తిమ్మరుసును తట్టి లేపుతున్న బాబు…?

మహామంత్రి తిమ్మరుసు. ఈ సినిమా చూసిన వారికి తిమ్మరుసు ఎంత గొప్ప రాజకీయ చతురుడో అర్ధవుతుంది. చంద్రబాబూ డిటోనటగా. పైగా తిమ్మరుసు చిత్తూరు జిల్లా వాడే. చంద్రబాబు [more]

Update: 2020-08-27 00:30 GMT

మహామంత్రి తిమ్మరుసు. ఈ సినిమా చూసిన వారికి తిమ్మరుసు ఎంత గొప్ప రాజకీయ చతురుడో అర్ధవుతుంది. చంద్రబాబూ డిటోనటగా. పైగా తిమ్మరుసు చిత్తూరు జిల్లా వాడే. చంద్రబాబు సొంత గడ్డ చంద్రగిరిలోనే చదివి ఎదిగిన మహా మంత్రి. రాయల వారి అస్థానంలో తిమ్మరుసు ఉండేవారు. ఇప్పటికి అయిదు వందల ఏళ్ల క్రితం తిమ్మరుసే అసలైన రాజుగా వైభోగం అనుభవించారు కూడా. అక్కడ నుంచి వచ్చిన చంద్రబాబులోనూ తిమ్మరుసు బాగానే పూనేసి ఉంటాడు. అందుకే చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం చూస్తే ఆయన ఎంత ఓడినా కూడా కత్తి వాడడంలేదు. ధైర్యం వీడడం లేదు.

ఇంతింతైన జగన్….

జగన్ ఏపీలో బలవంతుడుగా ఉన్నారు. ఆయన సామాజికవర్గం సమీకరణలు కూడా పక్కాగా కూర్చుకుంటూ ముందుకు పోతున్నారు. బీసీలను చంద్రబాబు నుంచి లాగేసిన జగన్ పవన్ నుంచి కాపులకు గేలం వేశాడు. ఇక ఆయన మొదట్లోనే కాంగ్రెస్ కి కన్నం పెట్టి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలని తన వెంట తెచ్చుకున్నాడు. ఇక రెడ్లు అండగా ఉండగా జయమే జయం అనుకుంటూ కత్తి దూస్తున్న జగన్ తో చంద్రబాబు ఎటూ పోటీ పడలేకపోతున్నాడు. పైగా కమ్మల్లోనూ బాబుకు చెడ్డ అవుతున్నారు, ఇంకో వైపు ఎన్టీయార్ నుంచి వచ్చిన బీసీలు కూడా దూరమయ్యారు. కాపులు నమ్మడం మానేశారు. ఇది కదా బాబు చింత.

పెద్ద గీతతో…..

చంద్రబాబు పార్టీ పునాదులు కదులుతున్నాయి. సొంత సామాజికవర్గం బీజేపీ వైపే చూస్తోంది. ఇక కాపు ఓట్లు పంచుకోవడానికి జనసేన బీజేపీ కూటమి కట్టింది. దాంతో చంద్రబాబుకు జగన్ మీద చాలా కోపంగా ఉందిట. తన వైపు బలాన్ని కసి కందకుండా చూసుకుంటున్న జగన్ ని కూడా బాగా తగ్గిస్తేనే సగం విజయం సాధించిన‌ట్లు అని చంద్రబాబు తలపోస్తున్నారుట. దాంతో మనసులోనే తిమ్మరుసుని తలచుకుని మరీ వైసీపీ సామాజిక వర్గాల మీద దాడికి రెడీ అంటున్నాడు. ఆయనకు ఈ విషయంలో చేయి సాయానికి మరో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అక్కరకు వచ్చేలా కనిపిస్తున్నాడులా ఉందని ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో డౌట్ కొడుతోందిట.

ఉమ్మడి శత్రువా …?

జగన్ ఇటు చంద్రబాబుకు, అటు కిరణ్ కుమార్ రెడ్డి కి ఉమ్మడి శత్రువు. ఎందుకంటే కిరణ్ ఇలా సీఎం గా ప్రమాణం చేయగానే అలా జగన్ కాంగ్రెస్ ను వీడారు, అంతేనా కిరణ్ సర్కార్ కి పెను సవాల్ గా మారి ఆయన‌ మూడేళ్ళ పదవీకాలంలో ముప్పతిప్పలు పెట్టారు. ఇపుడు చంద్రబాబు ఒక వైపు జగన్ తో పోరాడుతూంటే కాంగ్రెస్ రధం మీద కిరణ్ వస్తారట. జగన్ వైసీపీ నుంచి వైఎస్సార్ ని ఆయన లాగేస్తారట. అంతే కాదు వైసీపీ రెడ్లకు కూడా గేలం వేస్తారట. కాంగ్రెస్ కి జనంలో బలం పెంచితే మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంక్ కొంత అయినా ఇటు వస్తుందని కిరణ్ భావిస్తున్నారుట. కరోనా ఇలా తగ్గగానే అలా ఏపీకి రాహుల్, ప్రియాంకలు వస్తారని కూడా టాక్. మొత్తానికి కిరణ్ ఈ మధ్య హడావుడిగా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలకు ఇచ్చిన నివేదిక వెనక చంద్రబాబు డైరెక్షన్ ఉందా అంటే ఏమో బాబును తక్కువ అంచనా వేయకూడద‌నే సమాధానం వస్తోంది.

Tags:    

Similar News