డెడ్ లైన్ తర్వాత చంద్రబాబు ఏం చెబుతారు?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డెడ్ లైన్ జగన్ కు విధించిన డెడ్ లైన్ మరో 24 గంటలు మాత్రమే ఉంది. రేపు సాయంత్రం 5గంటలలోపు జగన [more]

Update: 2020-08-04 06:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డెడ్ లైన్ జగన్ కు విధించిన డెడ్ లైన్ మరో 24 గంటలు మాత్రమే ఉంది. రేపు సాయంత్రం 5గంటలలోపు జగన నుంచి రాజీనామాలపై రెస్పాన్స్ రాకుంటే తాను ప్రెస్ మీట్ పెట్టి తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చంద్రబాబు చెప్పారు. అయితే ఇప్పటి వరకూ వైసీపీ నుంచి ఎలాంటి స్పందన లేదు. తాము రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని, సెంటిమెంట్ ఉందని భావిస్తే తెలుగుదేశం పార్టీ నేతలే రాజీనామా చేయాలని వైసీపీ నేతలు చెబుతున్నారు.

రేపు సాయంత్రం…

దీంతో చంద్రబాబు రేపు సాయంత్రం ఏం చెబుతారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మూడు రాజధానుల అంశంపై చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అమరావతిని మారుస్తూ తీసుకున్న నిర్ణయానికి ప్రజామద్దతు ఉందని భావిస్తే, గెలుపుపై నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేయాలని చంద్రబాబు సవాల్ విసిరారు. అమరావతిని చంపేశారంటున్న చంద్రబాబు జగన్ గతంలో అమరావతిలోనే రాజధాని ఉండాలని చెప్పిన విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నారు.

ఎందుకు ఎంపిక చేసింది?

చంద్రబాబు ఐదు కోట్ల మంది ప్రజలు అమరావతిని కోరుకుంటున్నారని చెబుతున్నారు. తాను అమరావతిని ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చింది చంద్రబాబు రేపటి సమావేశంలో చెప్పనున్నారు. అలాగే తన హయాంలో జిల్లాల వారీగా జరిగిన అభివృద్ధిని కూడా విశదీకరించనున్నారు. శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పిింది? కేంద్రం నుంచి అమరావతి డెవలెప్ మెంట్ కు ఎంత నిధులు వచ్చాయి? వాటిని వేటికి ఖర్చు పెట్టింది చంద్రబాబు రేపు వివరించనున్నారు. పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్ కు అమరావతి సరైన ప్లేస్ అని ఆయన చెబుతున్నారు. అంతేకాదు తమపై అమరావతిలో భూములు కొనుగోలు చేశామని వైసీపీ బురద జల్లిందని, ఏడాది గడుస్తున్నా నిరూపించిలేకపోయిన విషయాన్ని కూడా చంద్రబాబు రేపటి సమావేశంలో చెప్పనున్నారు.

రాజీనామాలు మాత్రం…..

జగన్ గతంలో అసెంబ్లీల మాట్లాడిన విషయాలను కూడా వీడియో క్లిప్పింగ్ ల ద్వారా ప్రదర్శించనున్నారు. అయితే రాజీనామాల విషయంపై చంద్రబాబు ఏదైనా నిర్ణయం తీసుకుంటారా? అన్న వార్తలు వస్తున్నాయి. దీనిపై చంద్రబాబు ఇప్పటికే సీనియర్ నేతలతో చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికలు అధికార పార్టీకి అడ్వాంటేజీగా ఉంటాయని, రాజీనామాలు వద్దని యనమల వంటి సీనియర్ నేతల సూచనలతో చంద్రబాబు రాజీనామాలపై వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. మొత్తం మీద రేపు చంద్రబాబు మీడియా సమావేశంలో ఏం మాట్లాడనున్నారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News