధికారం, ఆధిప‌త్యం అనేది నాయ‌కుల‌కు ఉండాల్సిన భూష‌ణాలు అవునా కాదా ? అనే విష‌యాల‌ను ప‌క్కన పెడితే.. ప్రస్తుతం ఇవే నాయ‌కుల‌కు ప్రధానంగా మారాయి. స‌రే.. ఇప్పుడు చంద్రబాబు విష‌యానికి వ‌స్తే.. ప‌సుపు చైత‌న్యం ప్రజ‌ల్లో రావాల‌ని, ప్రజ‌లు త‌మ పార్టీకి మ‌ద్దతుగా నిల‌వాల‌ని ఆయ‌న అభిల‌షిస్తున్నారు. కానీ, వాస్తవానికి 2014కు ముందు ఎలాంటి చైత‌న్యం లేకుండానే ప్రజ‌లు చంద్రబాబు వెంట నిల‌బ‌డ్డారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యానికి ఈ చైత‌న్యం కాస్తా.. ఆవిర‌య్యేలా ప్రజ‌లు ఇచ్చిన పాల‌న‌ను సాగించార‌నే అప‌వాదును మోస్తున్నారు.

ప్రజల్లో కాదు తమ్ముళ్లలోనే….

సో.. దీనిని బ‌ట్టి చైత‌న్యం కావాల్సింది.. ఎవ‌రికి అంటే.. చంద్రబాబుకు ఆయ‌న పార్టీ త‌మ్ముళ్లక‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. మ‌రీ ముఖ్యంగా త‌న కుమారుడు, మాజీ మంత్రి లోకేష్ ఇంటికే ప‌రిమిత‌మై.. పిట్ట ప‌లుకుల‌తోనే స‌రిపెడుతున్న వైనం పార్టీని బ‌లోపేతం చేస్తుందా ? ప‌్రజ‌ల‌కు పార్టీని చేరువ చేస్తుందా ? అనేది కీల‌కంగా మారిన విష‌యం. పార్టీలోనే సంస్థాగ‌తంగా అనేక లొసుగులు ఉన్నాయి. ఎక్కడిక‌క్కడ పార్టీ నాయ‌కులు త‌మదైన దారుల్లో న‌డుస్తున్నారు.

లొసుగులను సరి చేసుకుంటే…?

పార్టీలోనే ఉంటూ.. పార్టీ పునాదులు క‌దిలించేలా ప్రయ‌త్నిస్తున్నారు. ముందు వీరిలో చైత‌న్యం తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అంతేకాదు… మూస ధోర‌ణితో ముందుకు సాగ‌డం కాకుండా.. త‌న‌దైన విప్లవాత్మక రాజ‌కీయాల‌ను అనుస‌రించిన‌ప్పుడు ప‌సుపు చైత‌న్యం.. ప్రజాచైత‌న్యంగా మారుతుంద‌నే సూచ‌న‌లు కూడా వ‌స్తున్నాయి. మ‌రి చంద్రబాబు వింటారా ? వినిపించుకుంటారా ? ఏమో చూడాలి.

Tags:    

Similar News