కొట్టుకోవడం ఆపరా? కలసి పోలేరా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎంత ప్రయత్నించినా పార్టీలో గ్రూపు విభేదాలు సమసి పోవడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు అంటే ఓకే. పవర్ కోసం గ్రూపులుగా విడిపోతారు. [more]

Update: 2020-06-29 00:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎంత ప్రయత్నించినా పార్టీలో గ్రూపు విభేదాలు సమసి పోవడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు అంటే ఓకే. పవర్ కోసం గ్రూపులుగా విడిపోతారు. కానీ ఓటమి పాలయిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ నేతలు గ్రూపులుగా విడిపోయి ఉండటం పార్టీ అధినేత చంద్రబాబుకు ఆందోళన కల్గించే విషయమే. ఎందుకంటే మరో నాలుగేళ్ల పాటు సమిష్టిగా పనిచేయాల్సిన సమయమిది. కానీ అనేక జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు.

అన్ని నియోజకవర్గాల్లో…..

ప్రధానంగా గతంలో టిక్కెట్ దక్కిన వారు, దక్కని వారు ఇప్పుడు ఒక్కటయ్యేందుకు ఇష్టపడటం లేదు. పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ముందుకు రావడం లేదు. ప్రకాశం జిల్లాలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న దామచర్ల జనార్థన్ మాటను ఎవరూ లెక్క చేయడం లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన నేతలు నియోజకవర్గాల్లో ఉండకపోవడంతో అక్కడ పార్టీ కార్యక్రమాలను ఎవరు నిర్వహిస్తారన్న చర్చ జరుగుతోంది.

అఖిలప్రియ వర్సెస్.. ఏవీ….

ిఇక ఆళ్లగడ్డ నియోజకవర్గం విషయానికి వస్తే అక్కడ మాజీ మంత్రి అఖిలప్రియ, భూమా నాగిరెడ్డి స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డిల మధ్య పొసగడం లేదు. అఖిలప్రియ తనను హత్య చేయడానికి కుట్ర చేశారని ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం చాలారోజుల పాటు జరిగింది. అయితే ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చాలని తెలుగుదేశం పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆళ్లగడ్డలో క్యాడర్ ఆందోళన చెందుతోంది. ఇద్దరూ పంతం వీడకపోవడంతో అధిష్టానం కూడా వదిలేసినట్లే కనపడుతోంది.

అనంతపురంలోనూ…..

ఇక అదే జిల్లాలో ఉన్న కేఈ, కోట్ల కుటుంబాల మధ్య కూడా సఖ్యత లేదు. ఎన్నికల తర్వాత క్యాడర్ కూడా రెండుగా విడిపోయి మళ్లీ మొదటికొచ్చింది. ఇక అనంతపురం జిల్లాలో అయితే సరేసరి. అక్కడ దాదాపు అన్ని నియోజకవర్గాల్లో గ్రూపులు ఉన్నాయి. హనుమంతరాయచౌదరికి, కల్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ నేతలకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇలా ప్రతి చోటా గ్రూపులు కట్టి ఉండటంతో పార్టీ నేతలకు సయోధ్య కుదర్చడంపై చంద్రబాబు దృష్టి పెట్టారు. మరి ఏమేరకు సఫలం అవుతుందో చూడాలి మరి.

Tags:    

Similar News