ఆయన అంతే… మారడంతే?

అదేంటో చంద్రబాబు పొలిటికల్ సీనియారిటీ ఏ ఏటికి ఆ ఏడు పెరుతుతూంటే ఆయన మాత్రం కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన జూనియర్ నేతల మాదిరిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన [more]

Update: 2020-09-04 13:30 GMT

అదేంటో చంద్రబాబు పొలిటికల్ సీనియారిటీ ఏ ఏటికి ఆ ఏడు పెరుతుతూంటే ఆయన మాత్రం కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన జూనియర్ నేతల మాదిరిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన అంశాల మీద చంద్రబాబు లాంటి సీనియర్ స్పందిస్తే బాగుంటుంది కానీ అయిన దానికీ కానిదానికీ బాబు జగన్ మీద విరుచుకుపడుతున్నారు.అన్నింటా నేనే అంటున్నారు. దాంతో ఆయన స్థాయి విలువ రోజురోజుకూ తానే పలుచన చేసుకుంటున్నారని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఏపీలొ రోడ్డు ప్రమాదాలు జరిగినా, అగ్ని ప్రమాదాలు జరిగినా జగన్ సర్కార్ దే తప్పు అన్నట్లుగా చంద్రబాబు తీరు ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఏదో రకంగా అధికార పార్టీ మీద బురద జల్లేస్తే ఇవాళ కాకపోయినా రేపటికైనా జనం వాటిని నమ్ముతారన్నదే చంద్రబాబు రాజకీయ విధానంగా ఉంది.

ఆ స్థాయిలో అలా….

దేశానికి ప్రధానిగా ఉన్న మోడీ కన్నా సీనియర్ నేతను అని చెప్పుకునే చంద్రబాబు ఆచరణలో మాత్రం దాన్ని చూపించడంలేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కూడా అన్ని శాఖల్లోనూ వేలూ కాలూ పెట్టేసేవారు. సరే సీఎం కాబట్టి హోదాకు అక్కడ భంగం కలగలేదు. ప్రతిపక్షంలోకి వచ్చాక చంద్రబాబు తన స్థాయిని తగినట్లుగా మసలుకుని ప్రకటనలు చేయాలి కదా అన్న మాట వినిపిస్తోంది. ఎక్కడో ఏదో ఊరిలో వీధుల్లో పరిశుభ్రత లేకపోయినా, లేక మరేదో చోట ఎక్కడో ఎన్టీయార్ విగ్రహం కూల్చేసినా కూడా చంద్రబాబు అర్జంటుగా లైన్లోకి వచ్చేసి జగన్ మీద రెచ్చిపోతూండడం ఆయన స్థాయికి తగదని అంటున్నారు.

అందుకే అలా….

టీడీపీకి సర్వం సహా నాయకుడు చంద్రబాబేనని అందరికీ తెలుసు. అయినా సరే వర్క్ డివిజన్ ఉండాలి. టీడీపీలో మాజీ మంత్రులు ఉన్నారు. ఎమ్మెల్యేలు ఉన్నారు. సీనియర్ నేతలు ఉన్నారు. తమ ప్రాంతాల్లో జరిగే సమస్యలపైన వారు రియాక్ట్ అయితేనే దానికి విలువ ఉంటుంది. జనం కూడా కనెక్ట్ అవుతారు. ప్రభుత్వానికి కూడా ఆ సమస్య వేడి తెలుస్తుంది, కానీ 13 జిల్లాల్లో ఎక్కడ ఏ స్థానిక సమస్య వచ్చినా కూడా చంద్రబాబు లాంటి జాతీయ నాయకుడు ట్విట్టర్ కి పనిచెప్పేసి జగన్ని తిట్టాలనుకోవడం అతి ఉత్సాహమే అంటున్నారు. ఈ కారణంగానే పార్టీ నేతలు ఎవరూ కనీసం తమ పరిధిలోని ప్రజా సమస్యలను కూడా పట్టించుకోవడంలేదని అంటున్నారు. పార్టీ అలా అచేతనంగా మారడానికి, నేతలు ఇన్ యాక్టివ్ కావడానికి చంద్రబాబు కారణమని కూడా అంటున్నారు.

డ్యామేజేనా..?

మరి ఈ విధంగా చంద్రబాబు ట్విట్టర్ కి రోజూ పని చెప్పడం వల్లనే ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని విశ్లేషణలు ఉన్నాయి. చంద్రబాబు స్థాయి నాయకుడు ఈ దేశంలో రాజకీయాల మీద మాట్లాడాలి, దిగజారుతున్న ఆర్ధిక వ్యవస్థ మీద విలువైన సూచనలు ఇవ్వాలి. ఇక ఏపీలో కూడా తక్కువ మాట్లాడుతూ పార్టీని పనిచేయనిచ్చేలా చూడాలి. కానీ చంద్రబాబుది ఎంతసేపూ తిరిగే కాలూ, తిట్టే నోరాయే. అందుకే ఆయన ట్వీట్లు చేస్తూ తన పరువు తానే పోగొట్టుకుంటున్నారు. ఆయన ఆఖరుకు ఇపుడు ఏపీ ప్రధాన కార్యదర్శికి వరస లేఖలు రాస్తున్నారు. రేపటి రోజున కలెక్టర్లకు, ఇంకా పోతే తాశీల్దార్లకు కూడా లేఖకు రాస్తూ గల్లీ స్థాయికి దిగిపోతారేమోనని తమ్ముళ్ళు కంగారు పడుతున్నారు. మరి చంద్రబాబు ఇంతే మారడంతేనన్నది కూడా వారి గట్టి అభిప్రాయం.

Tags:    

Similar News