ఇందులో కూడా కాపీ పేస్ట్ …రిస్క్ అవుతుందేమో?

ఇప్పుడు రాజకీయ పార్టీలు సక్సెస్ ఫార్ములానే ఫాలో అవుతున్నాయి. దేశంలో బిజెపి జోరు గత ఎన్నికల్లో అందరికి తెలిసిందే. ఈ విజయం ఇక్కడితో ఆగకూడదని లెక్కేసి నియోజకవర్గ [more]

Update: 2020-08-05 03:30 GMT

ఇప్పుడు రాజకీయ పార్టీలు సక్సెస్ ఫార్ములానే ఫాలో అవుతున్నాయి. దేశంలో బిజెపి జోరు గత ఎన్నికల్లో అందరికి తెలిసిందే. ఈ విజయం ఇక్కడితో ఆగకూడదని లెక్కేసి నియోజకవర్గ స్థాయి కమిటీల స్థానంలో పార్లమెంట్ నియోజకవర్గాల ను పరిగణలోకి తీసుకుని పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తూ వచ్చింది. బిజెపి ఫార్ములా ముందే గ్రహించిన వైసిపి సైతం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో పార్టీ శ్రేణులను విభజించింది. అయితే నాడు టిడిపి మాత్రం ఈ ఫార్ములా ఫాలో కాలేదు. కానీ ఇప్పుడు ఇదే ట్రెండ్ బెటరని పసుపుదళం కూడా అనుసరించేందుకు కసరత్తు మొదలు పెట్టినట్లు ఆ పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.

తన మార్క్ లేకుండా …

తెలుగు రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఒక ట్రెండ్ సెట్టర్ అని నిష్కర్షగా చెప్పొచ్చు. అది ఎన్టీఆర్ హయాంలో నడిచింది. ఎన్టీఆర్ ఏం చేస్తే అదే జాతీయ స్థాయిలో మెజారిటీ ప్రాంతీయ పార్టీలు ఫాలో అయ్యేవి. సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విధానం కానీ పార్టీ ని గ్రామస్థాయిలో నిర్మాణం చేసిన తీరు అంతా టిడిపి ఒక రోల్ మోడల్. ఇదంతా గత చరిత్రగా చంద్రబాబు వచ్చాక మారిపోయింది. తనదైన మార్క్ బాబు పార్టీలో వేయడం లేదు సరికదా సక్సెస్ ఎక్కడ ఉంటే అక్కడ ఫార్ములా కాపీ పేస్ట్ చేసేందుకు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పరుగులు పెట్టడం తరచూ చర్చనీయం అవుతుంది.

హోదా అంశంలో అంతే …

ప్రత్యేక హోదా అంశాన్ని గత ఎన్నికల ముందు వైసిపి అందుకుంటే అధికారంలో ఉన్న బాబు ముందు ప్యాకేజీ కి జై కొట్టి తరువాత విపక్షానికి మైలేజ్ వస్తుందన్న కారణంతో యు టర్న్ కొట్టి మోడీ నాయకత్వంలోని బిజెపి పై విరుచుకుపడ్డారు. అయితే ఆయన తీసుకున్న ఆ స్టెప్ టిడిపి ని అధఃపాతాళానికి పడేసింది. ఇలా చాలా సార్లు సొంత వ్యూహాలు లేకుండా చంద్రబాబు తప్పటడుగులు దెబ్బ మీద దెబ్బె కొట్టాయి. వాస్తవానికి ఎన్టీఆర్ ఎంతో దీర్ఘ దృష్టితో ఏర్పాటు చేసిన పార్టీ నిర్మాణం పార్లమెంట్ స్థాయికి మారితే టిడిపి కి మరింత గడ్డు పరిస్థితులు ఎదురు కావొచ్చన్నది కొందరిలో ఆందోళన మొదలైంది.

రిస్క్ లు ఎందుకని భావిస్తున్న తమ్ముళ్ళు ….

గ్రామ, మండల, పట్టణ, నియోజకవర్గ స్థాయిలో టిడిపి పార్టీ నిర్మాణం అభేద్యం. బూత్ స్థాయిలో కూడా ఏ పార్టీకి లేని కమిట్మెంట్ ఉన్న క్యాడర్ టిడిపి సొంతం. అలాంటి నిర్మాణానికి తూట్లు పొడిచేలా పార్లమెంట్ స్థాయిలో కమిటీలు అంటే క్యాడర్ కి నేతలకు నడుమ దూరం మరింత పెరుగుతుందని విపక్షంలో ఉన్న సమయంలో ఇలాంటి రిస్క్ లు వద్దంటున్నారు కొందరు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పార్లమెంటరీ స్థాయి పైలెట్ ప్రాజెక్ట్ మొదలు పెడతారనుకుంటున్న ఈ ప్రయోగం సైకిల్ పార్టీకి మేలు చేస్తుందో కీడు చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News