చంద్రబాబుకు అదే కలసి వచ్చేటట్లుందిగా

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు ఇంతటి క్రైసిస్ చూడలేదు. ఒకవైపు జగన్ టార్చర్…మరోవైపు కరోనా భయంతో చంద్రబాబు పార్టీని [more]

Update: 2020-07-26 08:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు ఇంతటి క్రైసిస్ చూడలేదు. ఒకవైపు జగన్ టార్చర్…మరోవైపు కరోనా భయంతో చంద్రబాబు పార్టీని పూర్తి స్థాయిలో గాడిన పెట్టలేకపోతున్నారు. ఓటమి తర్వాత ఆయన కొన్ని జిల్లాలను పర్యటించి క్యాడర్ లో ఉత్తేజం నింపాలని ప్రయత్నించినా పెద్దగా సఫలం కాలేదు. ఈలోగా కరోనా వైరస్ రావడంతో ఆయన జల్లాల పర్యటనలను కూడా వాయిదా వేసుకున్నారు.

దూరంగా నేతలు ఉండటంతో….

అధికారంలో ఉన్నప్పుడు ఉన్న నేతలు ఇప్పుడు కుంటిసాకులు చెబుతూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజా సమస్యలపై చంద్రబాబు వివిధ ఆందోళనలకు పిలుపునిచ్చినా పెద్దగా నేతలు పట్టించుకోలేదు. దీంతో చంద్రబాబు పార్టీని ఎలా గాడిన పడేయాలన్న ఆందోళన ఉన్న సమయంలోనే వరసగా కీలక నేతలు వివిధ కేసుల్లో అరెస్డ్ అవడం మరింత ఆవేదన కల్గించింది.

అరెస్ట్ లు సానుకూలంగా…..

అయితే ఒక రకంగా టీడీపీ నేతల వరస అరెస్ట్ లు పార్టీకి అనుకూలంగా మారుతున్నాయంటున్నారు. చంద్రబాబు ఇటీవల క్షేత్రస్థాయిలో కొందరు కార్యకర్తలతో మాట్లాడారు. నేతల అరెస్ట్ ల పట్ల ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకూ 800 మంది పార్టీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. 33 మంది మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలపై వివిధ కేసులు నమోదయ్యాయి. దీంతో వీరంతా ఆ నియోజకవర్గాల్లో ఇటీవల యాక్టివ్ అయ్యారని తేలడంతో చంద్రబాబు ఊపిరి పీల్చుకున్నారు.

ఎలా సెట్ చేయాలా? అని….

ఎన్నికల ఫలితాల తర్వాత కొందరు వ్యాపారాలపై దృష్టి పెట్టి నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదు. మరికొందరు కేసుల భయంతో బయటకు రావడం లేదు. దీంతో వీరిని ఎలా సెట్ చేయాలా? అని చంద్రబాబు మదనపడుతున్న సమయంలోనే అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, జేసీ ప్రభాకర్ రెడ్డి వంటి నేతల అరెస్ట్ లు వారిలో కసి పెంచిందంటున్నారు. ఇప్పుడు ముప్ఫయి నుంచి నలభై నియోజకవర్గాల్లో మినహా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు యాక్టివ్ అయ్యారని చంద్రబాబుకు కేంద్ర పార్టీ నివేదిక ఇచ్చింది. మొత్తం మీద వైసీపీ పెడుతున్న కేసులే వారిని ఏకం చేశాయి. యాక్టివ్ ను చేశాయి. మొత్తం మీద మొన్నటి వరకూ క్యాడర్, లీడర్ల విషయంలో కంగారు పడుతున్న చంద్రబాబుకు తీపి కబురు అందినట్లే.

Tags:    

Similar News