ఎవరేమనుకున్నా…కాదన్నా అతడే.. బాబు వారసుడు ?

చంద్రబాబు వారసుడు ఎవరు.. ఇది తెలుగుదేశం పార్టీలో ఎడతెగని చర్చ. ఇంకా చెప్పాలంటే ఇతర పార్టీలలో కూడా అదే చర్చ. ఓ విధంగా టీడీపీ ఇపుడు నాయకత్వ [more]

Update: 2020-03-18 13:30 GMT

చంద్రబాబు వారసుడు ఎవరు.. ఇది తెలుగుదేశం పార్టీలో ఎడతెగని చర్చ. ఇంకా చెప్పాలంటే ఇతర పార్టీలలో కూడా అదే చర్చ. ఓ విధంగా టీడీపీ ఇపుడు నాయకత్వ బలహీనతతోనే కొట్టుమిట్టాడుతోంది. దాన్ని ఆసరాగా చేసుకునే జగన్ దూకుడు పెంచుతున్నారు. చంద్రబాబుకు ఎటూ వయసు అయిపోయింది. ఇక ఫ్యూచర్ లీడర్లు లేరు. దాంతో ఏపీని మొత్తం దున్నేయవచ్చునని జగన్ భారీ ఆశలతో వైసీపీని పరుగులుపెట్టిస్తున్నాడు. అయితే జగన్ అనుకున్నట్లుగా టీడీపీ కొలాప్స్ అయిపోలేదని, పార్టీకి కొత్త నెత్తురు ఎక్కించి మరిన్ని దశాబ్దాలు బతికించే సత్తా తమ నాయకుడికి ఉందని తమ్ముళ్ళు అంటున్నారు.

డౌన్ ఫాల్ అలా…..

చంద్రబాబు రాజకీయ వారసుడు నారా లోకేష్ అని అంతా అప్పట్లో అనుకున్నదే. అయితే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోవడంతో పాటు, ఏకంగా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి భారీ ఓటమిని మూటకట్టుకోవడంతో ఆయన మీద ఒక్కసారిగా ఫోకస్ తగ్గిపోయింది. లోకేష్ నాయకుడేంటి అన్నది టీడీపీలోనే పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. సీనియర్ నేతలు అయితే చంద్రబాబే మా నాయకుడు. ఆ తరువాత ఏం జరుగుతుందో మాకు తెలియదు అని తప్పించుకుంటున్నారు. అంటే మొత్తానికి ఇపుడు ఎవరూ లోకేష్ ని భావి నాయకుడిగా గుర్తించడంలేదన్నమాట. దాంతో వారందరికీ చంద్రబాబు గట్టి సిగ్నల్ ఒకటి పంపించారు.

సిగ్నల్ ఇచ్చారా…?

ఇటీవల హైదరబాద్ లో టీడీపీ యువ నేతలందరితో లోకేష్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రుల తనయులు, సీనియర్ నేతల వారసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారందరూ లోకేష్ మాట మీదనే ఈ భేటీకి వచ్చారు. ఆ విధంగా కొత్త తరం లోకేష్ వెంట వుండేలా చంద్రబాబు తెర వెనక భారీ స్కెచ్ వేశారని అంటున్నారు. సీనియర్లు కధ టీడీపీలో ఇక ముగిసిందని, వారు లోకేష్ ని పట్టించుకోకపోయినా ఫర్వాలేదు కానీ యువ నేతలు కనుక దూరమైతే అది పార్టీకే చేటు అని గ్రహించిన చంద్రబాబు తెలివిగా వేసిన ఎత్తుగడల్లో భాగమే లోకేష్ తో టీడీపీ యూత్ వింగ్ ప్రత్యేక భేటీ అంటున్నారు.

ఎవరు కాదన్నా…?

చంద్రబాబు తాజాగా ఒక కచ్చితమైన నిర్ణయం తీసుకున్నారుట. ఎవరు కాదన్నా కూడా తన తరువాత టీడీపీకి లోకేష్ అసలైన వారసుడు అని చెప్పదలచుకున్నారట. సీనియర్లు ఎటూ దాన్ని సపోర్ట్ చేయరు. జీర్ణించుకోరు. అందుకే వారి కంటే రేపటి నాయకులు అయిన యువ నేతలనే దగ్గరకు తీస్తే లోకేష్ భావి రాజకీయానికి వారు పెట్టని కోటలా అండగా ఉంటారని చంద్రబాబు భావిస్తున్నారుట. ఇకపైన లోకేష్ భేటీలన్నీ జూనియర్ తమ్ముళ్ళతో ఉంటాయని, పార్టీలో కూడా యువతకు పెద్ద పీట వేసి వారికి నాయకత్వం వహించే అవకాశాన్ని లోకేష్ కి ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారుట. మొత్తానికి తాను ఫాంలో ఉండగానే లోకేష్ చేతిలో పార్టీ పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు ఆలోచనలు చేస్తున్నారుట.

Tags:    

Similar News