ఇలాగయితే శాశ్వతంగా ఇంట్లోనే?

పార్టీ నేతలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఇలాగే వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ అధికారం కోల్పోయి ఏడాది గడుస్తున్న నేతల వైఖరిలో మార్పు రాలేదని [more]

Update: 2020-07-05 13:30 GMT

పార్టీ నేతలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఇలాగే వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ అధికారం కోల్పోయి ఏడాది గడుస్తున్న నేతల వైఖరిలో మార్పు రాలేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు నేతలు నియోజకవర్గాల్లోనూ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని మండిపడ్డారు. కనీసం ప్రభుత్వంపై పోరాటం చేయడానికి కూడా కొందరు నేతలు వెనకాడటంపై చంద్రబాబు మండి పడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు యాక్టివ్ గా ఉండటం కాదని, లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉండాలని చంద్రబాబు సూచించారు.

నివేదికలను తెప్పించుకుని…..

ఏడాదిలో నియోజకవర్గాల వారీగా నేతల పెరఫార్మెన్స్ నివేదికను చంద్రబాబు తెప్పించుకున్నారు. దాదాపు వందకు పైగా నియోజకవర్గాల్లో నేతలు పార్టీ కార్యక్రమాలను కూడా చేపట్టని విషయం చంద్రబాబు దృష్టికి వచ్చింది. దీంతో ఆయన నియోజకవర్గాల నేతలపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇష్టం లేకుంటే చెప్పాలని, వేరే వాళ్లను పార్టీ ఇన్ ఛార్జిగా నియమించుకుంటామని చెప్పడంతో చంద్రబాబు ఈ విషయాన్ని ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్థమువుతుంది.

కనీసం రిప్లై కూడా లేకపోవడంతో…..

నియోజకవర్గాల వారీగా సమస్యలను నేతలు లేవనెత్తాలని చంద్రబాబు సూచించారు. నేతల్లో సీరియస్ నెస్ లేకుంటే భవిష్యత్ ఉండదని కూడా చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే చంద్రబాబు గత ఎన్నికల్లో ఎంత తేడాతో ఓడిపోయిందీ? ఈ ఏడాది కాలంలో ఏం చేసిందీ నివేదిక పంపమని అన్ని నియోజకవర్గాల నేతలను కోరినా కొందరు స్పందించక పోవడంపై కూడా సీరియస్ అయ్యారని తెలుస్తోంది. ఇలాగే చేస్తే శాశ్వతంగా ఇంటికే పరిమితమవ్వాల్సి వస్తుందని కూడా చంద్రబాబు హెచ్చరించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పట్టాభిని చూసి నేర్చుకోండి…..

వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్ లన్నీ స్కామ్ లేనని వాటిని బయటపెట్టాల్సిన బాధ్యత నేతలపై ఉందని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేత పట్టాభి 108, సరస్వతి భూముల విషయంలో బయటపెట్టిన అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. పట్టాభిని చూసి నేర్చుకోవాలన్నారు. అలాగే పోలవరం, పట్టిసీమ లో అవినీతి జరగలేదని కేంద్ర ప్రభుత్వమే తేల్చిందని, దీనిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు కోరారు. ప్రజల్లో ఉంటేనే విశ్వసనీయత పెరుగుతుందన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా స్థాయి నేతలతో చంద్రబాబు మాట్లాడి అక్కడ పార్టీ పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారు. మొత్తం మీద చంద్రబాబు ఇన్నాళ్లూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వారిని క్షమించేది లేదన్న హెచ్చరికను నేతలకు పంపారనే చెప్పాలి.

Tags:    

Similar News