కాలమే డిసైడ్ చేస్తుందట.. నిర్వేదంలో…?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లభించడం లేదు. బీజేపీ మద్దతు దొరుకుతుందన్న ఆశ కూడా [more]

Update: 2020-07-16 06:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లభించడం లేదు. బీజేపీ మద్దతు దొరుకుతుందన్న ఆశ కూడా లేదు. మరోవైపు జగన్ దూకుడుతో వెళుతున్నారు. పూర్తిగా సంక్షేమ కార్యక్రమాలపై పెట్టి వరసగా పథకాలను లాంచ్ చేసుకుంటూ వెళుతున్నారు. దీంతో చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. మరోవైపు పార్టీ పరిస్థితి కూడా అనుకున్నట్లు పుంజుకోవడం లేదు.

ఆర్థిక ఇబ్బందులు…..

ఏడాది నుంచి చంద్రబాబు పార్టీ పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీడీపీ నేతలపై కేసులు పెడుతూ భయానక వాతావరణం సృష్టిస్తూనే మరోవైపు టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారు. ఇది ప్రధానంగా చంద్రబాబును ఆందోళన కల్గిస్తున్న విషయం. ఇప్పటికే జేసీ దివాకర్ రెడ్డి, నారాయణ, గల్లా జయదేవ్ వంటి నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీశారు. శిద్ధారాఘవరావు, గొట్టి పాటి రవికుమార్ లాంటి నేతలకు వందల కోట్ల జరిమానా విధించి భయకంపితులను చేసింది.

వ్యాపారాలపై దాడులు….

తెలుగుదేశం పార్టీలో ఎక్కువ మంది నేతలు వ్యాపారాలే ప్రధాన వ్యాపకంగా ఉన్నారు. రాజకీయంగా వారు మంచి పొజిషన్ లో ఉంటూనే వ్యాపారాలనే ఎక్కువగా చూసుకునే వారు అనేక మంద ఉన్నారు. హైదరాబాద్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అనేక మందికి వ్యాపారాలున్నాయి. ఏపీలో కూడా స్థానికంగా గనులు, గ్రానైట్ వంటి వ్యాపారాలు అధికంగా ఉన్నాయి. దీంతో టీడీపీ నేతల వ్యాపారాలపై దృష్టి పెట్టిన వైసీపీ వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తుంది.

భరోసా ఇవ్వలేక….

చంద్రబాబు వారికి అండగా ఉండలేని పరిస్థితి. వారిని ఆదుకుంటానని భరోసా ఇవ్వలేని పరిస్థితి. న్యాయపోరాటం చేసినా అది ఎంతవరకూ ఫలిస్తుందో తెలియదు. దీంతో అనేక మంది నేతలు పార్టీలో కామ్ గా ఉండిపోతున్నారు. దీంతో చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని సంక్షోభాన్ని పార్టీలో చూస్తున్నారు. మరోవైపు కరోనా కారణంగా జల్లా పర్యటనలు చేయలేక పార్టీలో జోష్ నింపలేకపోతున్నారు. మొత్తం మీద చంద్రబాబుకు అన్ని రకాల దారులు మూసుకుని పోయాయి. కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం ఇస్తుందన్న నమ్మకంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నట్లు కన్పిస్తుంది.

Tags:    

Similar News