బాబు ఇక్కడా ఓడిపోయినట్లేనా?

చంద్రబాబుని ఎవరైనా మించగలరా? అసలు దేనిలోనైనా కూడా చంద్రబాబు తనను తాను తక్కువ చేసుకుంటారా? ఆయన అనుభవం వర్తమాన రాజకీయాల్లో నిజంగా ఘమైనదే. చంద్రబాబు తన తరువాత [more]

Update: 2020-02-22 05:00 GMT

చంద్రబాబుని ఎవరైనా మించగలరా? అసలు దేనిలోనైనా కూడా చంద్రబాబు తనను తాను తక్కువ చేసుకుంటారా? ఆయన అనుభవం వర్తమాన రాజకీయాల్లో నిజంగా ఘమైనదే. చంద్రబాబు తన తరువాత తరంతో ఇపుడు పాలిటిక్స్ చేస్తున్నారు. నిజంగా ఓ విధంగా ఇది గొప్పగా చెప్పుకోవచ్చు. మరో విధంగా బాధగానూ చెప్పవచ్చు. ఆ విధంగా చంద్రబాబు కొడుకు సమానుడు అయిన జగన్ తో చంద్రబాబు పోరాడి మరీ ఓడారు. సరే జగన్ ఎటూ ప్రత్యర్ధి కదా అని సరిపుచ్చుకోవచ్చు. కానీ సొంత ఇంట్లో కొడుకు లోకేష్ ముందు, భార్య భువనేశ్వరి ముందు, ఆఖరుకు మనవడు దేవాన్ష్ ముందు కూడా చంద్రబాబు ఓడడం అంటే నిజంగా ఆయనకు గర్వకారణమేమో కానీ చూసే జనాలకు మాత్రం భలే కామెడీగానే ఉంది.

ఆరేళ్ళకే అలా….

చంద్రబాబు మనవడు దేవాన్ష్ ఆరేళ్ళ వాడు. అతని ఆస్తి అచ్చంగా 19.42 కోట్ల రూపాయలు, మరి తాత, ఏపీకి మూడు సార్లు ముఖ్యమంత్రి, దాదాపుగా నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితం, దేశంలోకెల్లా పెద్ద నాయకుడు, జాతీయ స్థాయి నేత అయిన చంద్రబాబు ఆస్తి మాత్రం నికరంగా 9 కోట్లు మాత్రమే. బాబు ఎన్నో కష్టాలు పడ్డారు. వ్యాపారాలు చేశారు. అయినా ఆయన చేతికి వాచి, ఉంగరం ఉండదు, ఆయన ఆస్తి మాత్రం మూరెడే ఉంటుంది. ఏ వ్యాపకం లేదు, అసలు ఇంకా ముక్కుపచ్చలారని బాలుడు దేవాన్ష్ కి మాత్రం దాదాపు ఇరవై కోట్ల ఆస్తి. ఇలా మనవడి ముందు ప్రతీ ఏటా చంద్రబాబు ఓడిపోతూనే ఉన్నారు.

ఆ ఇంట్లో పేదగా…

నిజానికి చంద్రబాబు నారా వారి కుటుంబంలో అందరి కంటే కడు పేదగా చెప్పాలి. ఆయన కొడుకు లోకేష్ ఆస్తి 8. 14 కోట్లు. అంటే కొడుకు చేతిలో కూడా ఓటమే. ఇక భార్య భువనేశ్వరిని తీసుకుంటే ఆమె ఆస్తి 50.62 కోట్లు, ఇంకా మూడు కోట్ల విలువ చేసే ఆస్తులు తగ్గాయట. లేకపోతే ఆమె ఇంకా రీచ్ అయ్యేదే అన్నమాట. కోడలు బ్రాహ్మణిని తీసుకుంటే ఆమె ఆస్తి అచ్చంగా 24.70 కోట్లు. అంటే ఆమె కూడా మామగారి కంటే ఆరు రెట్లు ఎక్కువ స్తోమత కలిగిన సంపాదనాపరురాలు. ఇక్కడో చిత్రమేంటంటే లోకేష్ అస్తిలో కూడా 2.40 కోట్లు తగ్గాయట. లేకపోతే చంద్రబాబు కంటే మరింత ముందుకు ఆయన వెళ్ళేవారే. ఏ విధంగా చూసుకున్నా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన ఇంట్లో కడు పేద అన్న మాటేగా.

కామెడీగా….

ఎవరు అడిగారని ఈ కాకి లెక్కలు అంటున్నారు వైసీపీ నేతలు. ఓ వైపు చంద్రబాబు కంటే దేశంలోనే అత్యంత ధనవంతుడు ఎవరూ లేరని తెహల్కా డాట్ కం ఏనాడో రాసిందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక చంద్రబాబు వద్ద మాజీ పీఎస్ గా పనిచేసిన శ్రీవివాస్ ఇంట్లో సోదా చేస్తేనే రెండు వేల కోట్ల విలువైన డాక్యుమెంట్లు పట్టుబడ్డాయని అంటున్నారు. అలాంటిది చంద్రబాబు కేవలం మూడు కోట్ల అధిపతి అంటే తమ్ముళ్ళకు కూడా సిగ్గుగా బాధంగా ఉందని అంటున్నారు. దీని మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేస్తున్నారు. ఈ లెక్కలు అన్నీ భద్రంగా దాచుకోండి. అసలు బండారం తొందరలోనే బయటపడుతుందని. వైసీపీ నేతలు చెప్పినట్లుగా కొండంత ఆస్తులు లేకపోవచ్చు కానీ మరీ కామెడీగా ఇంత చీప్ గా చంద్రబాబు గారి సంపాదన ఉండడమేంటన్నది తమ్ముళ్ళకే అంతుపట్టకపోతే జనం ఎలా నమ్ముతారని. అయినా సరే ఏది ఏమైనా ప్రతీ ఏటా తూచా తప్పకుండా ఆస్తుల ప్రకటన పేరిట నారా ఫ్యామిలీ కావల్సినంత కామెడీ పండిస్తోందని సెటైర్లు పడుతున్నాయి.

Tags:    

Similar News