మై హూనా… బాబు మార్క్ పాలిటిక్స్

పార్టీ పూర్తిగా చేయిజారిపోతున్నప్పుడు అన్ని అస్త్ర శస్త్రాలను ప్రయోగించాల్సి ఉంటుంది. తమ చేతుల్లో ఏమీ లేనప్పుడు ఏదో ఒకటి సృష్టించాల్సి ఉంటుంది. లేకుంటే క్యాడర్ కకావికలమయిపోతుంది. ఇప్పుడు [more]

Update: 2020-09-13 06:30 GMT

పార్టీ పూర్తిగా చేయిజారిపోతున్నప్పుడు అన్ని అస్త్ర శస్త్రాలను ప్రయోగించాల్సి ఉంటుంది. తమ చేతుల్లో ఏమీ లేనప్పుడు ఏదో ఒకటి సృష్టించాల్సి ఉంటుంది. లేకుంటే క్యాడర్ కకావికలమయిపోతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుదీ అదే పరిస్థితి. నలభై ఏళ్ల రాజకీయ అనుభవంతో చంద్రబాబు దాదాపు మూడు దశాబ్దాల నుంచి పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు. అధికారంలోకి తెస్తారన్న నమ్మకాన్ని నేతల్లో, క్యాడర్ లోనూ చంద్రబాబు కలిగిస్తున్నారు.

పదేళ్లు దూరంగా ఉన్నా….

2004, 2009 ఎన్నికల్లో వరసగా తెలుగుదేశం పార్టీ పరాజయం పాలయింది. పదేళ్లపాటు పార్టీని చంద్రబాబు కంటికి రెప్పలా కాపాడుకొచ్చారు. ఎంతో మంది నేతలను పార్టీని వీడిపోయినా తాను ఏమాత్రం బెదరలేదు. చెక్కు చెదరలేదు. పార్టీ అభిమానుల్లో, కార్యకర్తల్లో ఉన్న భయం ఆ పదేళ్లలో ఆయనకు లేదంటే నమ్మాల్సిందే. అంత ధైర్యంగా పార్టీని ముందుండి నడిపారు. పదేళ్ల పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. క్యాడర్ లో ధైర్యాన్ని నింపగలిగారు.

ఇప్పుడు మాత్రం…..

ఫలితంగా 2014లో పార్టీని చంద్రబాబు అధికారంలోకి రాగలిగారు. ఇప్పుడు చంద్రబాబుకు వయసు పై బడింది. అయినా ఆయన ఎక్కడా తగ్గడం లేదు. కానీ తనకున్న అనుభవంతో క్యాడర్ లో ఎప్పటికప్పుడు ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుండటంతో ఏడాది కాలంగా నేతలతో పాటు క్యాడర్ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరమయింది. ఇందుకోసం తొలుత మోదీకి లేఖ రాశారు. మోదీ చంద్రబాబుకు ఫోన్ చేయగానే దానిని పార్టీకి అనుకూలంగా ఉపయోగించుకున్నారు.

క్యాడర్ లో ధైర్యం నింపేందుకు…..

ఇక తాజాగా జమిలి ఎన్నికలు వస్తాయని చంద్రబాబు చెబుతున్నారు. ఢిల్లీ నుంచి ఆయనకు ఖచ్చితమైన సమాచారం వచ్చిందో? లేదో? తెలియదు కాని ఆయన ఆ మాటలు అన్నది క్యాడర్ కోసమేనన్నది అందరికీ తెలిసిందే. మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తాయంటే క్యాడర్ బయటకు వస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. ధైర్యంగా ఉంటుంది. దీంతోనే చంద్రబాబు జమిలి ఎన్నికల అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబుకు నిన్నమొన్నటి వరకూ సన్నిహితుడిగా మెలిగి బీజేపీలోకి వెళ్లిన సీఎం రమేష్ సయితం కేంద్ర ప్రభుత్వం జమిలి ఆలోచన చేయడం లేదని చెబుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం జమిలి ఎన్నికలు వస్తాయని చెబుతున్నారు. క్యాడర్ లో ధైర్యాన్ని నూరిపోసేందుకే చంద్రబాబు జమిలి ఎన్నికల అంశాన్ని ప్రస్తావిస్తున్నారన్నది కాదనలేని వాస్తవం.

Tags:    

Similar News