బాబు డిఫెన్స్ లో పడినట్లే… తాజా ప‌రిణామాల ఎఫెక్ట్‌

టీడీపీ అధినేత‌, ఫార్టీ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ దిగ్గజం అని చెప్పుకొనే మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఆత్మర‌క్షణ‌లో ప‌డ్డారా ? పార్టీ ప‌రువును కాపాడుకునేందుకు ఆయ‌న ప్రయాస ప‌డుతున్నారా? [more]

Update: 2020-06-23 03:30 GMT

టీడీపీ అధినేత‌, ఫార్టీ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ దిగ్గజం అని చెప్పుకొనే మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఆత్మర‌క్షణ‌లో ప‌డ్డారా ? పార్టీ ప‌రువును కాపాడుకునేందుకు ఆయ‌న ప్రయాస ప‌డుతున్నారా? అంటే.. తాజా ప‌రిణామాలు, ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తున్న వారు ఔన‌నే అంటున్నారు. శాస‌న మండ‌లిలో టీడీపీ నేత‌ల వ్య ‌వ‌హారంపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ‌ర్గాల నుంచి ఘాటైన వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. నిజానికి అక్కడ ఏం జ‌రిగిందో.. బ‌య‌ట‌కు ప్రత్యక్షంగా తెలియ‌క‌పోయినా (అంటే.. మండ‌లిలో రికార్డులు ఇంకా బ‌య‌ట పెట్టక పోయినా) ప్రజ‌లు మాత్రం ప్రతిప‌క్షానిదే త‌ప్పు అనే వ్యాఖ్యలే చేస్తున్నారు.

సుధాకర్ విషయంలోనూ…..

ప్రధానంగా దీనికి కార‌ణం. ఈ ఏడాది కాలంలో చంద్రబాబు ఆయ‌న టీం వ్యవ‌హ‌రించిన తీరే. ఏ విష‌యాన్ని రాజ‌కీయం చేయాలి.. ? ఏ విష‌యాన్ని దూరంగా పెట్టాలి ? అనే విష‌యంలో చంద్రబాబు ఇప్పటికీ ప్ర చారాన్నే న‌మ్ముకుని ముందుకు సాగుతున్నారు. న‌ర్సీప‌ట్నం డాక్టర్ సుధాక‌ర్ విష‌యం టీడీపీకి సంబంధం లేదు. ఒక డాక్టర్‌కు -ప్రభుత్వానికి చెందిన విష‌యం. కానీ, ఈ విష‌యంలో చంద్రబాబు వేలు పెట్టారు. ఇలా త‌న‌కు సంబంధం లేని విష‌యాల‌ను రాజ‌కీయం చేసేందుకు ప్రయ‌త్నించి.. ప్రజ‌ల్లో విశ్వస‌నీయత‌ను పోగొట్టుకున్నారు.

లోకేష్ విషయంలోనూ….

ఫ‌లితంగా ఇప్పుడు మండ‌లిలో టీడీపీ త‌ప్పు చేయ‌లేదు.. మా అబ్బాయి లోకేష్ త‌ప్పు చేయ‌లేదు (నిజానికి ఈ మాట బాబు నోటి నుంచి ఇప్పటి వ‌ర‌కు రాలేదు) అన్నా ప్రజ‌లు న‌మ్మ‌డం లేదు. చంద్రబాబు త‌న‌యుడు లోకేష్‌గ‌త స‌మావేశాల్లోనూ త‌న సెల్‌ఫోన్‌లో మండ‌లి దృశ్యాల‌ను చిత్రీక‌రించారు. ఇప్పుడు కూడా ఆయ‌న అదే ప‌నిచేశారని అధికార పార్టీ నేత‌లు అంటున్నారు. ఈ ప‌రిణామాలు టీడీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నేరుగా మంత్రిని టీడీపీ ఎమ్మెల్సీ బీద ర‌విచంద్ర కాలితో త‌న్నడం… నిజ మేన‌ని ఇరు పార్టీలూ చెబుతున్నాయి.

పక్క దోవ పట్టించేందుకే….

ఈ ప‌రిణామాల‌ను ప్రజ‌లు జీర్ణించుకోలేక పోతున్నార‌నే విష‌యం చంద్రబాబుకు తెలుసు. అందుకే ఆయ‌న ఆయా విష‌యాలను ప‌క్కదారి ప‌ట్టించేందుకు వెంట‌నే ఆయ‌న గ‌వ‌ర్నర్‌ను క‌లిశారు. రాత్రి ప‌ది గంట‌ల స‌మ‌యంలో మీడియా ముందుకు వ‌చ్చి రెండు గంట‌ల‌పాటు త‌న మ‌న‌సులో బాధ‌ను వ్యక్తీక‌రించారు. అయిన‌ప్ప‌టికీ.. చేసిన పాపం చెబితే పోయే రోజులు కాబ‌ట్టి.. ప్రజ‌ల్లో చంద్రబాబుపై మ‌రింత అప‌న‌మ్మకం.. అవిశ్వాసం పెరిగాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News