ఇక టీడీపీ సెట్ అయినట్లేనా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కొంత ఊపిరి పీల్చుకున్నట్లే కనపడుతుంది. ఎమ్మెల్యేలు వరసగా చేజారి పోతుండటంతో ఆయనలో నిన్నమొన్నటి వరకూ నెలకొన్న ఆందోళన తొలగిపోయింది. ఇప్పటికే ముగ్గురు [more]

Update: 2020-09-06 06:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కొంత ఊపిరి పీల్చుకున్నట్లే కనపడుతుంది. ఎమ్మెల్యేలు వరసగా చేజారి పోతుండటంతో ఆయనలో నిన్నమొన్నటి వరకూ నెలకొన్న ఆందోళన తొలగిపోయింది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడటం, గంటా శ్రీనివాసరావు కూడా పార్టీ వీడతారన్న ప్రచారంతో మరెంత మంది పార్టీని వీడతారోనన్న ఆవేదన చంద్రబాబులో ఉంది. అయితే ఇక మిగిలిన ఎమ్మెల్యేలు గీత దాటరన్న కాన్ఫిడెన్స్ చంద్రబాబులో కన్పిస్తుంది.

ఆపరేషన్ ఆకర్ష్…..

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ తాను పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించనని చెప్పారు. ఒకవేళ పార్టీ మారాలంటే శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి రావాల్సి ఉంటుందని శాసనసభ సాక్షిగా ప్రకటించారు. అయితే చంద్రబాబు పదే పదే తన పాలనకు అడ్డుతగులుతుండటంతో జగన్ కొత్త రాజకీయ వ్యూహానికి తెరలేపారు. పార్టీ కండువా కప్పుకోకుండానే మద్దతిచ్చేలా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.

ముగ్గురిని మాత్రమే….

అలా టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాంలను టీడీపీ నుంచి బయటకు రప్పించగలిగారు. వైసీపీ ప్రధాన టార్గెట్ చంద్రబాబుకు ప్రతిపక్ష హోదాను తప్పించడమే. ఇందుకు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అవసరమవుతారు. అయితే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలంతా కలసి కట్టుగా ఉన్నట్లు కనపడుతుంది. వారిలో గంటా శ్రీనివాసరావు తప్పించి మరెవ్వరూ పార్టీని వీడేందుకు ఇష్టపడటం లేదు.

మిగిలిన ఎమ్మెల్యేలు….

ఎన్ని ఒత్తిడులు వచ్చినా, ఆర్థికంగా నష్టం కల్గించినా పార్టీని వీడేందుకు ఎమ్మెల్యేలు సుముఖంగా లేరు. గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్ లాంటి ఎమ్మెల్యేలు ఒత్తిడులకు, ఆర్థికంగా నష్టం కల్గిస్తున్నా పార్టీ ని వీడేందుకు సుముఖంగా లేరు. ఇది చంద్రబాబుకు ఊరటనిచ్చే అంశంగానే చెప్పుకోవాలి. ఏడాదిన్నర కాలంలో కేవలం ముగ్గురి ఎమ్మెల్యేలను మాత్రమే ఆకర్షించగలిగారు. క్రమంగా టీడీపీ నేతలు సెట్ అవుతున్నారని చంద్రబాబు సయితం అభిప్రాయపడుతున్నారు. మరో ఏడాదిలో పార్టీని పూర్తిగా సెట్ చేసి 2024 ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయగలగుతామన్న ధీమాలో చంద్రబాబు ఉన్నారు.

Tags:    

Similar News