చంద్రబాబును వాళ్లమాదిరిగానే చేసేస్తారా? ఏంది?

రాజ‌కీయాల్లో ప‌రిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ఎప్పటిక‌ప్పుడు మారుతూనే ఉంటుంది. కానీ, ఢిల్లీ లోని న‌రేంద్ర మోడీ, అమిత్‌షాల ద్వయం మాత్రం తాము ఒక్కసారి ఒక నిర్ణయానికి [more]

Update: 2020-06-27 09:30 GMT

రాజ‌కీయాల్లో ప‌రిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ఎప్పటిక‌ప్పుడు మారుతూనే ఉంటుంది. కానీ, ఢిల్లీ లోని న‌రేంద్ర మోడీ, అమిత్‌షాల ద్వయం మాత్రం తాము ఒక్కసారి ఒక నిర్ణయానికి వ‌స్తే.. ఆ నిర్ణయం నుంచి ఇప్పటి వ‌ర‌కు బ‌య‌ట ప‌డిన సంద‌ర్భాలు మ‌న‌కు క‌నిపించ‌డం లేదు. ఉదాహ‌ర‌ణ‌కు బిహార్ మా జీ సీఎం లాలూ ప్రసాద్ యాద‌వ్, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ వంటివారి విష‌యమే కాకుండా.. మ‌హారాష్ట్ర మాజీ సీఎం ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ విష‌యంలోనూ ఈ ఇద్దరూ ఒకే తీరుగా వ్యవ‌హ‌రించారు. త‌మ‌తో క‌లిసి న‌డ‌వాల‌ని అభ్యర్థించారు. కొన్నాళ్లు కొంద‌రు క‌లిసి న‌డిచారు. కాద‌ని ఒక్కసారి దూర‌మైన వారిని ఇక ఎప్పటికీ.. మోడీ, షా ద్వ‌యం చెంత‌కు చేర్చుకోలేదు.

తొలినాళ్లలో దగ్గరకు తీసినా…..

అదే ప‌రిస్థితి ఏపీలో ఇప్పుడు చంద్రబాబుకు కూడా ఎదురైంది. 2014 ఎన్నిక‌ల్లో చంద్రబాబును మోడీ ఎంతో అత్యున్నతంగా గౌర‌వించారు. త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా ఆయ‌న‌పై అమిత మైన ప్రేమ‌ను కురిపించారు. అయితే, త‌ర్వాత కాలంలో ప్రత్యేక హోదా కాద‌ని ప్యాకేజీ ప్రక‌టించారు. దీనికి చంద్రబాబు ముందు స్వాగ‌తం ప‌లికారు. అయితే, ఆయ‌న స్థానిక రాజ‌కీయాల నేప‌థ్యంలో ప్రత్యేక హోదాకే మొగ్గు చూపించారు. హోదా కోసం ప‌ట్టుబ‌ట్టారు. ఇది కేంద్రంలోని బీజేపీకి, చంద్రబాబుకు మ‌ధ్య దూరం పెంచింది. ఈ దూరం దూరం ఎన్నిక‌ల స‌మ‌యంలో మ‌రింత పెరిగింది.

ఎన్నికల సమయంలో రంకెలు వేసి…..

అయితే, ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ బీజేపీ నుంచి చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఇప్పుడు వ‌చ్చి చేరితే.. ఓకే లేదంటే.. ఇక ఎప్పటికీ.. చంద్రబాబుకు త‌లుపులు మూసేస్తాం! అని అమిత్ షా ఢిల్లీ వేదిక‌గా హెచ్చరించారు. అయినా కూడా.. చంద్రబాబు బీజేపీతో క‌ల‌వ‌క‌పోగా.. మోడీని ఓడిస్తానంటూ వ్యాఖ్యలు చేశారు. అనంత‌రం గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో బాబు ఓడిపోయారు. కానీ, మోడీ గెలిచి అధికారంలోకివ‌చ్చారు. త‌ర్వాత త‌న త‌ప్పు తెలుసుకుని లెంప‌లు వేసుకున్నా.. చంద్రబాబును మోడీ ప‌ట్టించుకోవ‌డం లేదు.

మరింత దూరం పెడుతూ…

తాజాగా దేశంలోని అన్ని విప‌క్షాల‌తోనూ, అధికార ప‌క్షాల‌తోనూ మోడీ దేశ భ‌ద్రత‌పై స‌మీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ‌ద్ధ శ‌త్రువైన మాయావ‌తికి క‌మ్యూనిస్టులకు కూడా మోడీ ఆహ్వానం అందించారు. కానీ, ఏపీలో తాను ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకొనే చంద్రబాబును మోడీ ప‌క్కన పెట్టారు. ఆయ‌న‌ను అస‌లు ప‌రిగ‌ణ‌న‌లోకే తీసుకోలేదు. చంద్రబాబు స‌ల‌హాను మోడీ కానీ, షా కానీ కోరుకోలేదు. దీనిని బ‌ట్టి.. ఢిల్లీ పెద్దలు బాబును వ‌దిలేశారు. కానీ, ఈయ‌నే అయిందానికి కానిదానికీ వారిని ప‌ట్టుకుని వేలాడుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News