అసలైన వారెవరో ఈరోజు అర్థమవుతుందా?

నేడు జరిగే రాజ్యసభ ఎన్నికలకు టిడిపి సిద్దమైంది. గెలుపుకు అవసరం అయిన బలం లేకపోయినా ప్రతిపక్షం బరిలో నిలిచింది. అధికార పార్టీ నుంచి నలుగురు సబ్యులు బరిలో [more]

Update: 2020-06-19 00:30 GMT

నేడు జరిగే రాజ్యసభ ఎన్నికలకు టిడిపి సిద్దమైంది. గెలుపుకు అవసరం అయిన బలం లేకపోయినా ప్రతిపక్షం బరిలో నిలిచింది. అధికార పార్టీ నుంచి నలుగురు సబ్యులు బరిలో దిగగా…టిడిపి నుంచి వర్ల రామయ్య పోటీ చేస్తున్నారు. పార్టీ వీడిన ఎమ్మెల్యేలకు కూడా విప్ జారీ చేసి టిడిపి ఒత్తిడి రాజకీయం చేస్తోంది. ఆంధ్ర్రప్రదేశ్ లో నాలుగు రాజ్యసభ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. నలుగురు సభ్యులు గెలిచేందుకు అవకాశం ఉన్న సందర్భంలో ఐదుగురు పోటీలో నిలవడంతో ఎన్నిక అనివార్యమయింది.

ఐదుగురు బరిలో…..

అధికార పార్టీ నుంచి నలుగురు పోటీ చేస్తుండగా….టిడిపి కూడా అభ్యర్థిని దింపి పోటీకి తెరలేపింది. నేటి ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. దీని కొసం అసెంబ్లీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వాస్తవంగా టిడిపికి రాజ్య సభ సభ్యుని ఎన్నికకు అవసరం అయ్యే బలం శాసన సభలో లేదు. అయినప్పటికీ రాజకీయ వ్యూహంలో భాగంగా వర్ల రామయ్యను పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయించింది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో టిడిపి ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. 23 మంది సభ్యులు ఉన్న టిడిపిలో ముగ్గురు సభ్యులు కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరిపార్టీ నీ వీడి వెళ్లారు. దీంతో రాజ్య సభ ఎన్నికల్లో పార్టీ విప్ ఇచ్చింది. ఇప్పుడు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు లు కూడా విప్ ను పాటించి వర్ల రామయ్యకు ఓటు వెయ్యాల్సి ఉంటుంది.

టీడీపీ విప్ జారీ చేసి….

పార్టీ తో విభేదించినా విప్ ఉంది కాబట్టి వర్ల రామయ్యకే ఓటు వెయ్యక తప్పని పరిస్థితి ఉంటుందని టిడిపి చెపుతోంది. పార్టీ వీడిన సభ్యులను ఇబ్బంది పెట్టేందుకే విప్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఒక వేళ ఆ ముగ్గురు సబ్యులు విప్ ఉల్లంఘిస్తే చర్యలకు డిమాండ్ చేసే అవకాశం టీడీపీకి ఉంటుంది. వల్లభనేని వంశీ, మద్దాల గిరిధర్ లు వైసీపీకి ఓటు వేస్తామని చెప్తున్నారు. కరణం బలరాం మాత్రం ఓటింగ్ కి గైర్హాజరు అవుతారని
తెలుస్తోంది.

కొందరు ఎమ్మెల్యేలపై అనుమానం….

టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అనారోగ్య కారణాలతో ఓటింగ్ కు రాలేనని పార్టీకి చెప్పినట్టు సమాచారం. వర్ల రామయ్య కు పోలింగ్ లో ఏజెంట్ గా ఎమ్మెల్సీ ఆశోక్ బాబు ను అధిష్టానం నియమించింది. పార్టీ తరుపున ఏజెంట్ గా మాజీ మంత్రి ఆలపాటి రాజా ఉంటారు. ఒటింగ్ లో పాల్గొనే ఎమ్మెల్యేలు ఏజెంట్ కు చూపించి తమ ఒటు పోల్ చెయ్యాలి అనే నిబంధన ఉందని టిడిపి చెపుతోంది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో కూడా సీక్రెట్ ఓటింగ్ జరుగుతుందని వైసీపీ అంటోంది. గెలవలేమని తెలిసినా ఎమ్మెల్యేల్లో కట్టడి కోసం చంద్రబాబు ఈ ప్రయత్నం చేశారంటున్నారు. మరి ఎమ్మెల్యేలు చంద్రబాబుకు ఝలక్ ఇస్తారా? అండగా నిలుస్తారా? అన్నది ఈరోజు తేలనుంది.

Tags:    

Similar News