బాబును అండర్ ఎస్టిమేట్ వేస్తే అంతే?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏమీ తెలయని వ్యక్తి కాదు. ఆయనను అండర్ ఎస్టిమేట్ వేయలేం. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఏ పనిచేసినా [more]

Update: 2020-08-19 14:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏమీ తెలయని వ్యక్తి కాదు. ఆయనను అండర్ ఎస్టిమేట్ వేయలేం. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఏ పనిచేసినా అందుకు వ్యూహం ఉంటుంది. సుదీర్ఘ ప్రయోజనాలు ఆశించే చంద్రబాబు ఏ పనైనా చేస్తారు. ఆయన ప్రతి కదలిక రాజకీయమే అంటారు చంద్రబాబును బాగా తెలిసిన వాళ్లు. చంద్రబాబు ప్రధాని మోదీకి వరసగా లేఖలు రాయడం ఆయనకు ఇబ్బంది తెచ్చి పెట్టిందని అనేక మంది విశ్లేషణలు చేస్తున్నారు. కానీ చంద్రబాబు మోదీకి ప్రత్యేకంగా లేఖ రాయడానికి, ఆయనను ప్రస్తుతించడానికి అనేక కారణాలున్నాయి.

ఆయన అనుభవం…..

చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవి చూశారు. ఉద్దండులైన నేతలతో పనిచేశారు. అలాంటి చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీకి ఫోన్ ట్యాపింగ్ విష‍యంపై ఎందుకు లేఖ రాశారు? తాను లేఖ రాసిన వెంటనే మోదీ స్పందించరని చంద్రబాబుకు తెలియదా? ప్రస్తుతమున్న బీజేపీ నేతలు తమను పార్టీ చెంతకు చేరనివ్వరన్న తెలయని చిన్న పిల్లాడు కాదు కదా? చంద్రబాబు. అయినా మోదీకి చంద్రబాబు లేఖ రాశారంటే అందుకు కారణాలు ఉంటాయన్నది వాస్తవం.

జాతీయ స్థాయిలో….

ముందుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జాతీయ స్థాయిలో ప్రచారం జరగాలి. ప్రధాని మోదీకి లేఖ రాసిన విషయాన్ని జాతీయ మీడియాకు కూడా చంద్రబాబు అందించారు. అంటే వైసీపీ ప్రభుత్వంపై జాతీయ స్థాయిలో నెగిటివ్ థికింగ్ రావాలి. దీంతో పాటు బీజేపీని, మోదీని ఎంత ప్రశంసిస్తున్నప్పటికీ బీజేపీ నేతలు ముప్పేట దాడి చేయడం ఆయనకు సానుభూతి తెచ్చి పెడుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. మెట్టు దిగి వచ్చినా చంద్రబాబును పట్టించుకోవడం లేదన్న భావన ప్రజల్లోకి వెళుతుంది.

పవన్ ను పక్కకు తీస్తే…..

దీంతో పాటుగా వచ్చే ఎన్నికల్లో పొత్తుతో వెళ్లాలని బీజేపీ, జనసేన నిర్ణయించుకున్నాయి. కానీ వైసీపీ ప్రభుత్వం వైపే బీజేపీ అనుకూలంగా ఉందని పదే పదే తెలియజెప్పగలిగితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో కటీఫ్ చెప్పే అవకాశముంది. దాంతో వచ్చే ఎన్నికల్లో పవన్ తో కలసి పోటీ చేయవచ్చన్నది కూడా చంద్రబాబు వ్యూహంగా మారనుంది. బీజేపీతో పొత్తుతో పవన్ కల్యాణ‌్ నోటిని కమలం పార్టీ మూసివేసింది. దానిని ఓపెన్ చేయగలిగితే ప్రధానంగా యువతలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందన్నది చంద్రబాబు అంచనాగా ఉంది. మొత్తం మీద మోదీ వెంటనే రియాక్ట్ అవుతారని, ఫోన్ ట్యాపింగ్ పై విచారణకు ఆదేశిస్తారని చంద్రబాబు లేఖ రాయలేదు. భవిష్యత్తు వ్యూహంతోనే ఆయన అడుగు ప్రతిదీ ఉంటుందన్నది లేఖ మరోసారి స్పష్టం చేసింది.

Tags:    

Similar News