రాజధాని ఎపిసోడ్ లో బాబు ఒంటరే ?

అమరావతి రాజధాని విషయంలో ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ ఒక వైపునకు చేరాయి. అది చంద్రబాబుకు వ్యతిరేకంగా అన్నమాట. దాంతో ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీకి దిక్కు తోచడంలేదుట. ఉరిమి [more]

Update: 2020-08-09 13:30 GMT

అమరావతి రాజధాని విషయంలో ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ ఒక వైపునకు చేరాయి. అది చంద్రబాబుకు వ్యతిరేకంగా అన్నమాట. దాంతో ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీకి దిక్కు తోచడంలేదుట. ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్లుగా తనను అంతా కార్నర్ చేయడం పట్ల బాబు రగిలిపోతున్నారు. ఈ మొత్తం పరిణామాలు మాత్రం జగన్ కి కలసివచ్చేలా ఉన్నాయి. మూడు రాజధానులు అని జగన్ ఏడెనిమిది నెలల క్రితం నిండు శాసనసభలో ప్రకటించినపుడు వారూ వీరూ తేడా లేకుండా అంతా ఒక్కటిగా బయటకు వచ్చారు. రైతులకు మద్దతుగా మాట్లాడారు, పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఊపేస్తామని కూడా శపధాలు చేశారు.

కట్ చేస్తే ….

ఇపుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీ శాఖను కట్టడి చేసింది. అందుకే చంద్రబాబు గొంతునే తన గొంతుగా చేసుకున్న కన్నా లక్ష్మీనారాయణను తప్పించేసింది. బాబు బద్ధ వ్యతిరేకి సోము వీర్రాజుని తెచ్చి ప్రెసిడెంట్ ని చేసింది. ఆయన తాపీగా మూడు రాజధానులు కాదు పదమూడు పెట్టుకోమనండి అంటూ అమరావతి విషయంలో కేంద్రానికి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చేశారు. ఇక బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు జనసేన కూడా ఆ లైన్లోనే మాట్లాడాల్సివచ్చింది. అందుకే పవన్ కూడా అమరావతి కధలో అసలు పాపం చంద్రబాబుదేనని చెప్పి పెద్దాయన్నే కార్నర్ చేశారు.

సీపీఎం అంతేనా…?

ఇక ఇపుడు మరో ఇంటెరెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే సీపీఎం కూడా తటస్థ వైఖరి ద్వారా అమరావతి రాజధాని విషయానికి దూరంగా జరుగుతోంది. దీని మీద సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తాజాగా మాట్లాడుతూ ఇపుడు కరోనా ఉంది. అందరూ దాని మీద ద్రుష్టి పెట్టాలి, అమరావతి వంటివి తరువాత అంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు జగన్ కి సన్నిహితుడు అన్న ప్రచారం కూడా వినిపిస్తోంది. అందుకే ఆయన దూకుడుగా సీపీఐ రామక్రిష్ణ మాదిరిగా జగన్ మీద రాజకీయ బాణాలు వేయరని కూడా అంటారు.

సానుకూలమేనా..?

మొత్తానికి చూస్తే మూడు రాజధానుల విషయంలో ఏపీలోని రాజకీయ వాతావ‌రణం జగన్ కి అనుకూలంగా ఉందని అంటున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా కూడా అమరావతి భూముల విషయంలో స్కాం జరిగిందన్నది అందరికీ తెలుసని అంటున్నారు. సీపీఐ విషయంలో చూస్తే చంద్రబాబుతో కలసి పొలిటికల్ గా నడవాలన్న ఉద్దేశ్యంతో మద్దతుగా ఉంటున్నారు. ఇక కాంగ్రెస్ కూడా జగన్ కి యాంటీ కాబట్టి మాట్లాడుతోంది. ఆ మాత్రం ఈ మాత్రం పలుకుబడి కలిగిన ఇతర పార్టీలేవీ మూడు రాజధానుల ముగ్గులోకి రాకుడని భావిస్తున్నాయట. మొత్తానికి కోర్టు తీర్పులు కనుక అనుకూలంగా వస్తే మాత్రం జగన్ని ఎవరూ అడ్డుకోలేరు అన్న మాట ఉంది.

Tags:    

Similar News