బాబు ధైర్యం, భరోసా అదేనట

బస్తీ మే సవాల్ అని రాజకీయ నాయకులు రంగంలోకి దిగాలి. చంద్రబాబు దాని కాస్తా మార్చి విశాఖ మే సవాల్ అంటున్నారు. అమరావతి రాజధానిగా ఉండాలి అది [more]

Update: 2020-08-25 13:30 GMT

బస్తీ మే సవాల్ అని రాజకీయ నాయకులు రంగంలోకి దిగాలి. చంద్రబాబు దాని కాస్తా మార్చి విశాఖ మే సవాల్ అంటున్నారు. అమరావతి రాజధానిగా ఉండాలి అది చంద్రబాబు జీవితాశయం. అయితే అమరావతి నుంచి అరిస్తే లాభం లేదని ఆయన గ్రహించారు అందుకే సౌండ్ విశాఖ తూర్పు దిక్కు నుంచి చేయాలనుకుంటున్నారు. ఇది తూర్పు తిరిగి దండం పెట్టడం కాదు. తెలుగుదేశం రాజకీయం మార్పు కోసమన్నమాట. ఎంత కాదనుకునన టీడీపీకి ఉత్తరాంధ్రాలో బలం ఉంది. అలాగే విశాఖలో గత ఎన్నికల్లో నాలుగు ఎమ్మెల్యే సీట్లు కేవలం సిటీలోనే గెలిచారు. అందులో రెండు సీట్లలో 28 వేల వరకూ భారీ మెజారిటీ దక్కింది. దీంతో విశాఖ నుంచే శంఖారావం పూరించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు.

ఆర్ధిక రాజధానిగా ….

చంద్రబాబు కొత్త నినాదం విశాఖ ఆర్ధిక రాజధాని, నిజానికి ఇది పాత నినాదమే. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడల్లా విశాఖను ఆర్ధిక రాజధాని అంటూ వచ్చారు. దాని అర్ధం పరమార్ధం టీడీపీ తమ్ముళ్లకే అర్ధం కాని పరిస్థితి. ఇక చంద్రబాబు ఇపుడు తమ్ముళ్లకు చెబుతున్నారు. నేను అధికారంలో ఉండగా విశాఖకు ఎటువంటి అన్యాయం చేయలేదు. విశాఖను రెండవ రాజధాని అనుకున్నాను. ఆర్ధికంగా పటిష్టంగా ఉండాలని చూశాను, ఎన్నో పధకాలకు ప్రణాళికలు వేశాను, అవన్నీ వర్కౌట్ అయి ఉంటే విశాఖ కచ్చితంగా ఆర్ధిక రాజధాని అయి ఉండేది. ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. విశాఖకు పాలనా రాజధాని అవసరం లేదు, ఆర్ధిక రాజధాని మాత్రమే కావాలి. ఇదీ చంద్రబాబు నినాదం. ఇదే చెప్పమని తమ్ముళ్ళకు పురమాయిస్తున్నారు.

భయపడుతూ..పెడుతూ…..

ఇక విశాఖ జనం గురించి చంద్రబాబుకు రోజురోజుకూ భయం ఎక్కువైపోతోంది. విశాఖ వాసులు అయ్యా ఎలా బతుకుతారు, అక్కడ నిత్య ప్రమాదాలు అని తన జూమ్ యాప్ ద్వారా కన్నీళ్ళు కురిపించేస్తున్నారు. విశాఖలో భయంకరమైన వాతావరణం ఉంది. చుట్టూ రసాయ‌న పరిశ్రమలు ఉన్నాయి, అక్కడ భద్రత లేదు, అందుకే ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ఇపుడు అమ్మోనియం నైట్రేట్ నిల్వలు కూడా విశాఖ నిండా ఉన్నాయి. మరో బిరూట్ గా విశాఖ మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మొత్తం నగరానికే డేంజర్ అంటూ నిజంగానే ప్రజలు జడుసుకునేలాగే బాబు మార్క్ పాలిటిక్స్ చేస్తున్నారు. నిజంగా అవన్నీ ఏనాడో ఉన్నాయి. కానీ చంద్రబాబు అయిదేళ్ల సీఎం గా ఉన్నపుడూ, అంతకు ముందు ఉమ్మడి ఏపీకి తొమ్మిదేళ్ళు ఆయన ముఖ్యమంత్రిత్వం నెరపినపుడు కూడా ఉన్నాయి. కానీ చంద్రబాబు అధికారం దిగిపోగానే జగన్ ని టార్గెట్ చేస్తూ విశాఖ జనం భద్రతపైన కొత్త సందేహాలు లేవదీస్తున్నారనిపిస్తోంది

రౌడీ రాజ్యమేనా …?

ఇక మరో మాట కూడా చంద్రబాబు అంటున్నారు, విశాఖలో రౌడీ రాజ్యం మొదల‌యిందట. ఇప్పటికే అక్కడ భూ కభ్జాలు పెరిగిపోయాయట. రాజధాని అని ప్రకటించగానే మరింతగా రౌడీలు ముందుకొచ్చి అమాయక విశాఖ వాసుల భూములను లాగేసుకుంటున్నారుట. దీనిమీదనే వైసీపీ నేతలు రివర్స్ అటాక్ చేస్తున్నారు. అయిదేళ్ల చంద్రబాబు పాలనలోనే కదా విశాఖ భూ దందాలు పెద్ద ఎత్తున సాగింది. నాడు ఏకంగా టీడీపీ సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు తన సొంత పార్టీకి చెందిన మరో మంత్రి మీదనే భూ కబ్జా ఆరోపణలు చేసిన సంగతి చంద్రబాబు మరచిపోతే ఎలా అని ఎద్దేవా చేస్తున్నారు. సరే ఎవరేమనుకున్న బాబు మాత్రం అమరావతి కధను విశాఖ నుంచి నరుక్కురావాలనుకుంటున్నారు. విశాఖ ప్రశాంతతకు పాలనా రాజధానికీ అసలు పొంతన కుదరదు అని డైరెక్ట్ గా చెప్పెస్తున్నారు. ఇక మిగిలింది ప్రజలు తమంత తాము మాకు రాజధాని అవసరం లేదని చెప్పాలన్న మాట. దానికి తగిన ట్రైనింగ్ టీడీపీ పెద్దలే ఇస్తారేమో. మొత్తానికి అమరావతిని నిలబెట్టే భారం విశాఖదేనా..చూడాలి.

Tags:    

Similar News