బాబుకు డోర్స్ పూర్తిగా క్లోజ్ అయినట్లేనా?

తెలుగుదేశం పార్టీ అధినేత కు నిన్నమొన్నటి వరకూ ఉన్న చిన్న ఆశలు అడుగంటినట్లే. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే పలు ప్రణాళికలు రచించుకుంటున్న చంద్రబాబుకు బీజేపీ షాక్ [more]

Update: 2020-07-29 06:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత కు నిన్నమొన్నటి వరకూ ఉన్న చిన్న ఆశలు అడుగంటినట్లే. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే పలు ప్రణాళికలు రచించుకుంటున్న చంద్రబాబుకు బీజేపీ షాక్ ఇచ్చింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ను పార్టీ అధినాయకత్వం నియమించడంతో చంద్రబాబుకు ఉన్న కొద్దిపాటి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఎన్నికల్లో ఓటమి పాలయిన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ చెంతకు చేరిపోయేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

బీజేపీతో సఖ్యతగా ఉండేందుకు…..

ఇందులో భాగంగానే తన పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపారన్న ప్రచారం ఉంది. వారి ద్వారానే కేంద్ర నాయకత్వంలో తన పట్ల సానుకూలత తీసుకురావాలన్న చంద్రబాబు అంచనా తలకిందులయింది. నిజానికి కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో బీజేపీ, జనసేనల మధ్య పొత్తు కుదిరింది. అప్పుడే వచ్చే ఎన్నికల్లో మళ్లీ 2014 కాంబినేషన్ లో ఎన్నికలకు వెళ్లడమే బెటరని చంద్రబాబు నిర‌్ణయించుకున్నారు.

మరోసారి ఆ కాంబోలో…..

చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసి నెగ్గుకు రాలేరన్నది గత ఎన్నికల ఫలితాలే తేల్చి చెప్పాయి. దీంతో జనసేన, బీజేపీలతో కలసి వెళితే మళ్లీ అధికారంలోకి రాగలనని, జగన్ కు చెక్ పెట్ట వచ్చని చంద్రబాబు భావించారు. అయితే సోము వీర్రాజు తొలి నుంచి చంద్రబాబు వ్యతిరేకిగా ముద్రపడిన నేత. బీజేపీని రాష్ట్రంలో ఎదగనివ్వకుండా చంద్రబాబు చేశారని సోము వీర్రాజు అనేకసార్లు బాహాటంగానే విమర్శించారు. రెండు పార్టీలు కలసి ఉన్నప్పుడు కూడా సోము చంద్రబాబును వదలకుండా వెంటపడ్డారు.ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఈ కాంబినేషన్ కు వీర్రాజు నియామకంతో గండిపడినట్లేనన్నది పార్టీ వర్గాల అంచనా.

వీర్రాజు నియామకంతో…

మరోవైపు జనసేనాని కూడా టీడీపీకి దూరం చేయగల శక్తి, సత్తా సోము వీర్రాజుకు ఉందంటున్నారు. 2014 ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ ను నేరుగా మోదీ దగ్గరకు తీసుకెళ్లిందీ సోము వీర్రాజు. దీంతో ఇకపై బీజేపీ, జనసేన మాత్రమే కలసి ముందుకు వెళతాయన్న సంకేతాలను బీజేపీ అధిష్టానం కూడా స్పష్టంగా చెప్పినట్లయింది. దీంతో చంద్రబాబు డీలా పడ్డారు. కన్నా నిష్క్రమణ, సోము వీర్రాజు ఎంట్రీతో బీజేపీ డోర్స్ చంద్రబాబుకు క్లోజ్ అయినట్లేనన్నది విశ్లేషకుల అంచనా. చంద్రబాబు మరోసారి కామ్రేడ్లతోనే కాలక్షేపం చేయక తప్పదు మరి.

Tags:    

Similar News